• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముగిసిన ఐపీఎల్ వేలం..

     ఐపీఎల్ 2022 మెగా వేలం ముగిసింది. మొత్తం 600 మంది ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా చాలా మంది ప్లేయర్లు ఊహించిన మొత్తం కంటే ఎక్కువకు అమ్ముడు పోయారు. కొంత మంది అమ్ముడు పోకుండా అలాగే మిగిలిపోయారు. వేలం ప్రక్రియ ముగియడంతో సమరానికి అంతా సిద్ధమవుతున్నారు.  

    అమ్ముడు పోయిన ఆటగాళ్ల వివరాలు.. 

    క్ర. సంఆటగాడుఏ జట్టు సొంతంధర 
    1ఆవేశ్ ఖాన్ లక్నో సూపర్ జెయింట్స్రూ. 10 కోట్లు
    2రాహుల్ తెవాటియాగుజరాత్ టైటాన్స్రూ. 9 కోట్లు
    3శివం మావి కేకేఆర్రూ. 7.5 కోట్లు
    4షారూఖ్ ఖాన్ పంజాబ్రూ. 9 కోట్లు
    5అభిషేక్ శర్మ సన్ రైజర్స్రూ. 6.5 కోట్లు
    6రాహుల్ త్రిపాఠి సన్ రైజర్స్రూ. 8.5 కోట్లు
    7చహల్   రాజస్థాన్ రాయల్స్రూ. 6.5 కోట్లు
    8రాహుల్ చహర్ పంజాబ్రూ. 5.25 కోట్లు
    9శార్దూల్ ఠాకూర్ ఢిల్లీరూ. 10.75 కోట్లు
    10భువనేశ్వర్ కుమార్ సన్ రైజర్స్రూ. 4.20 కోట్లు
    11మార్క్ వుడ్ లక్నో సూపర్ జెయింట్స్రూ. 7.5 కోట్లు
    12హేజిల్‌వుడ్ ఆర్సీబీరూ. 7.75 కోట్లు
    13ఫెర్గూసన్ గుజరాత్ టైటాన్స్రూ. 10 కోట్లు
    14ప్రసిధ్ కృష్ణ రాజస్థాన్ రాయల్స్రూ. 10 కోట్లు
    15దీపక్ చహర్ చెన్నైరూ. 14 కోట్లు
    16నికోలస్ పూరన్ సన్ రైజర్స్రూ. 10.75 కోట్లు
    17దినేష్ కార్తిక్  ఆర్సీబీరూ. 5.50 కోట్లు
    18బెయిర్ స్టో పంజాబ్రూ. 6.75 కోట్లు
    19ఇషాన్ కిషన్ ముంబైరూ. 15.25కోట్లు
    20అంబటి రాయుడు చెన్నైరూ. 6.75 కోట్లు
    21మిచెల్ మార్ష్ ఢిల్లీరూ. 6.50 కోట్లు
    22కృనాల్ పాండ్యాలక్నోరూ. 8.25 కోట్లు
    23వాషింగ్టన్ సుందర్ సన్ రైజర్స్రూ. 8.75 కోట్లు
    24వానిందు హసరంగ ఆర్సీబీరూ. 10.75 కోట్లు
    25హర్షల్ పటేల్ ఆర్సీబీరూ. 10.75 కోట్లు
    26జేసన్ హోల్డర్ లక్నోరూ. 8.75 కోట్లు
    27నితీష్ రాణా కేకేఆర్రూ. 8 కోట్లు
    28పడిక్కల్ రాజస్థాన్ రాయల్స్రూ. 7.75 కోట్లు
    29షిమ్రన్ హెట్‌మెయర్ రాజస్థాన్ రాయల్స్రూ. 8.5 కోట్లు
    30శ్రేయస్ అయ్యర్ కేకేఆర్రూ. 12.25 కోట్లు
    31బోల్ట్ రాజస్థాన్ రాయల్స్రూ. 8 కోట్లు
    32మనీష్ పాండే లక్నోరూ. 4.60 కోట్లు
    33డేవిడ్ వార్నర్ ఢిల్లీరూ. 6.25 కోట్లు
    34డికాక్ లక్నోరూ. 6.75 కోట్లు
    35  డుప్లెసిస్  ఆర్సీబీరూ. 7 కోట్లు
    36అశ్విన్ రాజస్థాన్ రాయల్స్రూ. 5 కోట్లు
    37కమ్మిన్స్కేకేఆర్రూ. 7.25 కోట్లు
    38రబడ పంజాబ్రూ. 9.25 కోట్లు
    39ధావన్ పంజాబ్రూ. 8.25 కోట్లు
    40షమీ గుజరాత్రూ. 6.25 కోట్లు
    41సమర్ధ్సన్ రైజర్స్రూ. 20 లక్షలు
    42రూథర్‌ఫర్డ్బెంగుళూరు రూ. 1 కోటి
    43ప్రశాంత్ సోలంకిచెన్నైరూ. 1.20 కోట్లు
    44టైమల్ మిల్స్ముంబైరూ. 1.90 కోట్లు
    45మిచెల్ సాంట్నర్చెన్నైరూ. 1.90 కోట్లు
    46వైభవ్ అరోరాపంజాబ్రూ. 2 కోట్లు
    47పావెల్ఢిల్లీరూ. 2.8 కోట్లు
    48సెపర్డ్సన్ రైజర్స్రూ. 7.75 కోట్లు
    49జోఫ్రా అర్చర్ముంబైరూ. 8 కోట్లు
    50టిమ్ డేవిడ్ముంబైరూ. 8.25 కోట్లు
    51అబాట్సన్ రైజర్స్రూ. 2.4కోట్లు
    52అల్జారి జోసెఫ్గుజరాత్రూ. 2.4 కోట్లు
    53మెరిడిత్ముంబైరూ. 1 కోటి
    54లివింగ్‌స్టోన్పంజాబ్‌రూ. 11.50 కోట్లు

    వీరు మాత్రమే కాకుండా కొంత మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లను ప్రాంచైజీలు బేస్ ధరకే సొంతం చేసుకున్నాయి. కాగా కొంత మంది ప్లేయర్లు ఆక్షన్‌లో అమ్ముడు పోలేదు. 

    ఇషాన్ కిషన్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల జాబితాలో ఆవేశ్ ఖాన్ రూ. 10 కోట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. 

    అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల వివరాలు…

    ఆటగాడి పేరుకొనుగోలు చేసిన జట్టుధరదేశం
    ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్రూ. 15.25 కోట్లుఇండియా
    దీపక్ చహర్చెన్నై సూపర్ కింగ్స్రూ. 14 కోట్లు ఇండియా
    శ్రేయస్ అయ్యర్కేకేఆర్రూ. 12.25 కోట్లు ఇండియా
    లివింగ్‌స్టోన్పంజాబ్రూ. 11.50 కోట్లుఇంగ్లండ్
    శార్దూల్ ఠాకూర్ఢిల్లీ క్యాపిటల్స్రూ. 10.75 కోట్లు ఇండియా
    హర్షల్ పటేల్బెంగుళూరు బుల్స్రూ. 10.75 కోట్లు ఇండియా
    వానిందు హసరంగబెంగుళూరు బుల్స్రూ. 10.75 కోట్లుశ్రీలంక
    నికోలస్ పూరన్సన్ రైజర్స్రూ. 10.75 కోట్లువెస్టిండీస్
    ఆవేశ్ ఖాన్లక్నో సూపర్ జెయింట్స్రూ. 10 కోట్లు ఇండియా (అన్‌క్యాప్‌డ్)
    ప్రసిధ్ కృష్ణరాజస్థాన్ రాయల్స్రూ. 10 కోట్లు ఇండియా
    ఫెర్గూసన్గుజరాత్ టైటాన్స్రూ. 10 కోట్లు ఇండియా

    తిరిగొచ్చిన హ్యూజ్… 

    ఐపీఎల్ వేలం సందర్భంగా ఆక్షనీర్ హ్యూజ్ ఎడ్మీడ్స్ మధ్యలోనే కళ్లు తిరిగి పడిపోయాడు. ఆ తర్వాత భారతదేశానికి చెందిన చారు శర్మ వేలాన్ని కంటిన్యూ చేశాడు. కానీ వేలం ముగిసే సమయానికి హ్యూజ్ మళ్లీ తిరిగొచ్చాడు. తాను చివరి క్షణాలను కంప్లీట్ చేశాడు. 

    https://www.instagram.com/p/CZ7PHXohyvQ/?utm_source=ig_web_copy_link

    సత్తా చాటిన ఇషాన్ కిషన్… 

    ఈ మెగా వేలంలో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ సత్తా చాటాడు. ఆసీస్ ఓపెనర్ స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌కు ఎక్కువ ధర వస్తుందని అంతా అనుకున్నారు కానీ వార్నర్‌ను కేవలం రూ. 6.25 కోట్లకే ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. 

    అంచనాలు తలకిందులు… 

    ఈ సారి ఐపీఎల్ వేలంలో అంచనాలు తలకిందులయ్యాయి. ఎక్కువ ధర వస్తుందని భావించిన కొంత మందికి తక్కువ ధర.. రాగా కొంత మందికి మాత్రం ఊహించని విధంగా ధర వచ్చింది. 

    రైనాకు బిగ్ షాక్.. 

    మిస్టర్ IPLగా పేరున్న సురేష్ రైనాకు ఈ ఐపీఎల్ వేలంలో బిగ్ షాక్ తగిలింది. రైనాను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపించలేదు. రైనా బేస్ ప్రైస్ రూ. 2 కోట్లు. రైనాను కొనుగోలు చేయకపోవడం పెద్ద షాకే. ఇప్పటి వరకూ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసింది రైనానే కావడం గమనార్హం. 

    అత్యధిక ధరకు ఇషాన్ కిషన్ అమ్ముడు పోయాడు. లివింగ్‌స్టోన్ అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. రూ. 10.75 కోట్లు దక్కించుకుని శ్రీలంకకు చెందిన వానిందు హసరంగ ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన లంకేయుడిగా నిలిచాడు.

    లెక్కలివే…. 

    ఈ ఐపీఎల్ వేలంలో మొత్తం 10 జట్లు పాల్గొన్నాయి. 600 మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 204 మంది ప్లేయర్లు అమ్ముడుపోయారు. 67 మంది ఓవర్సీస్ ప్లేయర్లను ప్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఈ రెండు రోజుల మెగా వేలంలో 10 ప్రాంచైజీలు రూ. 5,51,70,00,000 ఖర్చు చేశాయి.

    హైదరాబాద్ యువకుడిని వరించిన అదృష్టం…

    హైదరాబాద్‌కు చెందిన యువ బ్యాటర్ తిలక్ వర్మను అదృష్టం వరించింది. తిలక్ వర్మను ఈ రోజు వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు రూ. 1.70 కోట్లకు కొనుగోలు చేసింది. 19 ఏళ్ల వయసు మాత్రమే ఉన్న తిలక్ పలు టోర్నీల్లో టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. దీంతో వేలంలో తిలక్ వర్మకు భారీ ధర పలికింది. తిలక్ వర్మ కోసం పలు ప్రాంచైజీలు పోటీ పడ్డాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv