చిత్ర పరిశ్రమలో హీరోయిన్ సమంతది ప్రత్యేకమైన ప్రయాణం. ఏమాయ చేశావే చిత్రంతో జెస్సీగా పరిచయమై అందరి మనసుల్ని కొళ్లగొట్టింది సామ్. 2010లో కెరీర్ ప్రారంభించి దాదాపు 13 సంవత్సరాలుగా టాప్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సమంత ఇప్పటివరకు చేసిన సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ వర్తమాన హీరోయిన్స్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఆమెకున్నంత డైహార్ట్ ఫ్యాన్స్ హీరోయిన్స్‌లో మరెవరికి లేరని చెప్పవచ్చు. ఏప్రిల్ 28న ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటి వరకు సమంత చేసిన విభిన్న పాత్రలు ఓసారి గుర్తు చేసుకుందాం…
రంగస్థలం రామ లక్ష్మి
రామ్‌చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలంలో అచ్చమైన పల్లెటూరు అమ్మాయి పాత్రలో జీవించేసింది సమంత. ఆంధ్రా స్లాంగ్‌ను అచ్చుగుద్దినట్లు దింపేసింది. ఇందులో సామ్ చేసిన నటనకు మంచి మార్కులు పడ్డాయి.
మజిలీ శ్రావణి
నాగచైతన్య, సమంత నటించిన చిత్రం మజిలీ. ఇందులో భర్త ఏం చేసినా భార్య వెనకేసుకు వస్తూ ప్రేమించే పాత్రలో సామ్ నటన నెక్స్ట్ లెవల్. క్లైమాక్స్‌లో సమంత పర్‌ఫార్మెన్స్ కన్నీళ్లు పెట్టిస్తుంది. అంతలా క్యారెక్టర్‌ను ముందుకు తీసుకెళ్లింది.
ఓ బేబీ
సమంత హీరోయిన్‌గా వచ్చిన లేడి ఓరియెంటెడ్ ఇది. ఓ ముసలి వ్యక్తి కొన్ని కారణాల వల్ల యవ్వనంలోకి వెళ్తుంది. కానీ, ఆ పాత్రను చేసిన వ్యక్తిలానే నటించడం చాలా కష్టమైన పని. సీనియర్ యాక్టర్‌లా హావాభావాలు పండిస్తూ… చూడటానికి 25 ఏళ్లున్నా వయసు మాత్రం 60 ఏళ్లు అన్నట్లుగా కనిపించే పాత్రలో చించేసింది ఈ బ్యూటీ.
యశోద
అద్దె గర్భం కాన్సెప్ట్‌లో వచ్చిన యాక్షన్ సినిమా. ఇందులో సమంత పోరాట సన్నివేశాల్లో అదరగొట్టింది. తన కోసం చిక్కుల్లో పడిన చెల్లెల్ని కాపాడేందుకు ఆమె వేసే ఎత్తుగడలు, విలన్లతో పోరాటం వంటివి ఆకట్టుకున్నాయంటే ఆమెనే కారణం. బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలే వచ్చాయి.
శకుంతల
కాళిదాసు రచించి అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. మయోసైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ సినిమాను పూర్తి చేసింది. ఇందులో తన పాత్ర కోసం చాలానే కష్టపడింది. శకుంతల పాత్రలో జీవించింది. గ్లామర్ పరంగా ఏమాత్రం తగ్గకుండా నటించింది. బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చినప్పటికీ సామ్ చేసిన డిఫరెంట్ రోల్స్‌లో ఇదొకటని చెప్పవచ్చు.
పుష్ప ది రైజ్
పుష్ప చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ అంటూ ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
ఫ్యామిలీ మెన్ రాజీ
మనోజ్ బాజ్‌పేయ్ లీడ్ రోల్‌లో వచ్చిన ఫ్యామిలీ మెన్ సిరీస్ పార్ట్ 2లో సమంత విభిన్నమైన క్యారెక్టర్‌లో కనిపించింది. శ్రీలంక రెబల్ గ్రూప్ అంటే నక్సలైట్ పాత్రలో మెరిసింది సుందరి. డీ గ్లామరస్ రోల్‌లో కనిపించడమే కాకుండా బోల్డ్ సీన్‌లో నటించి షాకిచ్చింది.
సిటాడెల్
హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సిటాడెల్ సిరీస్‌ను బాలీవుడ్‌లో వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా పోషించిన యాక్షన్ రోల్‌ను సామ్ చేయనుంది. ఇప్పటికే షూటింగ్ కోసం చిత్రబృందంతో జత కట్టింది చెన్నై సుందరి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!