ఏప్రిల్ 6 నుంచి 15వరకు జరిగిన జేఈఈ మెయిన్ (సెషన్-2) పరీక్ష ప్రాథమిక కీను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఇటివల విడుదల చేసిన సంగతి తెలిసిందే. కీపై అభ్యంతరాలను విద్యార్థుల నుంచి స్వీకరించింది. ఒక్కో ప్రశ్నకు రూ.200లు చొప్పున తీసుకుని అభ్యంతరాలను సమీక్షించింది. అనంతరం నిన్న రాత్రి జేఈఈ మెయిన్ ఫైనల్ కీని విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌లో కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హత కల్పిస్తారు.
జనవరిలో జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జరగ్గా… ఇటీవల రెండో విడత నిర్వహించారు. ఒకవేళ ఎవరైనా రెండు సార్లు రాసి ఉంటే అందులో ఉత్తమ స్కోరును పరిగణలోకి తీసుకొని జాతీయ పరీక్షల మండలి NTA ర్యాంకులు కేటాయిస్తుంది. జేఈఈ మెయిన్‌లో కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి మెుత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హత కల్పిస్తారు.
జూన్ 4వ తేదీన జరగబోయే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయడానికి ఈ నెల 30 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తొలి విడత జేఈఈ మెయిన్‌కు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా… 8.24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. రెండో విడతకు 9.40 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా… పేపర్ 1,2 కలిపి దాదాపు 9 లక్షల మంది పరీక్ష రాసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!