• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Latest Bikes In India: ఇటీవల రిలీజైన మోస్ట్‌ స్టన్నింగ్‌ బైక్స్‌.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి!

    ప్రస్తుతం దేశంలో వాహన తయారీ రంగం వేగంగా అభివృద్ది చెందుతోంది. ముఖ్యంగా ద్విచక్రవాహనాలు ఏటా లక్షల్లో సేల్ అవుతున్నాయి. వీటికి అనుగుణంగా ప్రముఖ ఆటోమెుబైల్‌ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త బైక్స్‌ లాంచ్‌ చేస్తూ టూవీలర్‌ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్‌గా పలు మోస్ట్‌ వాంటెడ్‌ బైక్స్‌ దేశీయ మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. స్టైలిష్‌ లుక్‌తో పాటు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో ఆకట్టుకున్నాయి. ఆ బైక్స్‌ ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. 

    Revolt RV400 

    ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌.. వరల్డ్‌కప్‌ నేపథ్యంలో క్రికెట్‌ స్పెషల్‌ ఎడిషన్‌గా మార్కెట్‌లోకి విడుదలైంది. దీని ధర రూ.1.40 లక్షలు (ఆన్‌ రోడ్‌ ప్రైస్‌). ఒకసారి ఛార్జ్ చేస్తే 150 km వరకూ ప్రయాణించవచ్చు. టాప్‌ స్పీడ్‌ 85 km/hrగా ఉంది. 5 సంవత్సరాలు లేదా 75,000 Km బ్యాటరీ వారంటీ కూడా ఉంది. 

    Honda XL750 Transalp

    ఈ హోండా బైక్‌ కూడా రీసెంట్‌గా లాంచ్ అయ్యింది. Honda XL750 Transalp ఆన్‌రోడ్‌ ప్రైస్‌ రూ.11 లక్షలుగా ఉంది. ఈ బైక్‌ 755 cc ఇంజిన్‌తో తయారైంది. 75 Nm టార్క్‌, 91.7 PS పవర్‌ను ఉత్పత్తి చేస్తోంది. లీటర్‌కు 23 kmpl మైలేజ్‌ను బైక్‌ ఇస్తుందని హోండా కంపెనీ తెలిపింది.

    Honda CB350RS New Hue Edition

    హోండా నుంచి మరో పవర్‌ఫుల్‌ బైక్‌ కూడా ఇటీవలే విడుదలైంది. ఈ బైక్‌ ఆన్‌ రోడ్‌ ప్రైస్‌ను రూ.2.19 లక్షలుగా హోండా నిర్ణయించింది. ఇది 348.36cc శక్తివంతమైన ఇంజిన్ కలిగి ఉంది. ఈ బైక్ 21.07 PS పవర్‌, 30 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. 179 కేజీల బరువు కలిగిన ఈ హోండా బైక్‌ లీటర్‌కు 35 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు. 

    Triumph Scrambler 400 X

    ఈ బైక్‌ 398.15 cc ఇంజిన్‌ను కలిగి ఉంది. 40 PS పవర్‌, 37.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్యూబ్‌లెస్‌ టైర్లు కలిగిన ఈ బైక్‌.. ముందు, వెనక డిస్క్‌ బ్రేక్‌లను కలిగి ఉంది. దీని బరువు 186 కేజీలు. మార్కెట్‌లో రూ.2.63 లక్షలకు (ఢిల్లీలో ఆన్‌ రోడ్‌ ప్రైస్‌) సేల్ అవుతోంది.

    Yamaha FZS-FI V4 STD

    ఈ యమహా బైక్ ధర రూ.1.29 లక్షలుగా ఉంది. స్టైలిష్‌ లుక్‌తో రిలీజైన ఈ బైక్‌ 149 cc ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది లీటర్‌కు 46 kmpl మైలేజ్‌ను ఇస్తుంది. ఇతర బైక్‌లతో పోలిస్తే దీని బరువు (136 kg) కూడా తక్కువే. కాబట్టి ఈజీగా దీన్ని హ్యాండిల్ చేయవచ్చు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv