ప్రస్తుతం దేశంలో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ఫీవర్ నడుస్తోంది. గ్లోబల్ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ట్రైలర్‌లోని యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ రేంజ్‌ను తలపించాయి. ఇక ఏమాత్రం వేచి ఉండలేమన్న స్థాయిలో ట్రైలర్ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా అమెరికాలో ఈ చిత్రం ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయగా అక్కడ కల్కి సరికొత్త రికార్డును నెలకొల్పింది.
‘ఆర్‌ఆర్‌ఆర్’ రికార్డు బద్దలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’.. జూన్ 27న (Kalki Release Date) వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండంతో అమెరికాలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్‌ను ఓపెన్ చేశారు. లేటెస్ట్ బజ్ ప్రకారం.. అమెరికా ప్రీ బుకింగ్స్ హిస్టరీలో సరికొత్త చరిత్రను కల్కి క్రియేట్ చేసింది. బ్లాక్ బాస్టర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ రికార్డును బద్దలు కొట్టింది. అమెరికా ప్రీ బుకింగ్స్‌లో అతి తక్కువ సమయంలో వన్ మిలియన్ కలెక్షన్స్ క్రాస్ చేసిన తొలి భారతీయ చిత్రంగా కల్కి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. గతంలో ఈ రికార్డు ‘ఆర్‌ఆర్‌ఆర్’ పేరిట ఉండేది. ప్రస్తుతం ప్రీ బుకింగ్ అయిన టికెట్ల సంఖ్య గంట గంటకు గణనీయంగా పెరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
దిశా పటానీ.. క్యారెక్టర్ రివీల్
కల్కి సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్ (Kamal Hassan), దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పటాని (Disha Patani).. ఇలా పలువురు స్టార్స్ నటించిన సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించి ఇప్పటికే పలువురు స్టార్స్ క్యారెక్టర్ల పేర్లను పోస్టర్ల రూపంలో చిత్ర యూనిట్ రివీల్ చేసింది. తాజాగా దిశా పటాని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. నేడు దిశా పటాని పుట్టిన రోజు కావడంతో మూవీలోని ఆమె పాత్ర పేరును కల్కి టీమ్ రివీల్ చేసింది. క్యారెక్టర్ పేరు ‘రాక్సీ’ అని పరిచయం చేస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో దిశా గోడకు ఆనుకొని తన నడుము అందాలు చూపిస్తూ ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
బుజ్జిని నడిపిన ఆనంద్ మహీంద్ర
‘కల్కి’లో ఎంతో కీలకమైన పాత్ర పోషించిన బుజ్జి(వాహనం)ని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా బుధవారం నడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పంచుకుంది. డ్రైవ్ చేసిన అనంతరం ఆనంద్ మహీంద్ర బుజ్జితో ఫొటోలు దిగారు. కాగా, బుజ్జి వెహికల్ తయారీకి.. ‘మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ’ టీమ్ సహాయపడినట్లు ఆనంద్ మహీంద్ర తెలిపారు. ఈ వాహనం రెండు మహీంద్ర ఇ-మోటర్లతో నడుస్తుందని చెప్పారు. నాగ్ అశ్విన్, అతడి టీమ్‌ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఆయన ప్రశంసించారు.