ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQOO) కొత్తగా మరో ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. మే 23న iQoo Neo 8 అనే కొత్త స్మార్ట్ ఫోన్‌ను మోడల్‌ను తీసుకురానున్నట్లు తెలిపింది. అయితే దీన్ని మెుదట చైనాలో తీసుకొస్తామన్న ఐక్యూ.. ఆ తర్వాత భారత్‌లోనూ లాంచ్ చేస్తామని స్పష్టం చేసింది. ఐక్యూ ఫోన్లకు మార్కెట్‌లో మంచి బ్రాండ్ ఉండటంతో కొత్తగా రాబోయే స్మార్ట్‌ఫోన్‌పై అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో iQoo Neo 8 ప్రత్యేకతలు ఏంటీ? అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇందులో ఏమున్నాయి? ధర ఎంత ఉండవచ్చు? వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం.
ఫోన్ డిస్‌ప్లే
iQoo నియో 8 స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల స్కీన్‌తో రానుంది. దీనిని 1.5K AMOLED డిస్‌ప్లేతో తీసుకొస్తున్నారు. 144Hz రిఫ్రెష్ రేటుతో పాటు ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్ పనిచేస్తుంది.
ఫోన్ స్టోరేజ్
iQoo నియో 8 స్మార్ట్‌ఫోన్‌ను 16GB RAMతో తీసుకొస్తున్నారు. ర్యామ్ కేపాసిటీ అధికంగా ఉండటంతో ఈ ఫోన్ చాలా ఫాస్ట్‌గా పనిచేయనుంది. అలాగే ఫోన్ 256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. Micro SD కార్డుకు కూడా ఇది సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Plus Gen 1 ప్రొసెసర్ వర్క్ చేస్తుంది.
కెమెరా
iQoo నియో 8 స్మార్ట్‌ఫోన్‌లో ప్రైమరీ కెమెరా 50MPతో వస్తోంది. ఈ ఫోన్ అల్ట్రావైడ్, డెప్త్ సెన్సార్లతో బ్యాక్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇక ఫ్రంట్ వైపు 16MP కెమెరాను ఫిక్స్ చేశారు. దీనితో క్వాలిటీ సెల్ఫీ కెమెరాలు, వీడియోలు తీసుకోవచ్చు. బ్యాక్ కెమెరాకు ఫ్లాష్ లైట్‌ను కూడా జోడించారు.
బ్యాటరీ
iQoo నియో 8 స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. అధిక బ్యాటరీ సామర్థ్యం వల్ల ఫోన్ ఛార్జింగ్ లైఫ్ ఎక్కువగా ఉండనుంది.
5G సపోర్ట్
iQoo నియో 8 స్మార్ట్‌ఫోన్‌ను 5Gతో తీసుకొస్తున్నారు. అలాగే డ్యూయల్ 4G VoltE, Wi-Fi, 3.5mm ఆడియో జాక్, USB టైప్-సి పోర్ట్‌తో సహా అనేక కనెక్టివిటీ సపోర్ట్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ తక్కువ బరువుతో విడుదల చేయనున్నట్లు సమాచారం.
కలర్స్
iQoo నియో 8 స్మార్ట్‌ఫోన్ రెండు వర్షన్‌లలో తీసుకుస్తున్నారు. ఈ ఫోన్ iQoo నియో 8, iQoo నియో 8 proగా రానుంది. బ్లాక్, గోల్డ్ కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ధర ఎంతంటే?
iQOO Neo 8 ఫోన్ భారత్‌లో ఎక్కువగానే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిని రూ. 44,990కు విక్రయించవచ్చని అభిప్రాయపడుతున్నాయి. దీనిపై మే 23న క్లారిటీ రానుంది.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి