సముద్ర అలలపై తెలియాడుతూ విలాసవంతమైన ప్రయాణం చేయాలనుకునే పర్యాటకులకు శుభవార్త. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ‘ఐకాన్ ఆఫ్ ది సీ’ విహారయాత్రకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ షిప్ సముద్రయానం చేయనుంది. తాజాగా ఈ క్రూయిజ్ షిప్ తుర్కు, ఫిన్‌లాండ్ మధ్య ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ భారీ నౌక మేయర్ తుర్కు షిప్ యార్డులో లంగరు వేసుకుని ఉంది. టైటానిక్ కంటే ఐకాన్ ఆఫ్ ది సీ ఐదు రెట్లు పెద్దదిగా చెబుతున్న ఈ భారీ నౌక ప్రత్యేకతలు ఏంటో ఓసారి తెలుసుకుందాం..
ఐకాన్ ఆఫ్ ది సీస్ క్రూయిజ్ షిప్ ప్రత్యేకతలు
ఈ భారీ నౌకను ఫిన్‌లాండ్‌లోని మేయర్ తుర్కు షిఫ్‌యార్డ్‌లో నిర్మించారు. రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ భారీ క్రూయిజ్ షిఫ్‌ను నిర్మించింది. ఇప్పటి వరకు ప్రపంచంలో నిర్మించిన క్రూయిజ్ నౌకల్లో ఇదే అతిపెద్ద నౌక. దీని పరిణామం 1,200 అడుగుల (365 మీటర్లు) పొడవు, 250,800 టన్నుల బరువు కలిగి ఉంటుంది.
ఐకాన్ ఆఫ్ ది సీస్ సామర్థ్యం
ఈ నౌకలో ఒకేసారి 7,960 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. అయితే వచ్చే ఏడాది జనవరిలో జరిగే పర్యటనలో మాత్రం ఇంత మంది ప్రయాణికులు ప్రయాణించడం లేదు. దాదాపు 5,610 మంది ప్రయాణికులు, మరో 2,350 మంది సిబ్బంది తొలి పర్యటనకు వెళ్లనున్నారు.
విలాసవంతమైన సౌకర్యాలు
ఐకాన్ ఆఫ్ ది సీస్‌లో అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ భారీ నౌకలో 7 స్మిమ్మింగ్ పూల్స్, 9 వర్ల్ పూల్స్ నిర్మించారు. కుటుంబంతో వచ్చినవారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఫ్యామిలితో కలిసి స్మిమ్ చేసేందుకు మోడ్రన్ పూల్, ఆక్వా థియేటర్, స్విమ్-అప్ బార్ ఉన్నాయి. క్రూయిజ్ షిప్ నుంచి ప్రయాణికులు సముద్ర అందాలు తిలకించేందుకు 20 డెక్‌లు, 8 విజిటింగ్ ప్లేస్‌లు ఉన్నాయి.
షిప్‌లో ఉండే ప్రయాణికుల కోసం విలాసవంతమైన గదులు ఉన్నాయి. మొత్తం గదుల్లో 82శాతం గదుల్లో ముగ్గురు వరకు అతిథులు ఉండొచ్చు. తాము ప్రయాణిస్తున్నంత సేపూ ఈ గదుల నుంచి నేరుగా అతిథులు సముద్ర అందాలు వీక్షించవచ్చు.
ట్రయల్ రన్ పూర్తి
జూన్ 22న ట్రయల్ రన్‌ను ఐకాన్ ఆఫ్ ది సీస్ పూర్తి చేసుకున్నట్లు షిప్ నిర్వాహకులు తెలిపారు. ట్రయల్ రన్ సమంయలో ప్రధాన ఇంజిన్‌లోని అన్ని మిషిన్లు సక్రమంగా పనిచేసినట్లు తెలిపారు. హల్, బ్రేక్ సిస్టమ్‌లు, స్టీరింగ్, నాయిస్, వైబ్రేషన్ స్థాయిలు బాగున్నాయని పేర్కొన్నారు. ఈ భారీ నౌక లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడుస్తుందని వెల్లడించారు.
ఎక్కడి నుంచి ఎక్కడి కంటే?
ఈ భారీ క్రూయిజ్ షిఫ్ కరేబియన్ ఐలాండ్స్ అయిన.. కొజుమెల్, బహమాస్, సెయింట్ మార్టెన్, ఫిలిప్స్ బర్గ్, హోండురస్ మీదుగా ఐకాన్ ఆఫ్ ది సీస్ ప్రయాణించనుంది.
టికెట్ ధర ఎంతంటే?
ప్రపంచంలోనే అతిపెద్ద నౌకలో ప్రయాణించాలంటే.. ధర కూడా అదే స్థాయిలో ఉంది. విలాసాలను బట్టి ప్యాకెజీ ధరలు నిర్ణయించారు. రూ.1,39,000- రూ.3,00000 వరకు ప్యాకెజీ ధరలు ఉన్నాయి. ఈ నౌకలో విహారయాత్ర చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు పోటీపడుతున్నారు. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ నౌకలో సముద్రయానం చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి