ఓవర్ ద ప్లాట్‌ఫాం(OTT) వచ్చాక వెబ్ సిరీస్‌లు తెగ విడుదల అవుతున్నాయి. కోవిడ్ కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫాంలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో వెబ్ సిరీస్‌ల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోయింది. అలా వివిధ ప్లాట్‌ఫారంలలో ఇప్పటివరకు ఎన్నో సిరీస్‌లు విడుదలై సంచలనం సృష్టించాయి. దీంతో ఇండియాలో వచ్చిన వెబ్ సిరీస్‌లలో ఆల్ టైం పాపులర్ సిరీస్‌ల జాబితాను ఐఎండీబీ(IMdb) వెల్లడించింది. 2018, జనవరి 1 నుంచి 2023, మే 10 మధ్యలో వచ్చిన కస్టమర్ పేజ్ వ్యూస్‌ని ఆధారంగా చేసుకుని టాప్ 50 వెబ్ సిరీస్‌లను ఐఎండీబీ ప్రకటించింది. ఇందులో తొలి పది స్థానాల్లో నిలిచిన వెబ్ సిరీస్‌లేంటో తెలుసుకుందాం.
సాక్రడ్ గేమ్స్(Sacred Games)
విడుదలై ఐదేళ్లు గడిచినా సాక్రడ్ గేమ్స్ పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. నవాజుద్దీన్ సిద్దిఖీ, సైఫ్ అలీ ఖాన్ తారలుగా నటించిన ఈ వెబ్‌సిరీస్ ఐఎండీబీ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. 2018లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా రిలీజైంది. పోలీస్, నేరస్థుడి మధ్య జరిగే పిల్లి-ఎలుక కథ ఇది.
మీర్జాపూర్(Mirzapur)
క్రైం థ్రిల్లర్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇది. రెండు సీజన్లుగా విడుదలైంది. మీర్జాపూర్ మాఫియా డాన్ వారసత్వాన్ని కుమారుడు కొనసాగించాడా? అనే అంశంపై సిరీస్‌ని చిత్రీకరించారు. పంకజ్ త్రిపాఠి, దివ్యేందు ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2018 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
స్కామ్ 1992: ద హర్షద్ మెహతా స్టోరీ(Scam 1992: The Harshad Mehta Story)
1992 భారత స్టాక్ మార్కెట్ కుంభకోణం నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. స్టాక్ మార్కెట్ లోపాలు తెలుసుకున్న వ్యక్తి కుంభకోణానికి పాల్పడటం, అనంతర పరిణామాలను ఇందులో చూపించారు. హర్షద్ మెహతాగా ప్రతీక్ గాంధీ జీవించాడు. 2020లో విడులైంది. సోనీ లైవ్‌లో ప్రసారం అవుతోంది.
ద ఫ్యామిలీ మ్యాన్(The Family Man)
మనోజ్ బాజ్‌పేయి, సమంత, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ ఇది. 2019లో విడుదలైంది. రెండు సీజన్లుగా వచ్చిన ఈ సిరీస్ విశేషంగా ఆకట్టుకుంది. వివిధ రూపాల్లో ఉన్న టెర్రరిజాన్ని ఓ సాధారణ ఫ్యామిలీ మ్యాన్ ఆఫీసర్ ఎలా అంతం చేశాడనేదే కథ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
ఆస్పిరెంట్స్(Aspirants)
సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కష్టాలను వివరించేదే ఈ ఆస్పిరెంట్స్ వెబ్ స్టోరీ. విభిన్న వ్యక్తిత్వం కలిగిన ముగ్గురు సివిల్స్ అభ్యర్థుల వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని చిత్రీకరింస్తుంది. హిందీలో తెరకెక్కించిన ఈ సిరీస్ 2021లో విడుదలైంది. యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నవీన్ కస్తూరియా, సన్నీ హిందుజ, అభిలాష్ తదితరులు కీలక పాత్ర పోషించారు.
క్రిమినల్ జస్టిస్(Criminal Justice)
ఓ మధ్యతరగతి వ్యక్తి అనుకోకుండా ఓ నేరంలో ఇరుక్కుంటే న్యాయం కోసం ఎలాంటి పోరాటం చేశాడనే వృత్తాంతం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. 2019 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. మీర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి కీలక పాత్ర పోషించాడు.
బ్రీత్(Breathe)
మాధవన్ ప్రతినాయక పాత్ర పోషించిన సిరీస్ ఇది. అవయవ దానం చేసే వ్యక్తుల మరణాల వెనక ప్రధాన కారణమేంటి? అనే విషయాన్ని ఆధారంగా చేసుకుని సిరీస్‌ని తెరకెక్కించారు. పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. 2018లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.
కోటా ఫ్యాక్టరీ(Kota factory)
కోచింగ్ సెంటర్లకు రాజస్థాన్‌లోని కోటా పాపులర్. ఐఐటీల్లో ప్రవేశం పొందాలన్న లక్ష్యంతో జేఈఈ ప్రిపరేషన్ కోసం వచ్చిన ఓ విద్యార్థి కదే ఇది. 2019లో విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
పంచాయత్(Panchayat)
డ్రామా, కామెడీ సిరీస్‌గా పంచాయత్ తెరకెక్కింది. ఉద్యోగం పొందలేని ఓ ఇంజినీరింగ్ విద్యార్థి గ్రామ పంచాయతీలో పని కుదుర్చుకుంటాడు. ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఈ సిరీస్ వివరిస్తుంది. రెండు సీజన్లుగా వచ్చింది. 2020లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.
పాతాళ్ లోక్(Pataal Lok)
ఓ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. ఓ హై ప్రొఫైల్ కేసును దర్యాప్తు చేస్తుండగా అండర్ వరల్డ్ నిజ స్వరూపం గురించి ఎలా తెలుసుకున్నాడని సిరీస్ వివరిస్తుంది. 2020లో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
Celebrities Featured Articles Telugu Movies
Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!