ఇప్పుడు ఉన్న డిజిటల్ యుగంలో ఎవరికి ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌ను అడిగి తెలుసుకోవాల్సిందే. చిన్న చాక్లెట్ దగ్గరినుంచి రాకెట్ వరకు ఏ సమాచారమైనా గూగుల్‌లో లభిస్తుంది. కరోనా కాలంలో ఎన్ని కేసులు ఉన్నాయి. ఎక్కడ పరిస్థితి ఎలా ఉంది లాక్‌డౌన్‌లో ఇంట్లో కూర్చొని అందరూ గూగుల్‌పై ఆధారపడ్డారు. పొద్దున లేస్తే గూగుల్‌ని నమ్ముకొని గడిపే జీవితాల్లో..ఈ సెర్చింగ్ ఒక భాగమైపోయింది. స్టూడెంట్స్, ఉద్యోగులు, వ్యాపారుల, పారిశ్రామికవేత్తలు..ఆ మాటకొస్తే ఎవరైనా గూగుల్ సెర్చ్ చేయాల్సిందే.
అయితే ఈ గూగుల్ సెర్చ్ చేసేందుకు మరింత సులభతర, సౌలభ్యమైన సదుపాయాలను అందిస్తోంది గూగుల్. తాజాగా ఇందులో డార్క్ మోడ్ సెట్టింగ్‌ను తీసుకొచ్చింది. దీంతో ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు స్క్రీన్ చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు..కళ్లకు కాస్త ఊరట కలుగుతుంది. డార్క్ రూమ్‌లో ఎక్కువసేపు వైట్ స్క్రీన్ చూస్తుంటే కళ్లకు ఎఫెక్ట్ అయ్యే అవకాశముంది. అదే డార్క్ మోడ్ సెట్ చేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఈ డార్క్ మోడ్‌ను మొబైల్ ఫోన్స్, డెస్క్ టాప్స్‌తో పాటు, ల్యాప్‌టాప్స్‌లోనూ సెట్ చేసుకోవచ్చు.
గూగుల్ సెర్చ్‌లో డార్క్ మోడ్ ఎలా యాక్టివేట్ చేయాలంటే..
- క్రోమ్, ఫైరఫాక్స్ వంటి ఏదైనా వెబ్ బ్రౌజర్‌లో Google.com అని సెర్చ్ చేయండి
- గూగుల్ సెర్చ్ హోమ్‌పేజ్‌లో కనిపించే Settings ఆప్షన్‌పై క్లిక్ చేయండి
- తర్వాత Appearance Tab క్లిక్ చేయండి ఒకవేళ అక్కడ Appearance Tab కనిపించకపోతే Searach Settings లో సెర్చ్ చేయాలి
- అక్కడ మూడు ఆప్షన్లు-Device default, Dark, Light కనిపిస్తాయి. ఈ మూడింటిలో మీకు ఏం కావాలో అది సెలక్ట్ చేసుకోవాలి.
- తర్వాత కింద కనిపించే Save పై క్లిక్ చేయాలి. ఎంతసమయం డార్క్ మోడ్‌లో ఉండాలో కూడా సెట్ చేసుకునే అవకాశముంది. ఉదాహరణకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు డార్క్ మోడ్‌ను సెట్ చేసుకోవచ్చు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్