• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IIFA 2024: అబుదాబిలో చిరు, బాలయ్యకు అరుదైన గౌరవం.. చూస్తే రెండు కళ్లు సరిపోవు! 

    సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా (IIFA-2024) అవార్డుల వేడుక అబుదాబి వేదికగా ఘనంగా జరుగుతోంది. సెప్టెంబర్‌ 27నుంచి 29 మధ్య మూడురోజుల పాటు జరగనున్న ఈవెంట్‌లో రెండో రోజు సమంత, రానా, ఏఆర్‌ రెహమన్‌, వెంకటేశ్‌, బాలకృష్ణ హాజరై సందడి చేశారు. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ నటీనటులు పలు జాబితాల్లో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ వేడుక‌ల్లో  మెగాస్టార్‌ చిరంజీవితో పాటు నందమూరి బాలకృష్ణలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఈ ఇద్దరు అగ్రహీరోలు ఒకే వేదికపై అవార్డులు తీసుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    మెగాస్టార్‌కు మరో గౌరవం

    మెగాస్టార్‌ చిరంజీవికి (Megastar Chiranjeevi) ఈ ఏడాది వరుసగా అవార్డులు వరిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కేంద్రం నుంచి పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ ఇటీవలే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఇప్పుడు తాజాగా ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ -2024 వేడుకల్లో మరో అవార్డును సొంతం చేసుకున్నారు. అవుడ్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ ఇండియన్‌ సినిమా అవార్డును కైవసం చేసుకున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ జావేద్ అక్తర్‌ చేతుల మీదగా మెగాస్టార్ ఈ అవార్డు అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

    బాలకృష్ణకు సైతం..

    నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవలే తన 50 ఏళ్ల నటన జీవితం పూర్తి చేసుకున్నాడు. దీనికి సంబంధించి టాలీవుడ్‌లో పెద్ద ఈవెంట్‌ను సైతం నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న ఐఫా – 2024 వేడుకల్లో బాలయ్యను అవార్డుతో నిర్వాహకులు గౌరవిచంారు. ప్రతిష్టాత్మక గోల్డెన్‌ లెగసీ అవార్డ్‌ను బాలకృష్ణకు అందజేశారు. బాలీవుడ్‌ స్టార్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ చేతుల మీదుగా ఈ అవార్డును అందచేశారు. అవార్డు ఇవ్వడానికి ముందు బాలయ్య కాళ్లకు కరణ్‌ జోహర్‌ నమస్కారం చేయడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నందమూరి ఫ్యాన్స్ వీటిని తెగ ట్రెండ్ చేస్తున్నారు. 

    ఒకే వేదికపై చిరు, బాలయ్య, వెంకీ

    అబుదాబిలో జరుగుతున్న ఐఫా వేడుకలకు టాలీవుడ్‌ నుంచి దిగ్గజ నటుడు వెంకటేష్‌ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌ ముగ్గుర్ని ఒకేసారి స్టేజిపైకి పిలవడంతో ఈవెంట్లో ఒక్కసారిగా సందడి వచ్చింది. ఒకే వేదికపై ఈ ముగ్గురు స్టార్ హీరోలను చూసి అక్కడి వారంతా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేదికపైన బాలయ్య, చిరు, వెంకీ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ వేడుకలో చిరంజీవికి అవుడ్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు రావడంతో ఆ అవార్డుని పట్టుకొని వెంకటేష్‌, బాలకృష్ణలతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే ఈ ఫొటోల్లో నాగార్జున కూడా ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

    ఐఫా – 2024 అవార్డు విజేతలు.. 

    •  ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్‌ ఇండియ‌న్ సినిమా-  చిరంజీవి
    •  ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా – ప్రియదర్శన్‌
    •  ఉమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌ – సమంత
    •  గోల్డెన్‌ లెగసీ అవార్డు – బాలకృష్ణ
    •  ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్‌ (కన్నడ)- రిషబ్‌ శెట్టి
    •  ఉత్తమ చిత్రం (తమిళం) – జైలర్‌
    •  ఉత్తమ చిత్రం (తెలుగు)- దసరా
    •  ఉత్తమ నటుడు (తెలుగు)- నాని 
    •  ఉత్తమ నటుడు (తమిళం)- విక్రమ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
    •  ఉత్తమ నటి (తమిళం) – ఐశ్వర్యారాయ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
    •  ఉత్తమ దర్శకుడు (తమిళం) – మణిరత్నం (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
    •  ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) – ఏఆర్‌ రెహమన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
    •  ఉత్తమ విలన్‌ (తమిళం) – ఎస్‌జే సూర్య (మార్క్‌ ఆంటోనీ)
    •  ఉత్తమ విలన్‌ (తెలుగు) – షైన్‌ టామ్‌ (దసర)
    •  ఉత్తమ విలన్‌ (కన్నడ) – జగపతి బాబు
    •  ఉత్తమ సహాయ నటుడు (తమిళం) – జయరామ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
    •  ఉత్తమ సినిమాటోగ్రఫీ – మిస్‌శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి
    •  ఉత్తమ సాహిత్యం – జైలర్‌ (హుకుం)
    •  ఉత్తమ నేపథ్య గాయకుడు – చిన్నంజిరు (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
    •  ఉత్తమ నేపథ్య గాయని – శక్తిశ్రీ గోపాలన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
    •  ఉత్తమ విలన్‌ (మలయాళం) – అర్జున్‌ రాధాకృష్ణన్‌
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv