ప్రస్తుతం ఇమాన్వీ (Iman ismaili) పేరు ఇండస్ట్రీలో మారుమోగుతోంది. ప్రభాస్ – హనురాఘవపూడి కాంబోలో రూపొందనున్న ‘ఫౌజీ’ (Fouji) చిత్రంలో ఈ అమ్మడు హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈమెపై పడింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. ఆమెకు సంబంధించిన విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
అందంలో సౌందర్య, లుక్స్‌లో అనుష్కను తలపిస్తున్న ఈ ముద్దుగుమ్మ అసలు పేరు ఇమాన్ ఇస్మాయిల్ (Iman Esmail). ఆమె ఒక డ్యాన్సర్. సోషల్‌మీడియాలో కంటెంట్ క్రియేటర్.
ఇమాన్వీ తల్లిదండ్రులది పాకిస్తాన్‌లోని కరాచీ ప్రాంతం. వారు చాలా ఏళ్ల క్రితమే అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌కు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు.
1995 అక్టోబర్ 20న ఢిల్లీలో ఇమాన్వి జన్మించింది. చిన్నప్పటి నుంచి చదువులో టాపర్. ఎంబీఏ కూడా పూర్తి చేసింది.
ఇమాన్వీకి డ్యాన్స్ అంటే పిచ్చి. పేరెంట్స్ కూడా ఆమెను ఎంకరేజ్ చేశారు. అలనాటి బాలీవుడ్ హీరోయిన్లు రేఖ, మాధురీ దీక్షిత్, వైజయంతీ మాల వంటి వారు వేసే డ్యాన్స్ మూవ్‌మెంట్స్ ఉన్నవి ఉన్నట్లు చేయాలని ఆమె తల్లి ప్రోత్సహించేది.
2012లో సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌ను ఇమాన్వి ప్రారంభించింది. అప్పటి నుంచి అందులో డ్యాన్స్ వీడియోలను పోస్టు చేసేది. అలా ఓ వైపు చదువుకుంటూనే డిజిటిల్ మీడియాలోనూ పేరు సంపాదించింది.
నెట్టింట ఆమె అప్‌లోడ్ చేసే డ్యాన్స్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. యూబ్యూబ్‌లో ఆమె ఛానల్‌ను 18 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.
ఇమాన్వి డ్యాన్స్ చూసి ఫిదా అయిన బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెకు కొరియోగ్రాఫర్‌గా అవకాశమిచ్చారు. 2020లో ‘తాల్’ సినిమాలోని ‘రామ్ తా జోగీ’ అనే పాటకు ఆమె కొరియోగ్రాఫ్ చేసింది.
అంతేకాదు పలు పాపులర్ హిందీ సాంగ్స్‌కు తనదైన స్టైల్‌లో ఓన్‌గా డ్యాన్స్ చేసి యూట్యూబ్‌లో ఇమాన్వి షేర్ చేసేది. ఆ వీడియోలు పలుమార్లు వైరల్‌గా మారి ఇమాన్వీకి గుర్తింపు తీసుకొచ్చాయి.
ఇమాన్వీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిండా ఆమె డ్యాన్స్ వీడియోలే దర్శనమిస్తాయి. ఫుల్ గ్రేస్‌తో వేసిన స్టెప్పులు చూసి ఆమె ఫాలోవర్లు ఫిదా అవుతుంటారు.
అయితే ఇమాన్వి ఇప్పటివరకూ ఒక్క సినిమాలోనూ నటించలేదు. అయిన్పపటికీ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ అవకాశం రావడం నిజంగా గ్రేట్ అని చెప్పవచ్చు.
దర్శకుడు హను రాఘవపూడి సోషల్ మీడియాలో ఈ అమ్మడి క్రేజ్ చూసి ఈ ఛాన్స్ ఇచ్చినట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అయితే సినిమాలు చేయనప్పటికీ ఇమాన్వికి కెమెరా ఎక్స్‌పీరియన్స్ ఉంది. కొన్నేళ్ల క్రితం ‘బీయింగ్ సా-రా’ అనే ఒక షార్ట్ ఫిల్మ్‌లో మెయిన్ క్యారెక్టర్‌లో ఆమె నటించింది.
తనకు బీచ్‌లో సమయం గడపడం అంటే చాలా ఇష్టమని ఓ ఇంటర్యూలో ఇమాన్వీ తెలిపింది. అలలు చూస్తూ కూర్చుంటే ఎంత సమయమైనా తెలీదని ఈ అమ్మడు అంటోంది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్