జపాన్‌కు చెందిన హోండా (Honda) కంపెనీ ద్విచక్రవాహనాల తయారీలో గణనీయమైన గుర్తింపును సంపాదించింది. హోండా బైక్‌ల ఇంధన సామర్థ్యం, దానిపై వినియోగదారుల్లో ఉన్న విశ్వసనీయతే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే హోండా మరో సరికొత్త బైక్‌ను లాంచ్ చేసింది. హోండా సీబీ350 (Honda CB350)ని ప్రపంచ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ రెట్రో బైక్ ఫీచర్స్, ధర ఇతర విశేషాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
స్టైలిష్ డిజైన్
‘రెట్రో క్లాసిక్ హోండా సీబీ350’ను స్టైలిష్ లుక్‌తో తీసుకొచ్చారు. ఇందులో టియర్ షేప్డ్ ఫ్యూయల్ ట్యాంక్, ఫుల్లీ ఆల్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్ సెటప్ ఉంది. రౌండ్ షేప్ ఎల్‌ఈడీ లైట్స్ ఇండికేటర్లు బైక్‌కు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్ప్లిట్ సీటింగ్ అరేంజ్‌మెంట్, మెటల్ ఫెండర్స్, ఫ్రంట్ ఫోర్క్‌లను కవర్ చేసే మెటల్ మెటీరియల్ బైక్‌కు మంచి లుక్‌ను అందించాయి.
ఇంజిన్ సామర్థ్యం
348.36 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగిన ఈ బైక్.. 30ఎన్‌ఎం టార్క్, 20.78బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. ఇది 5,500 rpm వద్ద 20.78 BHP, 3,000 rpm వద్ద 29.4 Nm గరిష్ట పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
వాయిస్ కంట్రోల్ సిస్టమ్
ఈ బైక్‌లో హెరిటేజ్ ఇన్‌స్పైర్డ్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే ఉంటుంది. దీని ద్వారా రైడర్ వేగం, RPM, పెట్రోల్ సామర్థ్యం వంటి కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని పర్యవేక్షించవచ్చు. సెంటర్ కన్సోల్ అనేది హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్‌కు సపోర్ట్ చేస్తుంది.
బ్రేక్ సిస్టమ్
పవర్‌ఫుల్ బ్రేక్ సిస్టమ్‌తో ఈ బైక్ వచ్చింది. బైక్ ముందువైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ ఉంటుంది. వెనుక భాగం నైట్రోజన్ ఛార్జ్డ్ షాక్ అబ్జార్బర్స్ సపోర్ట్‌గా ఉంటాయి. బ్రేకింగ్ సిస్టమ్‌లో ముందువైపు 310 mm సింగిల్ డిస్క్, వెనుకవైపు 240 mm డిస్క్ ఉంటుంది. ఇది డ్యూయల్ ఛానల్ ABSతో కనెక్ట్ అయి ఉంటాయి. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ బైక్‌కు ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
మైలేజ్
ఈ హోండా బైక్‌కు 15 లీటర్ల సామర్థ్యమున్న పెట్రోల్ ట్యాంక్‌ను ఫిక్స్ చేశారు. హోండా సీబీ350 బైక్‌పై లీటర్‌కు 32 km/l మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
కలర్ ఆప్షన్స్
ఈ బైక్‌ను ఐదు కలర్ ఆప్షన్స్‌లో లాంచ్ చేశారు. ప్రీషియస్ రెడ్ మెటాలిక్, పర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ క్రస్ట్ మెటాలిక్, మ్యాట్ మార్షల్ గ్రీన్ మెటాలిక్, మ్యాట్ డ్యూన్ బ్రౌన్ అనే రంగుల్లో ఈ బైక్ అందుబాటులోకి రానుంది.
ధర ఎంతంటే?
ఈ బైక్ మెుత్తం రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. CB350 DLX వేరియంట్ ధరను రూ.1.99లక్షలుగా నిర్ణయించారు. అలాగే DLX Pro వేరియంట్ ధర రూ.2.17 లక్షలు (ఎక్స్‌షోరూం ధర).