• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Latest OTT releases Telugu: ఈ వీకెండ్‌లో తప్పక చూడాల్సిన చిత్రాలు, సిరీస్‌లు ఇవే!

    ఓటీటీలో కొత్త సినిమాలు చూడాలనుకునేవారికి ఈ వారం మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ దొరకనుంది. తెలుగులో చాలా చిత్రాలు ఈ వీకెండ్‌లో స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. మరికొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చి మంచి వ్యూస్‌ సాధిస్తున్నాయి. కొన్ని డబ్బింగ్‌ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సైతం మిమ్మల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్‌ కానున్నాయి? వాటి ప్లాట్స్ ఏంటి? వంటి విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. 

    హరోం హర (Harom Hara)

    సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కిన ‘హరోం హర’ చిత్రం జూన్‌ 14న థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ఆహా వేదికగా జూలై 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అటు జులై 18 నుంచి ఈటీవీ విన్‌లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానుంది. ప్లాట్‌ ఏంటంటే.. ‘కుప్పం అనే ప్రాంతానికి బతుకు తెరువు కోసం వచ్చిన సుబ్రహ్మణ్యం అనే యువకుడు.. అక్కడ అరాచకం సృష్టిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల ముఠాను ఎలా ఎదుర్కొన్నాడు? ఆ ప్రాంతానికి దేవుడిగా ఎలా మారాడు?’ అన్నది కథ.

    ది గోట్‌ లైఫ్‌ (ఆడు జీవితం)

    స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మలయాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వ‌హించ‌గా అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సర్వైవల్ అడ్వెంచర్‌గా వ‌చ్చిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై ఘన విజయం సాధించింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.150 కోట్ల‌కు పైగా వసూళ్లను రాబ‌ట్టింది. కాగా, ఈ చిత్రం జూలై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాష‌ల్లో ప్రసారం కానుంది. ప్లాట్‌ ఏంటంటే.. ‘నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా?’ అన్నది కథ

    మ్యూజిక్‌ షాప్‌ మూర్తి (Music Shop Murthy)

    అజయ్‌ ఘోష్‌ (Ajay ghosh) టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం మ్యూజిక్‌ షాప్ మూర్తి (Music Shop Murthy). శివ పాలడుగు (Siva Paladugu) ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ మూవీ రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా జులై 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హీరోయిన్‌ చాందిని చౌదరి కీలక పాత్ర పోషించింది. ప్లాట్ ఏంటంటే.. ‘మూర్తి (అజయ్‌ ఘోష్‌).. 52 ఏళ్ల వయసులో మ్యూజిక్‌ షాప్‌ నడుపుతుంటాడు. అయితే మూర్తికి డీజే అవ్వాలన్న కోరిక ఉంటుంది. డీజేలో శిక్షణ పొందిన అంజన (చాందిని చౌదరి).. ఓ కారణం చేత మూర్తిని కలుస్తుంది. అతడి ఆసక్తిని గమనించి డీజే నేర్పిస్తుంది. అలా సిటీకి వచ్చిన మూర్తి.. డీజేగా సక్సెస్‌ అయ్యాడా? ఈ క్రమంలో అతడు పడ్డ కష్టాలేంటి?’ అన్నది కథ.

    బూమర్ అంకుల్‌ (Boomer Uncle)

    తమిళ స్టార్ కమెడియన్‌ యోగిబాబు (Yogi Babu) ప్రధాన పాత్రలో చేసిన చిత్రం ‘బూమర్ అంకుల్‌’. ఇందులో ఓవియా, రోబో శంకర్‌ ముఖ్యమైన పాత్రలు పోషించారు. స్వదీస్‌ ఎమ్‌.ఎస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చిలో థియేటర్లలో విడుదలైంది. ఈ నెల 20 నుంచి ఆహా వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌కు రానుంది. ప్లాట్‌ ఏంటంటే.. ‘నేసమ్‌ (యోగిబాబు), విదేశీ యువతి అమీ (ఓవియా)ని పెళ్లి చేసుకుంటాడు. ఓ కారణం చేత భార్య నుంచి విడాకులు తీసుకోవాలని అనుకుంటాడు. ఓ షరతుపై అందుకు అమీ అంగీకరిస్తుంది. ఆ కండిషన్‌ ఏంటి? విడాకులు ఎందుకు కోరుకున్నాడు?’ అన్నది స్టోరీ.

    హాట్‌స్పాట్‌ (Hotspot)

    గౌరీ జీ. కిషన్, ఆదిత్య భాస్కర్, సాండీ, అమ్ము అభిరామ్, జనని, సుభాష్, కలైయారాసన్, సోఫియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హాట్‌స్పాట్‌’. మార్చి 29న తమిళంలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా జులై 17న ఆహా (Aha) వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఆంథాలజీ నేపథ్యంలో నాలుగు కథల సమాహారంగా ఈ సినిమా రూపొందింది. ప్లాట్‌ ఏంటంటే ‘నలుగురు యువతులు వారి భాగస్వాముల చుట్టూ కథ నడుస్తుంది. వారి రిలేషన్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? వాటి నుంచి ఆ జంట ఎలా బయటపడింది? అన్నది స్టోరీ. 

    నాగేంద్రన్స్‌ హనీమూన్‌ (Nagendran’s Honeymoons)

    నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ (Suraj Venjaramoodu) ప్రధాన పాత్రలో నటించిన మలయాళ వెబ్ సిరీస్ ‘నాగేంద్రన్స్ హనీమూన్’. దీనికి ‘1 జీవితం 5 గురు భార్యలు’ అనేది ఉపశీర్షిక. ఐదుగురు భార్యలతో భర్త హనీమూన్‌కు వెళ్లడం అనే కాన్సెప్టుతో డార్క్ కామెడీగా ఈ సిరీస్‌ రూపొందింది. జులై 19 నుంచి హాట్‌స్టార్ (Disney + Hotstar) వేదికగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. ఈ సిరీస్‌కు రెంజీ ఫణిక్కర్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో కేరళ క్రైమ్ ఫైల్స్, మాస్టర్ పీస్, పెరిల్లోర్ ప్రీమియర్ లీగ్ వంటి మంచి వెబ్ సిరీస్‌లను తెరకెక్కించారు. 

    బహిష్కరణ (Bahishkarana)

    ప్రముఖ నటి అంజలి (Anjali) వేశ్య పాత్రలో నటించిన సిరీస్‌ ‘బహిష్కరణ’. ఇది జీ 5 వేదికగా జులై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. రూరల్‌ రివేంజ్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సిరీస్‌ను ముకేశ్‌ ప్రజాపతి తెరకెక్కించారు. ఇందులో  అంజలితో పాటు రవీంద్ర విజయ్ (Ravindra Vijay), అనన్య నాగళ్ల (Ananya Nagalla), శ్రీతేజ్ (Sri Tej), షణ్ముఖ్ (Shanmukh), మహబూబ్ బాషా (Mahaboob Basha), చైతన్య సాగిరాజు (Chaitanya Sagiraju) కీలకపాత్రలు పోషించారు. 

    త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్ (Tribhuvan Mishra CA Topper)

    ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మరో ఆసక్తికర వెబ్‌సిరీస్‌ ‘త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్’. జులై 18 నుంచి నెట్‌ఫ్లిక్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు అమిత్‌ రాజ్‌ దర్శకత్వం వహించారు. మీర్జాపూర్‌ సిరీస్‌ క్రియేటర్ల నుంచి రావడంతో ఈ సిరీస్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్లాట్ ఏంటంటే ‘చార్టెడ్‌ అకెంటెంట్‌ త్రిభువన్‌ (మానవ్‌ కౌల్‌) ఓ మహిళా క్లైంట్‌తో శారీరక సంబంధాన్ని పెట్టుకుంటాడు. ఈ రిలేషన్‌ అతడ్ని చిక్కుల్లో పడేస్తుంది. తన భార్యతో సంబంధం పెట్టుకున్న త్రిభువన్‌ను చంపాలని ఓ గ్యాంగ్‌స్టర్‌ నిర్ణయించుకుంటాడు. అతడి బారి నుంచి త్రిభువన్‌ తప్పించుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv