• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Guntur Kaaram Collections: ‘గుంటూరు కారం’ ఇంకా నష్టాల్లోనే ఉందా.! లెక్కలు ఏం చెబుతున్నాయి?

    సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Trivikram) కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినప్పటికీ మంచి వసూళ్లను రాబడుతూ వస్తోంది. ఈ సినిమా విడుదలై నేటితో సరిగ్గా 13 రోజులు కాగా 12 రోజుల కలెక్షన్స్‌ వివరాలు బయటకొచ్చాయి. వాటి ప్రకారం ‘గుంటూరు కారం’ వరల్డ్‌వైడ్‌గా రూ.236.02 కోట్ల గ్రాస్ సాధించింది. అయినా కూడా ఇవాళ్టికి ఈ చిత్రం నష్టాల్లో ఉందని చర్చ జరుగుతోంది. ఇందులో నిజమెంత? ‘గుంటూరు కారం’ వాస్తవ కలెక్షన్లు ఎలా ఉన్నాయి? అసలు గ్రాస్‌, నెట్‌, షేర్‌ మధ్య ఉన్న తేడా ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం. 

    గ్రాస్‌, నెట్‌, షేర్‌ అంటే ఏమిటి?

    సాధారణంగా గ్రాస్ అంటే (Guntur Kaaram Collections) మొత్తంగా అమ్మిన టికెట్ల మీద వచ్చే డబ్బులు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలవ్యాప్తంగా మూడు లక్షల టికెట్లు తెగితే ఆ మూడు లక్షల టికెట్లకు ఎంత ఆదాయం వచ్చింది? అనేది గ్రాస్‌ (Gross Collections)గా లెక్క వేస్తారు. అదే షేర్ విషయానికి వస్తే థియేటర్ల రెంట్ అలాగే మెయిన్టెనెన్స్ ఛార్జీలను ఈ గ్రాస్ వసూళ్ల నుంచి మినహాయించి ఆ మిగిలిన డబ్బును షేరుగా లెక్క వేస్తారు. అంటే ఈ డబ్బు మాత్రమే థియేటర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు అందుతుంది. ఇక నెట్ (Net Collections) విషయానికి వస్తే గ్రాస్‌లో నుంచి ఎంటర్టైన్మెంట్ టాక్స్ అంటే ప్రభుత్వానికి వెళ్లే వినోద పన్ను మినహాయిస్తే దాన్ని నెట్ కలెక్షన్స్ అంటారు.

    ‘గుంటూరు కారం’ బిజినెస్‌!

    సినిమా విడుదలకు ముందే జరిగే ఆర్థిక కార్యక్రమాలను సినీ పరిభాషలో ప్రీ-బిజినెస్‌గా పరిగణిస్తారు. ‘గుంటూరు కారం’ చిత్రానికి సంబంధించి నైజాంలో రూ.42.01 కోట్లు, సీడెడ్‌లో రూ.13.74 కోట్లు, ఏపీలోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 46.35 కోట్ల బిజినెస్ అయింది. ఓవరాల్‌ తెలుగు రాష్ట్రాల్లో రూ.102.09 కోట్లకు ‘గుంటూరు కారం’ అమ్ముడైంది. అలాగే, కర్ణాటక సహా రెస్టాఫ్ ఇండియాలో రూ.9.02 కోట్లు, ఓవర్సీస్ హక్కులు రూ.20.09 కోట్లతో కలిపి మొత్తంగా ‘గుంటూరు కారం’ బిజినెస్‌ విడుదలకు ముందు రూ.132.50 కోట్లు జరిగింది. ఈ ప్రీ బిజినెస్‌పై ఎలాంటి ప్రభుత్వ ట్యాక్స్‌లు ఉండవు. 

    నెట్‌ కలెక్షన్స్ ఎంత?

    గుంటూరు కారం సినిమా లాభాల్లోకి రావాలంటే విడుదలకు ముందు జరిగిన రూ.132.50 కోట్ల మార్క్‌ను దాటాల్సి ఉంటుంది. ప్రస్తుతం 12 రోజులకు రూ.230 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టినప్పటికీ అందులో ప్రభుత్వ ట్యాక్స్‌లు మిళితమై ఉండటం వల్ల దాన్ని లాభాలుగా పరిగణించలేము. కాబట్టి ట్యాక్స్‌లను తీసివేయడం ద్వారా వచ్చే నెట్‌ కలెక్షన్లతో ప్రి బిజినెస్‌ లెక్కలను పోల్చడం ద్వారా ఆ చిత్రం లాభాల్లో ఉందా? లేదా? అన్న విషయాన్ని సినీ విశ్లేషకులు చెబుతుంటారు. దీని ప్రకారం ‘గుంటూరు కారం’  నెట్‌ కలెక్షన్లు (Guntur Kaaram Net Collections) సాక్నిక్‌ వెబ్‌సైట్‌ ప్రకారం రూ.120.2 కోట్లుగా ఉంది. అంటే ప్రీ బిజినెస్‌ లెక్కలతో పోలిస్తే ఈ చిత్రం ఇంకా రూ.10 కోట్ల వరకూ వెనకబడి ఉంది. 

    తగ్గిన జోరు.. ఇక కష్టమే!

    ‘గుంటూరు కారం’ చిత్రానికి తొలిరోజు వచ్చిన టాక్‌ను బట్టి చూస్తే ఈ స్థాయిలో ఆ చిత్రం వసూళ్లు రాబట్టడం గొప్ప విషయమే. మహేష్‌కు ఉన్న క్రేజ్‌ వల్లే ఈ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయని చెప్పవచ్చు. అయితే గత కొన్ని రోజుల నుంచి ‘గుంటూరు కారం’ జోరు తగ్గుతూ వస్తోంది. రోజు రోజుకు మూవీ కలెక్షన్స్‌ పడిపోతూ వస్తున్నాయి. పైగా ఈ వీకెండ్‌లో కొత్త సినిమాలు రాబోతున్నాయి. వాటి ప్రభావం ‘గుంటూరు కారం’ కలెక్షన్లపై పడే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకుల అంచనా. మరి కొత్త సినిమాల దూకుడుని తట్టుకొని మహేష్‌ చిత్రం ఏ మేరకు ప్రీ బిజినెస్‌ మార్క్‌ను అందుకుంటుందో లేదో వేచి చూడాలి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv