రోజు రోజుకూ జుట్టు పలచబడిపోతోందా? షాంపూల మీద షాంపూలు మార్చినా ప్రయోజనం లేదా? ఇది ఇప్పుడు ఒకరిద్దరిది కాదు చాలా మంది యువతలో అతి పెద్ద సమస్య. పెళ్లి కాకముందే అర ఎకరం పోయి అంకుల్స్ లా కనిపిస్తున్నామని యువకులకు బాధపడుతున్నారు. అలాగే అమ్మాయిలు కళ్ల ముందే రాలిపోతున్న కురులను చూసి గొల్లుమంటున్నారు. అసలు ఈ జుట్టు రాలేందుకు కారణాలేంటి?వాటిని ఎలా కాపాడుకోవాలి? ఒత్తైన కురుల కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
జుట్టు రాలడానికి కారణాలు
జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంతమందికి సహజంగా జన్యుపరంగా రాలిపోవచ్చు. కానీ ఎక్కువ మందిలో కాలుష్యం, రసాయనాలు, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి తదితర కారణాలతో రాలిపోతుంది.
జుట్టు రాలడం తగ్గించే వంటింటి చిట్కాలు
ఎగ్ మాస్క్:
గుడ్లలో ఉండే జింక్, ప్రోటీన్లు జుట్టు పెరగడాన్ని ప్రోత్సహిస్తాయి.
- గుడ్డు తెల్ల సొనను వేరు చేసి అందులో ఒక టీ స్పూన్ చొప్పున ఆలివ్ ఆయిల్, తేనె కలపండి
- దీనిని ఒక పేస్ట్ లాగా కలిపి కురుల మొదళ్ల వరకు పట్టించండి
- 20 నిమిషాల తర్వాత చన్నీటితో తేలికపాటి షాంపూ వాడి కడిగేయండి
గ్రీన్ టీ
గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిండట్లు జుట్టు రాలడాన్ని తగ్గించి పెరిగేలా ప్రోత్సహిస్తాయి
- వేడి నీటిలో మీ జుట్టుకు సరిపడా గ్రీన్ టీ బ్యాగులు వేయండి
- అది చల్లబడ్డాక జుట్టుపై పోస్తూ మసాజ్ చేయండి
- గంటసేపు అయ్యాక చన్నీటితో జుట్టును కడిగేయండి
బీట్ రూట్ జూస్
బీట్ రూట్ లో ఉండే అత్యంత ఆవశ్యక పోషకాలు మాడుపై ఉండే హానికారక పదార్థాలను తొలగించి జుట్టు పెరగడాన్ని ప్రోత్సహిస్తాయి.
- ఐదారు బీట్ రూట్లను ఐదారు హెన్నా ఆకులతో కలిపి నీటిలో ఉడకబెట్టి పేస్ట్ చేయండి.
- దీనిని జుట్టుకు పట్టించి ఓ 20 నిమిషాలు ఆగాక కడిగేయండి.
కలబంద
కలబంద సహజంగానే జుట్టుకు మేలు చేస్తుంది
- కలబంద తీసుకుని దానిని నేరుగా జుట్టుకు పట్టించండి
- ఓ 45 నిమిషాలు ఆగాక నీటితో కడిగేయండి
- ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయవచ్చు
మెంతుల పేస్ట్
- మెంతులు ఆరోగ్యకరమైన జుట్టుకు చాలా ఉపయోగపడతాయి
- మెంతులను ఒక రాత్రంతా నీటిలో నానబెట్టండి
- వాటిని ఉదయం పేస్ట్ లాగా చేసుకుని జుట్టుకు పట్టించండి
- ఓ అరగంట ఆగి నీటితో కడిగేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేయవచ్చు
ఉల్లి రసం
ఉల్లి ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మాడుపై ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. సల్ఫర్ రక్త ప్రసరణను పెంచుతుంది.
- ఉల్లి పాయలను గ్రైండ్ చేసి జ్యూస్ తీయండి
- దీనిని జుట్టుకు పట్టించి ఓ 20-30 నిమిషాల తర్వాత కడిగేయండి
జుట్టు రాలడం తగ్గించేందుకు ఆయుర్వేద ఉత్పత్తులు
జుట్టు రాలడం తగ్గేలా మార్కెట్లో అనేక ఆయుర్వేద నూనెలు, షాంపూలు, పేస్ట్ లు అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని
- ధాత్రి చెంపారతి తాలి షాంపూ( dhathri chemparathi thaali shampoo)
- డాబర్ కెరాటెక్స్ ఆయిల్
- వేదిక్స్ హెయిర్ కేర్ ఉత్పత్తులు
- మామా ఎర్త్ షాంపూ, ఆయిల్స్
- ఇందులేఖ బృంగహెయిర్ ఆయిల్
- బైద్యనాథ్ మహా బృంగరాజ్ ఆయిల్
- పతంజలి దివ్య మహాబృంగ ఆయిల్
- TNW ఆనియన్ హెయిర్ ఆయిల్
జుట్టు రాలడం తగ్గించే రసాయన ఉత్పత్తులు
మినాక్సిడిల్
ఇది షాంపూ, నురగ( foam ), లోషన్ రూపంలో దొరుకుతుంది. మహిళలైతే రోజుకు ఒకసారి పురుషులైతే రోజుకు రెండుసార్లు వినియోగిస్తే ప్రయోజనం ఉంటుంది. అన్ని మెడికల్ షాపుల్లోనూ దొరుకుంది.
స్పైరోనోలాక్టోన్ మాత్రలు
హార్మోన్ సంబంధింత సమస్యలకు ఈ మాత్రలు ఉపయోగపడతాయి. అయితే వీటిని వినియోగించేందుకు డాక్టర్ సూచన తప్పనిసరిగా కావాలి. మెడికల్ షాపుల్లో ప్రెస్క్రిప్షన్ లేకుండా ఇవ్వరు
అసలు జుట్టు రాలకుండా కాపాడుకోవడమెలా
జుట్టు కాపాడుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి అవి
- వారానికి మూడు సార్లైనా జుట్టుని వాష్ చేయాలి. కానీ వేడినీటిని ఉపయోగించవద్దు.
- రసాయనాలు లేని షాంపులు వినియోగించాలి. సల్ఫేట్స్, పారాబెన్స్ మీ జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి
- తరచుగా కండీషనింగ్ చేస్తుండాలి. కానీ మాడుకు కండీషనర్ తగలకుండా జాగ్రత్త వహించాలి
- ఆయిల్స్ జుట్టుకు పోషకాలను అందిస్తాయి. కాబట్టి కొబ్బరి, ఆల్మండ్ తదితర వాటితో ఆయిలింగ్ చేస్తుండాలి.
- వెడల్పాటి దువ్వెనతో దువ్వుకోవడం మంచిది
- జుట్టుకు పోషకాలు అందించే గుడ్లు, ఆకుకూరలు, చేపలు తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి
- ఒత్తిడి ఎక్కువైతే జుట్టు రాలిపోతుంది. కాబట్టి ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!