ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో బాగా పాపులర్ అవ్వాలంటే పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఒక్క సోషల్ మీడియా అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ తదితర సామాజిక మాధ్యమాలలో అకౌంట్ ఓపెన్ చేసి అందులో విభిన్నమైన పోస్టులు, స్టేటస్‌లు పెట్టడం ద్వారా చాలమంది సెలబ్రిటీలుగా మారిపోయారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారి ప్రతి నెలా లక్షల నుంచి కోట్ల వరకూ సంపాదిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆడవాళ్లు ఈ టెక్నికల్ కిటుకును ఇట్టే పట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని టాప్-10 హాటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ మోడల్స్ గురించి ఇప్పుడు చూద్దాం.
1. Kendall Jenner
ప్రపంచంలోనే అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను సంపాదించిన మోడల్‌గా ‘కెండల్ జెన్నర్’ (Kendall Jenner) గుర్తింపు పొందింది. అమెరికాకు చెందిన ఈ టీన్ మోడల్‌ను ఇన్‌స్టాలో ఏకంగా 294 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. జెన్నర్ తన 14 ఏటనే మోడలింగ్ కెరీర్‌లోకి అడుగుపెట్టింది. తన స్టన్నింగ్ లుక్స్, స్టైల్, బాడీ లాంగ్వేజ్‌తో టాప్ మోడల్‌గా ఎదిగింది.
2. Gigi Hadid
ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న రెండో మోడల్‌గా జిగి హడిద్ (Gigi Hadid) నిలిచింది. ఈ అమెరికన్ మోడల్ ఖాతాను 79 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ధరించే ట్రెండీ డ్రెస్సులకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.
3. Emily Ratajkowski
ఈ అమెరికన్ మోడల్ కూడా సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమిలీ రతాజ్కోవ్స్కీ (Emily Ratajkowski) పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది. ఆమె ఖాతాను 30.2 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఈ మోడల్ పలు సినిమాలు, టెలివిజన్ షోస్‌లో కూడా నటించింది.
4. Chrissy Teigen
తాజా జాబితాలో ‘క్రిస్సీ టీజెన్’ (Chrissy Teigen) నాలుగో స్థానంలో ఉంది. ఈ అమెరికన్ భామ మోడల్‌గానే కాకుండా టెలివిజన్ సెలబ్రిటీగానూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించింది. పలు ప్రముఖ అమెరికన్ టెలివిజన్ షోలలో క్రిస్సీ నటించింది. ఈ మోడల్ ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాను 42.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
5. Irina Shayk
రష్యన్ మోడల్ ఇరినా షేక్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించింది. ఈమె ఫ్యాషన్ రంగంలో ఎంతో యాక్టివ్‌గా ఉండటంతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటోంది. పేదరిక నిర్మూలన, విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపడుతూ సమాజానికి తన వంతు తోడ్పాటు అందిస్తోంది. ఈ మోడల్ ఇన్‌స్టా ఖాతాను 22.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
6. Adriana Lima
ఈ బ్రెజిల్ మోడల్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అడ్రియానా లిమా (Adriana Lima) పోస్టుల కోసం లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ఈ మోడల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 16.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు ఫ్యాషన్ మ్యాగజైన్స్ కూడా అడ్రియానా నిర్వహిస్తోంది.
7. Miranda Kerr
ఆస్ట్రేలియాకు చెందిన మిరాండా కెర్ (Miranda Kerr) కూడా మోడల్‌గానే కాకుండా బిజినెస్ ఉమెన్‌గానూ పేరు సంపాదించింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా రాణిస్తోంది. ఈ భామ ఇన్‌స్టా ఖాతాను 14.5 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. కోరా ఆర్గానిక్స్ (KORA Organics) అనే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కంపెనీని మిరాండా 2009లో స్థాపించింది.
8. Karlie Kloss
కార్లీ క్లోస్ కూడా మోడల్‌గానే కాకుండా బిజినెస్ ఉమెన్‌గా రాణిస్తోంది. ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉన్న ఈ భామ.. ఆ ఫొటోలను సైతం ఫోలోవర్లతో పంచుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె ఖాతాను 12.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
9. Sommer Ray
సోమర్ రే కూడా ప్రపంచంలో హాటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ మోడల్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ మోడల్ ఇన్‌స్టాగ్రామ్‌ను 24.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
10. Kelsey Merritt
ఈ ఫిలిపినో-అమెరికన్ మోడల్ (Filipino-American model)కు కూడా వరల్డ్ వైడ్‌గా మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈ భామ ఫ్యాషన్ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతోంది. కెల్సీ మెరిట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!