కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా తెలుగు ఆడియన్స్ సినిమాలను ఆదరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తమిళం, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన పలు చిత్రాలు తెలుగు వెర్షన్‌లో థియేటర్/ఓటీటీల్లో రిలీజై మంచి ఆదరణ సంపాదిస్తున్నాయి. ఇలా వచ్చిన మలయాళ చిత్రాలు ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ ఇక్కడ కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. అయితే తాజాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘కాటేరా’ (Kaatera) తెలుగులో రిలీజయ్యింది. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఈ సినిమా కథేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? వంటి అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రభాస్ రీసెంట్ చిత్రం ‘సలార్’ (Salaar)కు పోటీగా గతేడాది కన్నడ చిత్రం ‘కాటేరా’ (Kaatera ott) థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. కన్నడ స్టార్ దర్శన్ (Darshan) హీరోగా నటించిన ఈ చిత్రానికి తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించాడు. ఆరాధన రామ్ హీరోయిన్‌గా చేసింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ 5’ (Zee 5) తాజాగా తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళ వెర్షన్స్‌లో రిలీజ్ చేసింది. వాస్తవానికి ఫిబ్రవరి 9న ఈ సినిమా కన్నడ వెర్షన్ జీ 5లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా బజ్ ఏర్పడిన ఈ సినిమాను చూసేందుకు ఇతర భాషలవారు కూడా ఆసక్తికనబరిచారు. దీంతో హిందీతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్‌లోకి తీసుకువచ్చినట్లు ‘జీ 5’ వర్గాలు ప్రకటించాయి.
కుల వివక్షపై పోరాటం
భూ సంస్కరణలు, కుల వివక్షతకు ఓ అందమైన లవ్‌స్టోరీని జోడించి దర్శకుడు తరుణ్ సుధీర్ ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. ముఖ్యంగా 1970ల్లో కుల వివక్ష సమాజంలో ఎంత బలంగా ఉండేదో కాటేరాలో చూపించాడు. అగ్ర కులస్తులు తక్కువ కులం వారిని అంటరానివారిగా ఎలా చూసేవవారో ఈ తరం వారికి కళ్లకు కట్టాడు. ముఖ్యంగా కొన్ని సీన్స్, డైలాగ్స్ ద్వారా అప్పట్లో కొన్ని వర్గాల ప్రజల జీవితాలు ఎంత దుర్భరంగా ఉండేవో డైరెక్టర్ తెరపై ఆవిష్కరించారు. ముఖ్యంగా కుల వివక్షను ఉద్దేశిస్తూ సినిమా చెప్పిన డైలాగులు ప్రతీ ఒక్కరినీ ఆలోచింప జేస్తాయి. అయితే కావాలనే ఓ అగ్ర కులాన్ని దర్శకుడు టార్గెట్ చేశాడని అప్పట్లో విమర్శలు వచ్చాయి.
బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం
1970 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల పాటు హౌస్ పుల్ కలెక్షన్లతో ఈ సినిమా థియేటర్లలో దూసుకెళ్లింది. ఈ సినిమా రూ.64.05 కోట్లకు పైగా గ్రాస్ సాధించి కన్నడలో సత్తా చాటింది. ప్రభాస్ హీరోగా చేసిన ‘సలార్’ చిత్రానికి.. కన్నడలో ఈ సినిమా గట్టి పోటీ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత ఈ సినిమా తెలుగు వెర్షన్‌లోనూ అందుబాటులోకి రావడంతో ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
కథేంటి?
దేవరాయ (జగపతిబాబు) అనే భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కాటేరా (దర్శన్) పెరోల్ మీద బయటకు వస్తాడు. జైలు నుంచి విడుదలైన కాటేరాను చంపేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వారందరూ ఎవరు? భీమనహల్లి అనే ప్రాంతంలో కమ్మరిగా పని చేసే కాటేరా ఎందుకు జైలుకు వెళ్లాడు? పెద్దలను ఎదురించి కాటేరాను పెళ్లి చేసుకున్న ప్రభావతి (ఆరాధన రామ్) ఎలా చనిపోయింది? భీమనహల్లి ప్రాంతంలో చాలా ఏళ్లుగా పంటలను సాగుచేస్తోన్న రైతులకు భూమిపై హక్కును కల్పించేందుకు కాటేరా, ప్రభావతి ఎలాంటి పోరాటం చేశారు? దేవరాయ, కాళీగౌడ (వినోద్‌కుమార్) అనే భూస్వాములతో కాటేరాకు ఎందుకు విరోధం ఏర్పడింది? అన్నది కథ.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం