• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Jawan Movie Interesting Facts: ‘జవాన్‌’ మూవీ గురించి మీకు తెలియని 7 ఇంట్రస్టింగ్‌ విషయాలు..! 

    బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్​, లేడీ సూపర్​ స్టార్ నయనతార లీడ్​ రోల్స్​లో చేసిన చిత్రం ‘జవాన్‌’ (Jawan)​. సెప్టెంబర్‌ 7న రిలీజైన ఈ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. తమిళ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఏడు ఆసక్తికర విషయాలు మీకోసం..

    1. రెండో డైరెక్టర్‌గా ‘అట్లీ’

    1992లో సినీ కెరీర్‌ను ప్రారంభించిన షారుక్‌ ఖాన్‌ సౌత్‌ ఇండస్ట్రీకి చెందిన వారితో పెద్దగా పనిచేయలేదు. ఈ క్రమంలో అట్లీకి ఛాన్స్‌ ఇవ్వడంతో జవాన్‌పై అందరి దృష్టి పడింది. సౌత్‌ ఇండస్ట్రీ నుంచి షారుక్‌ను డైరెక్ట్‌ చేసిన రెండో వ్యక్తిగా అట్లీ నిలిచాడు. అంతకుముందు కమల్‌ హాసన్ దర్శకత్వంలో ‘హే రామ్‌’ షారుక్‌ నటించాడు.

    2. మర్చిపోలేని ఘటన

    సుమారు 13 ఏళ్ల క్రితం షారుక్‌ను చూసేందుకు ముంబయి వెళ్లినట్లు అట్లీ ఓ ఇంటర్యూలో తెలిపారు. అప్పుడు షారుక్‌ లేకపోవడంతో ఆయన ఇంటి ఎదుటే ఫొటో దిగి వచ్చానని పేర్కొన్నారు. అటువంటి తాను కారులో షారుక్‌ ఇంటికి వెళ్లి కథ వినిపించడం జీవితంలో మర్చిపోలేనని అట్లీ సంతోషం వ్యక్తం చేశారు. 

    3. నయన్‌కు ఇదే తొలిసారి

    కోలీవుడ్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటించిన తొలి హిందీ సినిమా జవాన్‌ కావడం విశేషం. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్స్‌ దీపికా పదుకొణే, సంజయ్‌ దత్‌ గెస్ట్‌ రోల్స్‌ చేశారు. ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్‌ గ్రోవర్‌ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు.

    4. వారికీ ఇదే ఫస్ట్‌ టైమ్‌..

    షారుక్‌ – అనిరుధ్‌, అట్లీ – అనిరుధ్‌ కలిసి పనిచేసిన తొలి సినిమా జవాన్‌. టెక్నీషియన్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ అనిరుధ్‌ అంటే ఎంతో ఇష్టమని జవాన్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో షారుక్‌ చెప్పడం విశేషం. 

    5. విలన్‌గా రెండోది..

    జవాన్‌ చిత్రంలో విజయ్‌ సేతుపతి విలన్‌ రోల్‌ చేశారు. ఇది హిందీలో ఆయన నటించిన రెండో సినిమా. తొలి సినిమా ‘ముంబైకర్‌’ ఓటీటీలో విడుదల కావడం గమనార్హం. తాను స్కూల్లో లవ్‌ చేసిన అమ్మాయికి షారుక్‌ అంటే ఇష్టమని, ఇప్పుడు ఆయనతో కలిసి నటించి ఆమెపై రీవెంజ్‌ తీర్చుకున్నాని ఓ ఈవెంట్‌లో విజయ్‌ సేతుపతి అన్నారు. 

    6. ఆరుగురు స్టంట్‌ మాస్టర్లు

    జవాన్‌ మూవీలో మల్లయుద్ద సన్నివేశాలు, ఊపిరిబిగపట్టేంత కారు ఛేజ్‌లు , బైక్‌ స్టంట్‌లు ఉన్నాయి. అంతర్జాతీయంగా పేరున్న స్పిరో రజాటోస్‌, క్రెయిగ్‌ మాక్రే, యానిక్‌ బెన్‌, కిచా కఫడ్గీ, సునీల్‌ రోడ్రిగ్స్‌, అనల్‌ అరసు అనే ఆరుగురు స్టంట్‌ మాస్టర్ల ఆధ్వర్యంలో ఆ సీన్లు షూట్‌ చేశారు. 

    7. తొలి భారతీయ చిత్రం ఇదే

    జవాన్‌ చిత్రం విడుదలైన తొలి రోజే దేశంలో అన్ని భాషల్లో కలిపి ఏకంగా రూ.75 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ (Net Collections) సాధించింది. ఇప్పటివరకూ విడుదలైన అన్ని సినిమాలతో పోలిస్తే ఇదే అత్యధిక నెట్‌ కలెక్షన్స్‌. ఈ సినిమాకు ముందు వరకూ పఠాన్‌ (Pathan) రూ.55 కోట్లు, కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 (KGF 2) రూ. 54 కోట్లు, బాహుబలి (Bahubali) రూ. 41 కోట్లు మాత్రమే ఫస్ట్‌ డే నెట్‌ కలెక్షన్స్‌ వచ్చాయి. తాజాగా జవాన్‌ మూవీ ఆ రికార్డులను బద్దలు కొట్టింది. వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రం రూ.129 కోట్ల గ్రాస్‌ సాధించడం విశేషం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv