• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రికార్డు సృష్టించనున్న టీం ఇండియా.. 1000 వన్డేల ఘనత

    టీం ఇండియా అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించనుంది. ఇప్పటి వరకు 999 వన్డేలు ఆడిన భారత్ ఫిబ్రవరి 6న వెస్టిండీస్‌తో జరిగే వన్డే మ్యాచ్‌తో 1000 వన్డేలు ఆడిన తొలి క్రికెట్ జట్టుగా ఘనత సాధించనుంది. ఇప్పటి వరకు ఏ జట్టు కూడ 1000 మ్యాచులు ఆడలేదు. భారత్ 999 వన్డేలు ఆడగా 518 మ్యాచుల్లో గెలుపొందింది. 431 మ్యాచుల్లో ఓడిపోయింది.

    భారత్ తర్వాతి స్థానాలు

    భారత్ తర్వాత అత్యధికంగా ఆస్ట్రేలియా 958 వన్డే మ్యాచులు ఆడింది. తదనంతరం పాకిస్థాన్ 936 వన్డేలు, శ్రీలంక 846, వెస్టిండీస్ 834, న్యూజిలాండ్ 775, ఇంగ్లాండ్ 761 వన్డే మ్యాచులను ఆడాయి.  

    కోహ్లీ, రోహిత్‌ల మరో రికార్డు

    ఈ 1000వ మ్యాచ్‌లో టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు కొల్లగొట్టే అవకాశం ఉంది. ఈ 1000వ మ్యాచ్ కెప్టెన్‌గా రోహిత్ ఘనత సాధించనుండగా.. విరాట్ కోహ్లీ ఇంకో 6 పరుగులు చేస్తే సొంత గడ్డపై 5000 పరుగులు చేసిన సచిన్ రికార్డును సమం చేసే అవకాశం ఉంది. సచిన్ కూడ వెస్టిండీస్‌పైనే 5000 పరుగుల మైలురాయిని దాటడం విశేషం.

    3 వన్డేలు, 3 టీ20లు..

    భారత్- వెస్టిండీస్ మధ్య ఫిబ్రవరి 6 నుంచి 3 వన్డేలు, 3 టీ20 మ్యాచులు జరుగనున్నాయి. ఫిబ్రవరి 6, 9, 11 తేదీల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వన్డేలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 16, 18,20 తేదీల్లో కోల్‌కత్తా‌లోని ఈడెన్ గార్డెన్స్‌లో టీ20 మ్యాచులు నిర్వహించనున్నారు.

    మ్యాచులు- కెప్టెన్లు

     ఈ 1000వ వన్డే మ్యాచ్‌కు ఇండియా తరఫున రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. అహ్మదాబాద్‌లో ఆదివారం వెస్టిండీస్‌తో తలపడేందుకు టీం ఇండియా ఇప్పటికే సన్నద్ధమైంది. అయితే 1974లో భారత్ మొట్టమొదటి ODI ఆడగా, 2022లో వెయ్యివది ఆడనుంది. ఆయా మ్యాచ్‌లలో భారత కెప్టెన్లు, ప్రత్యర్థి జట్టును ఇక్కడ చూడవచ్చు.

    1వ మ్యాచ్ – అజిత్ వాడేకర్ vs ఇంగ్లాండ్

    100వ మ్యాచ్ – కపిల్ దేవ్ vs ఆస్ట్రేలియా

    500వ మ్యాచ్ – సౌరవ్ గంగూలీ vs ఇంగ్లాండ్

    600వ మ్యాచ్ – వీరేంద్ర సెహ్వాగ్ vs శ్రీలంక

    700వ మ్యాచ్ – ఎంఎస్ ధోని vs ఇంగ్లాండ్

    750వ మ్యాచ్ – ఎంఎస్ ధోని vs శ్రీలంక

    900వ మ్యాచ్ – ఎంఎస్ ధోని వర్సెస్ న్యూజిలాండ్

    1000వ మ్యాచ్ – రోహిత్ శర్మ vs వెస్టిండీస్

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv