జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ హోండా నుంచి మరో సరికొత్త SUV కార హోండా ఎలివేట్‌ను (Honda Elevate) ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. మిడ్ సైజ్ SUV సెగ్మెంట్‌లో దీనిని ప్రిమీయం ఫీచర్స్‌తో హోండా తీసుకొచ్చింది. ఈ సెగ్మెంట్లో ఇప్పటికే హ్యూందాయ్ (Hyundai Creta) కియా సెల్టోస్ (Kia Seltos) మారుతి సుజుకీ (Grand Vitara) గట్టి పోటీని అయితే ఇస్తున్నాయి. అలాగే ఈ సెగ్మెంట్లో వోక్స్‌వ్యాగన్ టైగాన్, స్కోడా కూషాక్ కూడా మార్కెట్‌లో మెజార్టీ వాటాను ఆక్రమించాయి. మరి వీటికి పోటీగా తీసుకొచ్చిన హోండా ఎలివేట్ ఏమేరకు ఆకట్టుకోనుందో ఈ కథనంలో చూద్దాం.
హోండా ఎలివేట్ ప్రత్యేకతలు
ఇంజిన్ సామర్థ్యం
హోండా ఎలివేట్ మోడల్ ప్రస్తుతం ఇండియాలో పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. 1498 cc పెట్రోల్ ఇంజిన్ 119.35bhp@6600rpm శక్తిని, 145Nm@4300rpm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా ఎలివేట్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండు వేరియేషన్స్‌ల్లోనూ అందుబాటులో ఉంది. హోండా ఎలివేట్ 458 లీటర్ల బూట్ స్పేస్, 220 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. ఎలివేట్ కర్బ్ బరువు 1206-1258 కిలోలు. హోండా ఎలివేట్ పొడవు 4312 మిమీ, వెడల్పు 1790 మిమీ, ఎత్తు 1650 మిమీ^3 మిమీ కన్ఫిగరేషన్స్‌తో నిర్మితమైంది.
ట్యాంక్ కెపాసిటీ/ మైలేజ్
దీని ఫ్యూయేల్ ట్యాంక్ 40 లీటర్ల కెపాసిటీని కలిగి ఉంటుంది. కంపెనీ ఇన్ఫో ప్రకారం నార్మల్‌గా లీటర్‌కు 15.31kmpl-16.92kmpl వరకు మైలేజ్ ఇస్తుందని తెలిసింది. యూజర్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం లాంగ్ డిస్టెన్స్‌ల్లో 22 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని పలు సమీక్షల్లో తేలింది.
డీజైన్ &క్యాబిన్
హోండా ఎలివేట్ అట్రాక్టివ్ డిజైన్‌లో చూడగానే ఆకట్టుకుంటుంది. అన్ని సెఫ్టీ మెజర్స్‌తో పాటు కంఫర్టబుల్ క్యాబిన్ ఎక్స్‌ఫీరియన్స్‌ను అయితే అందిస్తోంది. ఎలివేట్ ఇంజిన్ మోడల్ సైతం హోండా సిటీ మాదిరి 1.5 లీట్ NA పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది సిక్స్ స్పీడ్ మాన్యువల్, సెవెన్ స్పీడ్ కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (CVT) వేరియంట్లో లభిస్తోంది.
టెక్నికల్ ఫీచర్స్
ఈ కారు 17 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌తో రన్ అవుతుంది. మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ క్లైమెట్ కంట్రోల్, వంటి హైఎండ్ ఫీచర్లు ఉన్నాయి. 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. వైర్‌లెస్ కార్ కనెక్ట్ టెక్నాలజీకి సపోర్ట్ చేసే 8 స్పీకర్స్ ఇందులో అమర్చారు. ఇక క్యాబిన్ భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, స్పీడ్ వార్నింగ్, పార్కింగ్ సెన్సర్, లేన్ కీప్ అసిస్టెన్స్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంటెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ఫీచర్లు ఉన్నాయి. మూడు సంవత్సరాల పాటు అన్‌లిమిటెడ్ కిలోమీటర్ వారెంటీతో పాటు 5 ఏళ్ల ఎక్సెడెంటెండ్ వారెంటీ, 10 ఏళ్ల పాటు రోడ్ సైడ్ అసిస్టెన్స్ సదుపాయం వంటి వాటిని కంపెనీ అయితే ఆఫర్ చేస్తోంది.
హోండా ఎలివేట్ ధర
హోండా ఎలివేట్ మాన్యువల్ వేరియంట్స్ ఎక్స్ షోరూం ధర రూ.10.99 లక్షల- రూ.14.9 లక్షల మధ్య ఉంది. ఇక ఆటోమేటిక్ వేరియంట్ ప్రైస్ రూ.13.2L- రూ.15.99L మధ్య ఉన్నాయి. మాన్యువల్ వేరియంట్ మైలేజీ లీటర్‌కు 15.31 కిలోమీటర్లు కాగా.. సీవీటీ వేరియంట్ మైలేజీ 16.92 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది.
కలర్ వేరియంట్స్
హోండా ఎలివేట్ మొత్తం 10 కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఏడు సింగిల్ టోన్ కలర్ ఆప్షన్లు, మూడు డ్యయూల్ టోన్ కలర్ ఆప్షన్స్‌తో ఎలివేట్ అందుబాటులో ఉన్నాయి. అవి ఫీనిక్స్ ఆరెంజ్ పెర్ల్ Phoenix Orange Pearl, అబ్సిడియన్ బ్లూ పెర్ల్ (Obsidian Blue Pearl), రేడియంట్ రెడ్ మెటాలిక్( Radiant Red Metallic), ప్లాటినం వైట్ పెరల్ (Platinum White Pearl), గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్ (Golden Brown Metallic), లూనార్ సిల్వర్ మెటాలిక్ (Lunar Silver Metallic), మెటిరాయిడ్ గ్రే మెటాలిక్(Meteoroid Gray Metallic), ఫీనిక్స్ ఆరెంజ్ పెర్ల్ విత్ క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ రూఫ్ (Phoenix Orange Pearl with Crystal Black Pearl Roof), ప్లాటినం వైట్ పెర్ల్ విత్ క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ రూఫ్ (Platinum White Pearl with Crystal Black Pearl Roof), రేడియంట్ రెడ్ మెటాలిక్ విత్ క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ రూఫ్ (Radiant Red Metallic with Crystal Black Pearl Roof)
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!