• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Great Indian Festival 2023: కలలో కూడా ఊహించని డిస్కౌంట్లతో వాషింగ్‌ మిషన్లు.. ఛాన్స్‌ వదులుకోవద్దు!

    ప్రస్తుత కాలంలో వాషింగ్‌ మిషన్‌ అత్యవసరంగా మారిపోయింది. ఒకప్పుడు సంపన్నుల ఇళ్లకే పరిమితమైన ఈ వాషింగ్‌ మిషన్లను ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ కొనుగోలు చేస్తున్నారు. తద్వారా తమ ఇళ్లల్లోని గృహిణుల పని భారాన్ని తగ్గిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో పండగ సీజన్‌ ప్రారంభం కావడంతో అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ (Amazon Great Indian Festival) సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌ అక్టోబర్‌ 8-15 తేదీల మధ్య జరగనుంది. అయితే ఈ సేల్‌ ప్రారంభానికి ముందే వాషింగ్‌ మిషన్స్‌పై అమెజాన్‌ భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. కొత్తగా వాషింగ్‌ మిషన్ తీసుకోవాలని భావిస్తున్నవారికి ఇదే బెస్ట్‌ టైమ్ అని చెప్పవచ్చు. 

    Samsung 7 kg Semi-Automatic

    టెక్‌ దిగ్గజం శామ్‌సంగ్‌.. అద్బుతమైన వాషింగ్‌ మిషన్స్‌ను తయారు చేస్తోంది. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయేలా Samsung 7 kg Washing Machine తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ వాషింగ్‌ మిషన్‌కు మంచి డిమాండ్ ఉంది. దీని అసలు ధర రూ.13,500. కానీ అమెజాన్‌ ఈ వాషింగ్‌ మిషన్‌ను రూ.10,990 అందిస్తోంది. 

    LG 6.5 Kg 5 Star Inverter 

    ప్రముఖ టెక్‌ కంపెనీ LG కూడా మంచి వాషింగ్‌ మిషన్స్‌ తయారు చేస్తోంది. ఈ కంపెనీ వాషింగ్‌ మిషన్‌ కొనాలని భావించే వారికి ‘LG 6.5 Kg Washing Machine’ చక్కటి ఎంపిక కాగలదు. ఇది మీడియం రేంజ్‌ ఫుల్లీ ఆటోమేటిక్‌ వాషింగ్‌ మిషన్‌. రూ.24,990 ధర కలిగిన ఈ వాషింగ్‌ మిషన్‌ను 36% డిస్కౌంట్‌తో రూ.15,990కే అమెజాన్‌ అందిస్తోంది. 

    Samsung 6.5 Kg Automatic 

    శాంసంగ్‌ తీసుకొచ్చిన Samsung 6.5 Kg Automatic Washing Machineపై వినియోగదారుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. దీని ఒరిజినల్‌ ప్రైస్‌ రూ.22,050. అమెజాన్‌ దీనిపై 27% డిస్కౌంట్‌ ప్రకటించింది. ఫలితంగా ఈ వాషింగ్‌ మిషన్‌ను రూ.15,990 పొందవచ్చు. 

    Samsung 6.0 Kg Front Load

    ఈ వాషింగ్‌ మిషన్‌లో 10 రకాల వాష్‌ ప్రోగ్రామ్స్‌ (Wash programs) ఉన్నాయి. 1000 RPM spin స్పీడు, ఫాస్టర్‌ డ్రైయింగ్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. కపుల్స్‌, చిన్నఫ్యామిలీకి ఈ వాషింగ్‌ మిషన్‌ సరిగ్గా సరిపోతుంది. దీని అసలు ధర రూ.26,900. అమెజాన్‌లో 15% డిస్కౌంట్‌తో ఇది రూ.22,990కే దీన్ని పొందవచ్చు.

    LG 6.5 Kg Front Load Washing Machine

    LG నుంచి మీడియం రేంజ్‌లో లభిస్తున్న అత్యుత్తమమైన వాషింగ్‌ మిషన్‌గా దీన్ని చెప్పుకోవచ్చు. దీని ఒరిజినల్‌ ప్రైస్‌ రూ. 24,990. అమెజాన్‌ దీనిపై 34% డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తోంది. ఫలితంగా వాషింగ్‌ మిషన్‌ను రూ.24,990 దక్కించుకోవచ్చు. 

    Samsung 8 Kg Front Load

    అధిక సామర్థ్యమున్న ఫ్రండ్‌ లోడ్‌ వాషింగ్‌ మిషన్లలో Samsung 8 Kg Front Loadకు మార్కెట్‌లో మంచి గుడ్‌విల్‌ ఉంది. దీనిపై కూడా అమెజాన్‌ మంచి ఆఫర్‌ ఇస్తోంది. దీని అసలు ధర రూ. 45,000. దీనిని అమెజాన్‌ 29% డిస్కౌంట్‌తో రూ.31,990 అందిస్తోంది. 

    IFB 7 Kg 5 Washing Machine 

    IFB కూడా నాణ్యత గల ఫ్రంట్‌ లోడ్‌ వాషింగ్‌ మిషన్లను అందిస్తుంది. ముఖ్యంగా ఆ కంపెనీ తీసుకొచ్చిన ‘IFB 7 Kg 5 Front Load Washing Machine’ మార్కెట్‌లో గుడ్‌విల్‌ను కలిగి ఉంది. చిన్న, మధ్యతరహా కుటుంబాలకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఇందులో కూడా 10 రకాల వాషింగ్‌ మోడ్స్‌ ఉన్నాయి. 1000 RPM spin స్పీడ్‌ను ఇది కలిగి ఉంది. ఈ వాషింగ్‌ మిషన్‌ కంపెనీ ప్రైస్‌ రూ.37,090. దీనిని అమెజాన్‌ 22% రాయితీతో రూ.28,990లకు అందిస్తోంది. 

    LG 7 Kg Washing Machine 

    LG కంపెనీకి చెందిన ఫ్రంట్‌ లోడ్ వాషింగ్‌ మిషన్‌ కోరుకునే వారు ‘LG 7 Kg Washing Machine’ను పరిశీలించవచ్చు. అమెజాన్‌ దీనిపై కూడా భారీ రాయితీ ఇస్తోంది. ఈ వాషింగ్‌ మిషన్‌ 1200 RPM spin స్పీడ్‌తో రావడం విశేషం. అమెజాన్‌లో దీనిపై 32% డిస్కౌంట్‌ నడుస్తోంది. ఫలితంగా రూ.43,990 ఉన్న ఈ వాషింగ్ మిషన్ ధర.. రూ. 29,990లకు దిగి వచ్చింది. 

    Samsung 7 Kg AI Control

    శాంసంగ్‌ నుంచి వచ్చిన ఈ అడ్వాన్స్‌డ్‌ వాషింగ్‌ మిషన్ కూడా అమెజాన్‌లో రాయితీకి లభిస్తోంది. రూ.48,500 ఒరిజినల్‌ ప్రైస్‌ కలిగిన ఈ శాంసంగ్‌ను రూ.31,990 ఆఫర్‌ చేస్తోంది. 

    LG 8 Kg Fully Automatic 

    LG నుంచి పవర్‌ఫుల్‌ ఫ్రంట్‌ లోడ్‌  వాషింగ్‌ మిషన్‌ కోరుకునేవారు LG 8 Kg Fully Automatic ట్రై చేయవచ్చు. దీన్ని కూడా అమెజాన్‌ భారీ డిస్కౌంట్‌కే అందిస్తోంది. రూ.51,990 ధర కలిగిన ఈ వాషింగ్‌మిషన్‌ను అమెజాన్‌ రూ.33,990 అందుబాటులోకి తెచ్చింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv