• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కళ్లముందే ఉన్నా కనిపెట్టలేని పొడుపు కథలు

    ఆటవిడుపు కోసమో, కాలక్షేపానికో పొడుపు కథలు వేసుకోవడం తెలుగువారికి అలవాటు. రకరకాల పొడుపు కథలు మనకు అందుబాటులో ఉంటాయి. కానీ మన నిత్యం చూసేవి, కళ్లముందే ఉన్నా కనిపెట్టలేనివి కొన్ని ఉంటాయి. జవాబు తెలిశాక ఓస్! ఇంతేనా!! అనుకుంటారు. అలాంటివి ఇక్కడ కొన్ని ఉన్నాయి. మీరు ఎన్ని విప్పగలరో చూడండి మరి…

    చెట్లపై గెంతగలదు కానీ కోతి కాదు, నామాలుంటాయి కానీ పూజారి కాదు ఏమిటది?

    ఉడత

    అందరినీ పైకి తీసుకెళ్తుంది కానీ తాను మాత్రం అక్కడే ఉంటుంది ఏమిటది?

    నిచ్చెన

    ఇంట్లో ముడుచుకుటుంది బయటికెళ్తే విచ్చుకుంటుంది?

    గొడుగు

    చారెడు కుండలో మానెడు పగడాలు?

    దానిమ్మ పండు

    అన్న అడుగు నడిచే సరికి తమ్ముడు 12 అడుగులు నడుస్తాడు?

    గడియారం

    నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది. పీక మీద కత్తి పెట్టి బెదిరిస్తే గానీ మళ్లీ నడవదు?

    పెన్సిల్

    అందరిలో చిన్నోడు. పెళ్లికి మాత్రం పెద్దోడు

    చిటికెన వేలు

    అందరాని వస్త్రంపై అన్నీ వడియాలే

    ఆకాశంలో నక్షత్రాలు

    సిత్తరాంగిలా చీర కట్టి షికారుకెళ్లిందో చిలక. పూసిన వారింటికే గానీ కాసిన వారింటికి పోదు

    సీతాకోక చిలక

    బోలెడు నదులున్నా నీళ్లు లేవు. రహదారులున్నా రవాణాకు పనికిరావు

    మ్యాప్ 

    అయ్య అంటే ఆమడ దూరం పోతారు. అమ్మ అంటే హత్తుకుంటారు

    పెదాలు

    అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది తైతక్కలాడింది

    చీపురుకట్ట

    ఓ గిన్నె..గెన్నెలో వెన్న.. వెన్నలో నల్లని నేరేడు

    కన్ను

    చిన్నోడే గానీ వాడి బట్టలు విప్పడం అంత ఈజీ కాదు

    కొబ్బరి కాయ

    అంగుళం ఉంటది కానీ అరవై చీరలు కట్టే వగలాడి?

    ఉల్లిగడ్డ

    చకచకా పోయేవి రెండు. గట్టెక్కి చూసేవి రెండు. హాయిగా ఆలకించేవి రెండు. కనిపెట్టి కాచుకునేవి రెండు.

    కాళ్లు, చేతులు, చెవులు, కళ్లు

    నాకున్నది ఒకే కన్ను. చూడలేను గానీ ముక్కుతోనే 300 గదులైనా తిరిగొస్తా

    సూది

    ఏడుగురు అన్నదమ్ములు వారు. విడిగా ఎవరూ కానరు. కలిసుంటే మాత్రం కళ్లార్పకుండా చూస్తారు

    ఇంధ్రధనుస్సు

    ఇక్కడెవరినో కొడితే అక్కడెక్కడో పరిగెత్తే అన్నదమ్ములు. ఒకరికొకరు ఎప్పటికీ అందరు

    ఫ్యాన్

    మనకే సొంతం. కానీ మనకన్నా ఇతరులే ఎక్కువ వాడతారు

    పేరు

    ప్రాణం లేని పాప కేకలేసి పిలుస్తుంది. అందరూ దాన్ని పట్టుకుంటారు గానీ అదెవరినీ పట్టుకోదు

    సెల్ ఫోన్

    జానెడు ఇంట్లో మూరెడు బెత్తం. అది లేనిదే పని జరగదు. కడుపు నిండదు

    గరిటె

    అతిగా మాట్లాడే ఆడవారు తక్కువ మాట్లాడే నెల

    ఫిబ్రవరి( 28 రోజులు)

    ఇంట్లో ప్రసాదం ఒంట్లో ప్రమాదం

    చక్కెర

    వీడిని కొడితే వాడు అరుస్తాడు

    కాలింగ్ బెల్

    అందమైన చిన్నది, అందాల చిన్నది నువ్ చూస్తే నిన్ను చూస్తుంది నేను చూస్తే నన్ను చూస్తుంది

    అద్దం

    చింపిరి జుట్టు, అతుకుల బట్టలు కానీ బిడ్డలు మాత్రం బంగారం

    మొక్కజొన్న

    ఇంట్లోకి రారు గానీ బయటికి వెళ్లాలంటే వారి తోడు కావాల్సిందే

    చెప్పులు

    గుప్పెడంత గదిలో 60మంది సహవాసం

    అగ్గిపెట్టె

    గోడకు కట్టేసినా గదిమొత్తం వ్యాపిస్తా

    బల్బ్

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv