బాహుబలి ముందు వరకూ టాలీవుడ్ (Tollywood)కే పరిమితమైన ప్రభాస్.. ఆ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి వరుసపెట్టి జాతీయ స్థాయి చిత్రాలు చేస్తున్న ప్రభాస్.. రీసెంట్‌గా సలార్ (Salaar)తో సాలిడ్ హిట్‌ను అందుకున్నాడు. ప్రభాస్ (Prabhas) కటౌట్‌కు తగ్గ సినిమా వచ్చిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అందరి దృష్టి ప్రభాస్ అప్‌కమింగ్ చిత్రం ‘కల్కీ 2898 ఏడీ’ (Kalki 2898 AD)పై పడింది. ఎవడే ‘సుబ్రమణ్యం’, ‘మహానటి’ సినిమాల డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కిపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై మూవీ టీమ్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది.
ఆ భయం లేనట్లే!
ప్రభాస్ ‘కల్కీ 2898 ఏడీ’ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో జాప్యం జరుగుతున్నట్లు వార్తలు రావడంతో చిత్ర విడుదలపై అనుమానాలు రేకెత్తాయి. ఇలాంటి సందర్భంలో తాజాగా కల్కి సినిమాలోని ప్రభాస్ గ్లింప్స్ వీడియో విడుదల చేసి అందరి కన్ఫ్యూజన్ దూరం చేసింది వైజయంతీ మూవీ మేకర్స్. కల్కి సినిమాను మే 9న విడుదల చేయడం పక్కా అన్నట్లుగా సోషల్ మీడియాలో వీడియో వదిలింది. ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ పాదం మాత్రమే చూపించారు. ఓ బీట్‌కు ప్రభాస్ కాలు మూమెంట్ వేస్తూ ఉంటుంది. దీనికి టా టక్కర టక్కరే అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు మేకర్స్. ఇక ఇందులో ప్రభాస్ పాదం చూసి వెంకటేశ్వర పాదం అంటారు దాన్ని అని కామెంట్స్ చేస్తున్నారు.
బడ్జెట్ ఎంతంటే?
సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్డెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో ఈ మూవీని నిర్మిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అటు ప్రభాస్ కూడా ఈ సినిమాను ప్రతిష్టాత్మంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకొణె నటిస్తోంది. అలాగే హాట్ బాంబ్ దిశా పటానీ కూడా కల్కిలో కీలక పాత్ర పోషిస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరో ప్రధాన పాత్ర చేస్తుంటే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నారు.
కల్కీలో నాని, తారక్!
‘కల్కీ 2898 ఏడీ’ చిత్రానికి సంబంధించి ఇటీవల ఓ క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) పరశురాముడిగా, నాని (Nani) కృపాచార్య పాత్రలో కాసేపు కనిపిస్తారని ఈ మధ్య వార్తలు జోరు అందుకున్నాయి. వీళ్లే కాకుండా దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా నటిస్తారని ఓ టాక్ ఉంది. ఇదే నిజమైతే ప్రభాస్ కల్కీ చిత్రంతో అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే స్టార్ హీరోల పాత్రలపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
9 పార్ట్‌లుగా కల్కీ!
‘కల్కీ 2898 ఏడీ’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హీరో ప్రభాస్ తన ఫోకస్ మెుత్తం ఈ చిత్రంపైనే పెట్టాడు. అయితే ఈ సినిమాపై వచ్చిన లేటెస్ట్ బజ్ ప్రకారం ‘కల్కీ 2898 ఏడీ’ 9 భాగాలుగా రానున్నట్లు తెలిసింది. ఈ సినిమా కథను ఒక పార్ట్‌తో చెప్పటం సాధ్యం కాదని, బలమైన కథ ఉండటంతో దానిని ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు కనీసం 9 పార్ట్స్‌గా తీయాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇదే నిజమైతే హాలీవుడ్‌ను మించిన క్రేజ్ టాలీవుడ్‌కు దక్కుతుందని విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కల్కీ రిలీజయ్యే భాషలు ఇవే!
‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9వ తేదీన గ్లోబల్ రేంజ్‌లో విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్‍తో పాటు మరికొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ మూవీ గ్లింప్స్ గతేడాది సాని డిగో కామిక్ కాన్ ఈవెంట్ (San Diego Comic-Con 2023)లో లాంచ్ అయింది. ఈ ఈవెంట్‍లో అడుగుపెట్టిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. అప్పటినుంచి మూవీపై హాలీవుడ్‍లో కూడా క్రేజ్ ఉంది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్