తమిళ స్టార్ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళంలో ఆయన చేసిన చిత్రాలన్నీ దాదాపుగా తెలుగులో రిలీజై మంచి విజయాలను అందుకున్నాయి. రీసెంట్‌గా వచ్చిన సత్యం సుందరం కూడా తమిళంతో పాటు తెలుగులోనూ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు భాష, ఇక్కడి ప్రేక్షకులంటే తనకు ఎంతో ఇష్టమని కార్తీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇదిలాఉంటే సత్యం సుందరం సక్సెస్ మీట్‌లో భాగంగా నిర్వహించిన ఇంటర్యూలో నటుడు కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుడు మహేష్ బాబుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మహేష్ నా క్లాస్‌మేట్: కార్తీ
కార్తీ (Karthi), అరవింద స్వామి (Aravinda Swami) ప్రధాన పాత్రల్లో నటించిన ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) చిత్రం శనివారం (సెప్టెంబర్ 28) విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కార్తీ మాట్లాడారు. సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్రమంలో ఫ్యూచర్‌లో మహేష్‌తో సినిమా చేసే ఛాన్స్ ఉందా? అంటూ రిపోర్టర్ కార్తీని అడిగారు. దీనికి కార్తీ బదులిస్తూ సరైన కథ దొరికితే మహేష్‌తో తాను సినిమా చేయడానికి రెడీ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు మహేష్ తాను స్కూల్లో క్లాస్‌మేట్స్ అంటూ పెద్ద సీక్రెట్‌ను రివీల్ చేశాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా షాకయ్యారు. అటు ఫ్యాన్స్ కూడా కార్తీ మాటలు విని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకాలం ఈ విషయం తమకు తెలియలేదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కథ వినగానే అనుమానించా!
సత్యం సుందరం స్టోరీ వినగానే ఇలాంటి సినిమాను ఈ రోజుల్లో చూస్తారా? అని అనుమానం కలిగిందని కార్తీ (Karthi) పేర్కొన్నారు. కానీ, కొత్త కాన్సెప్ట్‌తో వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ‘తెలుగు ప్రేక్షకులు చాలామంది నాకు ఫోన్ చేశారు. వారు సినిమా చూసి చాలా ఎమోషనల్‌గా ఫీలవ్వడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మంచి సినిమా కమర్షియల్‌గా కూడా విజయం సాధిస్తే నిర్మాతలకు కూడా ప్రోత్సాహకంగా ఉంటుంది. ఈ తరహా చిత్రాలు చూస్తే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది’ అని కార్తీ చెప్పుకొచ్చారు.
కార్తీకి కథ చెప్పిన రాజమౌళి!
తమిళ స్టార్ హీరో కార్తీ ఇటీవల ఓ ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సత్యం సుందరం’ ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ గౌతమ్ మీనన్‌తో కార్తీ ఇంటర్యూ చేశారు. ఇందులో సూర్య, కార్తీ కలిసి నటించడంపై గౌతమ్ మీనన్ ప్రశ్నించగా గతంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని కార్తీ పంచుకున్నాడు. ‘నేను కార్తిక్ కలిసి నటిస్తాం. అందుకు తగ్గ స్క్రిప్ట్ రావాలి. గతంలో రాజమౌళి సర్ మాకు ఒక కథ వినిపించారు. అది బాగానే ఉంది కానీ ఆ సినిమా వర్కౌట్ కాలేదు’ అని తెలిపాడు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా నెట్టింట వైరల్ అయ్యాయి. రాజమౌళి చెప్పింది ‘RRR’ అయ్యి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
డిసెంబర్‌లో ‘SSMB 29’ షూటింగ్!
మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా SSMB29కి సంబంధించిన అధికారిక అప్‌డేట్ ఉంటుందని సమాచారం. డిసెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మెుదలవుతుందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. మెుదటి షెడ్యూల్ జర్మనీలో స్టార్ట్ అవుతుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. 18వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో అరుదైన గిరిజన తెగల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉండనున్నట్లు తెలుస్తోంది.
Celebrities Featured Articles Political Figure
Revanth Reddy: ‘బన్నీ బౌన్సర్ల వల్లే తొక్కిసలాట’.. సీఎం రేవంత్ సంచలన నిజాలు