తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా ఒక్క హీరో మూవీ రిలీజ్ అయ్యిందంటేనే థియేటర్ల వద్ద పెద్ద పండగ వాతావరణం కనబడుతుంది. అదే ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఇంక సిట్యూవేషన్ ఏ రేంజ్‌లో ఉంటుందో మనందరికి తెలిసిందే. అందుకే ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అంటే చాలు అభిమానులు అంతాఇంత సందడి చేయడం లేదు. థియేటర్ల వద్ద జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు భారీ ఎత్తున కటౌట్లు కడుతున్నారు. తమ అభిమానాన్ని ఒకొక్కరు ఒక్కో విధంగా చూపిస్తున్నారు.
కొందరు ఉదయాన్నే థియేటర్ల వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటుంటే.. మరికొందరు బ్యానర్లు వేసి బ్రహ్మరథం పడుతున్నారు. కాని ఓ ఫ్యాన్ మాత్రం ఎన్టీఆర్‌పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా ప్రదర్శించాడు. మూవీ ట్రైలర్‌లో ఎన్టీఆర్ గోచి కట్టుకొని అడవిలో పరుగెడుతున్న సంఘటన గుర్తింది కదా.. అచ్చం అలాగే ఎన్టీఆర్ వేషం వేసి ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు ఈ అభిమానిపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘బ్రో అచ్చం ఎన్టీఆర్‌లానే ఉన్నావ్.. నువ్వు కూడ అడవిలో ఆగకుండా 3 కి.మీ పరుగెత్తూ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం