నేడు దివంగత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పుట్టినరోజు. సిరివెన్నెల మే 20, 1955 ఆంధ్ర ప్రదేశ్‌లోని అనకాపల్లి మండలంలో జన్మించారు. గతేడాది నవంబర్ 30న అనారోగ్యం కారణంగా మరణించడంతో సినీ ఇండ్ట్రీకి తీరని లోటుగా మారింది. సిరివెన్నెలను 2019లో పద్మశ్రీతో సత్కరించారు. కెరీర్‌లో ఉత్తమ గేయ రచయితగా 11 నంది అవార్డులు.. నాలుగు ఫిలింఫేర్ సొంతం చేసుకున్నాడు . ఈరోజు సీతారామశాస్త్రి జన్మదినం సందర్భంగా ఆయన రచించిన వేలాది పాటల్లో కొన్ని ప్రత్యేకంగా నిలిచిపోయిన పాటల్ని గుర్తుచేసుకుందాం.
విధాత తలపున ప్రభవించినది
కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల సినిమాలో పాటలతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. అప్పటి నుంచి ఆ సినిమా పేరే ఇంటి పేరుగా మారిపోయింది. ఈ సినిమాకు పాటల రచయిత పలు అవార్డులను సొంతం చేసుకున్నాడు.
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన గాయం సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అనే పాటను రాయడంతో పాటు ఆ పాటలో కనిపించారు. ఈ పాటతో ఆయనకు ఉన్న సమాజ స్పృహను అర్థం చేసుకోవచ్చు. ఆర్‌జీవి చాలాసార్లు సిరివెన్నెల రచనల గురించి, అందులో ఉన్న లోతైన అర్థాల గురించి మాట్లాడుతుంటాడు.
జగమంత కుటుంబం నాది
కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చక్రం సినిమాలో జగమంత కుటుంబం నాదీ..ఏకాకీ జీవితం నాది పాట ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. అయితే ఈ పాటను సిరివెన్నెల సినిమాల్లోకి రాకముందే రాసుకున్నాడట. కృష్ణవంశీ ఈ పాటను ఎన్నిసార్లు ఇవ్వమని అడిగినా ఇవ్వలేదట. కానీ చక్రం కథ విన్న తర్వాత ఆ సినిమాకు సరిగ్గా సరిపోతుందని ఈ పాటను సినిమా కోసం ఇచ్చినట్లు సీతారామశాస్త్రి గతంలో తెలిపాడు.
ఆర్‌ఆర్‌ఆర్‌తో దోస్తీ
ఆర్ఆర్ఆర్ సినిమాలో దోస్తీ పాటను కూడా సిరివెన్నెల రాయడం విశేషం. సినిమా మొత్తం సారాంశాన్ని ఒకే పాటలో గొప్పగా వివరించారు. సినిమాలో ఒక సందర్భం చెప్పి పాట రాయమని అడిగితే సిరివెన్నెల అసలు రాయడట. మొత్తం కథ చెప్పి ఆ పాట సమయంలో ఆ పాత్రల భావోద్వేగాలు ఏంటి ఎలాంటి సందర్భంలో వస్తుంది అని తెలుసుకున్న తర్వాత దాన్ని మొత్తం అర్థం చేసుకొని రంగరించి పాటను రాస్తాడని రాజమౌళి ఇటీవల ఆర్ఆర్ఆర్ సమయంలో చెప్పాడు.
చివరి పాట ఇదే
సిరివెన్నెల రాసిన చివరి పాట శ్యామ్ సింగరాయ్‌లోని సిరివెన్నెల సాంగ్. అనారోగ్యంగా ఉన్న సమయంలో సీతారామశాస్త్రి ఈ పాటను రాశాడట. సిరివెన్నెల అని ఎందుకు పాటలో ప్రత్యేకంగా పెట్టారు అని అడిగితే ఇదే నా చివరి పాట కావొచ్చు అందుకే సిరివెన్నెల పేరుతో రాసినట్లు చెప్పాడట. ఈ విషయాన్ని హీరో నాని, శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ వెల్లడించారు.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!