ఈశ్వరా..పవరేశ్వరా అంటూ అభిమానులు దైవంగా భావించే రియల్ హీరో పవన్ కల్యాణ్. నటుడిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయవేత్తగా లక్షలాది మంది గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న ఇతడికి ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలుసు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా కీర్తించబడుతున్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కాని సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన పవర్‌స్టార్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
పవన్ కల్యాణ్ ఎవరు..?
హీరో, నిర్మాత, డైరెక్టర్, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త, మార్షల్ ఆర్టిస్ట్
పుట్టిన రోజు ఎప్పుడు..?
1971, సెప్టెంబర్ 2న కొణిదెల వెంకటరావు-అంజనా దేవి దంపతులకు బాపట్లలో జన్మించాడు. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులు ఇతని సొంత అన్నలు. ఇతడికి ఇద్దరు అక్కలు కూడ ఉన్నారు. సొంత పశ్చిమ గోదావరి అయినప్పటికీ తండ్రి వెంకటరావు కానిస్టేబుల్ కావడంతో వివిధ ప్రాంతాల్లో తిరగాల్సి వచ్చింది. పెద్దన్నయ్య చిరంజీవి ద్వారా సినిమాలపై ఆసక్తి ఏర్పడింది.
వయస్సు, ఎత్తు ఎంత?
వయస్సు 50 సంవత్సరాలు. ఎత్తు 5’8 సెం.మీ(1.78 మీటర్లు)
ఎన్ని సినిమాల్లో హీరోగా నటించాడు..?
పవన్ కల్యాణ్ దాదాపు 27 సినిమాలకు హీరోగా నటించాడు. జానీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సర్దార్ గబ్బర్ సింగ్, చల్ మోహన రంగా చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. చాలా సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్‌గా, స్టంట్ మాస్టర్‌గా చేశారు. నటుడిగా మాత్రమే కాకుండా గొప్ప మానవతవాదిగా, రాజకీయవేత్తగా కీర్తిప్రతిష్ఠలు సంపాదించాడు.
బాల నటుడిగా ప్రస్థానం ఎప్పుడు..?
మెగాస్టార్ చిరంజీవి స్వతహాగా ఇండస్ట్రీలో ఎదిగారు. అతడిని ఆదర్శంగా తీసుకొని 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ హీరో తొలుత డైరెక్టర్ అవ్వాలని భావించాడట. కాని వదిన సురేఖ అభిప్రాయం మేరకు నటుడిగా మారాడు. అలాగే పెప్సీ కంపెనీకి యాడ్ ఇచ్చిన తొలి సౌత్ ఇండియా స్టార్ ఇతడే కావడం గమనార్హం.
భార్య ఎవరు..? పెళ్లి ఎప్పుడు జరిగింది..?
పవన్ కల్యాణ్ ముగ్గురిని వివాహమాడారు. 1997లో నందినిని వివాహమాడగా 2008లో విడాకులు తీసుకున్నారు. తదనాంతరం మోడల్, నటి అయిన రేణు దేశాయ్‌ని 2009, జనవరి 28న రెండో వివాహం చేసుకున్నారు. వీరికి అకీరా, ఆద్య పుట్టారు. ఇద్దరి ఇష్టప్రకారం 2012లో విడిపోయారు. 2013లో ఎర్రగడ్డలోని రిజిస్టర్ ఆఫీస్‌లో రష్యాకు చెందిన అన్నా లెజ్నేవాను పెళ్లి చేసుకున్నారు.
ముద్దు పేర్లు ఏంటి..?
పవన్ కల్యాణ్ అసలు పేరు కొణిదెల కల్యాణ్ బాబు. కాని స్టంట్స్ చేయడం కారణంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అనే పేరు సంపాదించాడు. అలాగే అభిమానులు జనసేనాని అని, గబ్బర్ సింగ్ అని ప్రేమగా పిలుస్తుంటారు.
ఇష్టమైన మూవీ ఏది..?
తను హీరోగా నటించిన నాలుగో చిత్రం తొలిప్రేమ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని అత్తారింటికి దారేది మూవీ థ్యాంక్యూ పార్టీలో పవన్ కల్యాణే స్వయంగా వెల్లడించారు. చిరంజీవి ఖైదీ మూవీ కూడ ఇష్టమట.
ఇష్టమైన ఫుడ్, పుస్తకం, వ్యాపకాలు..?
నెల్లూరు చేపల పులుసు, నాటు కోడి కూర, పులిహోర అంటే చాలా ఇష్టమట. కాని ప్రస్తుతం వెజిటేరియన్‌గా మారాడట. పవన్ కల్యాణ్ పుస్తక ప్రియుడు. ఇతడిని ఎక్కువగా శేషేంద్రశర్మ రచనలు, గాంధీజీ సత్యశోధన, ఒక యోగి ఆత్మకథ రచనలు ప్రభావితం చేశాయట. రీడింగ్, గార్డెనింగ్ చేయడాన్ని వ్యాపకాలుగా మార్చుకున్నారు.
ఎన్ని అవార్డులు వరించాయి..?
ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వరించాయి. సిమా, సంతోషం, ఐఫా అవార్డులను అతడు సంపాదించుకున్నాడు.
యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారు..?
విశాఖపట్నంలోని సత్యనంద్ ఫిల్మ్ స్కూల్‌లో యాక్టింగ్ నేర్చుకున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రీకరణ దశలో ఉంది. భవదీయుడు భగత్ సింగ్ త్వరలో సెట్స్‌పైకి ఎక్కనుంది. ఇతడు నటించిన ఎక్కువ సినిమాలకు రేణు దేశాయ్ డ్రస్సెస్ డిజైన్ చేయడం గమనార్హం.
రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభం..?
మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతోనే రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టాడు. ప్రజారాజ్యాం పార్టీ అనుబంధ విభాగమైన యువరాజ్యంకి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించాడు. తదనాంతరం ఆ పార్టీని వీడి 2014, మార్చి 14న జనసేన పార్టీ స్థాపించాడు. 2014 ఎన్నికల్లో తెదేపా, భాజపా కూటమికి మద్దతిచ్చాడు. 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఒకే స్థానంలో ఆ పార్టీ విజయం సాధించింది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలపరంగా, సినిమాలపరంగా బిజీగా ఉన్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!