సాధారణంగా మన దంతాలతో మహా అయితే 2 కిలోల బరువును లాగగలం. కానీ, ఓ వ్యక్తి 15,730 కిలోల బరువైన ట్రక్కుని లాగి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. దంతాలతో అతి బరువైన లోడు గల వాహనాన్ని లాగిన వ్యక్తిగా చరిత్రకెక్కాడు. ఈజిప్టులో ఈ ప్రయోగం జరిగింది. అశ్రఫ్ మహ్మద్ సులేమాన్ ఈ రికార్డును కొల్లగొట్టాడు. 2021 జూన్‌లో ఈ సాహసాన్ని వీడియోలో రికార్డు చేయగా.. తాజాగా ఇన్‌స్టా అకౌంట్ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డు పోస్ట్ చేసింది. దీనిపై కొందరు నెటిజన్లు వినూత్నంగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఆ వ్యక్తి దంతవైద్యుడు ఎవరో?’ అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
-
Screengrab Instagram:GunnisWorldRecords
-
Screengrab Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్