బాలీవుడ్లో శ్రీదేవి ముద్దుల తనయగా అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. ఆనతి కాలంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
తాజాగా తారక్ సరసన ‘దేవర’లో నటించి మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది. జాన్వీ నటిస్తున్న ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఇదే కావడంతో ఈ అమ్మడి గురించి తెలుగు ఆడియన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ అమ్మడి గురించి తెలుసుకుంటూనే ఇప్పటివరకూ చూడని బోల్డ్ ఫొటోలను చూసేయండి.
‘ధడ్’ చిత్రం ద్వారా జాన్వీ బాలీవుడ్లో అడుగుపెట్టింది. అయితే ఆ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో జాన్వీకి పెద్దగా పేరు రాలేదు.
నటనపరంగా జాన్వీకి గుర్తింపు తెచ్చిన సినిమా ‘గుంజన్ సక్సేనా’. నిజ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రంలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఆ తర్వాత ‘గుడ్‌లక్ జెర్రీ’, ‘మిలి’, ‘బవాల్’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు పెద్దగా సక్సెస్ రాలేదు.
ఈ క్రమంలోనే ‘రాఖీ ఔర్ రానీకి ప్రేమ్ కహానీ’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించి జాన్వీ అందరి దృష్టిని ఆకర్షించింది.
రీసెంట్గా బాలీవుడ్లో ‘మిస్టర్ అండ్ మిస్ మహీ’, ‘ఉలాజ్’ చిత్రాల్లో ఫీమేల్ లీడ్‌గా చేసిన నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది.
జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ తెలుగు పరిశ్రమపై భారీ ఆశలు పెట్టుకుంది. తల్లి శ్రీదేవిలా తెలుగు పరిశ్రమపై చెరగని ముద్ర వేయాలనుకుంటోంది.
దేవరతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు కూడా జాన్వీ ఎంపికైంది. రామ్‌చరణ్-బుచ్చిబాబు కాంబోలో రానున్న చిత్రంలో జాన్వీ హీరోయిన్గా నటించనుంది.
ప్రస్తుతం హిందీలో ‘సన్నీ శాన్‌స్క్రీట్ కి తుల్సీ కుమారి’ అనే చిత్రంలో జాన్వీ నటిస్తోంది. ఇందులో లీడ్ రోల్లో ఆమె కనిపించనుంది.
ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే జాన్వీ సోషల్ మీడిాయాలో చాలా చురుగ్గా ఉంటోంది. తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ఈ భామ ఇన్స్టాగ్రామ్ ఖాతాను 25.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?