• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Lava Blaze 3 5G : అతి తక్కువ ధరకే 5G ఫోన్, ఇండియన్ బ్రాండ్ నుంచి సరికొత్త ఫోన్ లాంచ్

    ఇండియన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా నుంచి మరో స్మార్ట్‌ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది.  Lava Blaze 3 5G పేరుతో మార్కెట్‌లోకి విడుదల కానుంది. చౌకైన స్మార్ట్‌ఫోన్ విభాగంలో దీనికి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. Blaze 3 5G అధికారిక విడుదల తేదీ కూడా ప్రకటించింది.  దీంతో పాటు డివైస్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు  అమెజాన్ సైట్‌లో రన్ అవుతున్నాయి.

    Lava Blaze 3 5G  డిజైన్,  ఇతర కీలక స్పెసిఫికేషన్లను అమెజాన్ ధృవీకరించింది. ప్రారంభ తేదీని ప్రకటించే ముందు, Blaze 3 5G ధరకు సంబంధించిన వివరాలను లావా ఇప్పటికే తెలిపింది.

    Lava Blaze 3 5G ధర

    అమెజాన్ ప్రకారం, Lava Blaze 3 5G ప్రారంభ ధర రూ. 9,999గా ఉంది.  ఇది ‘స్పెషల్ లాంచ్ ప్రైస్’లో భాగంగా అందుబాటులో ఉంటుంది. ఈ ధరలో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉంటాయి. Lava Blaze 3 5G మొదటి సేల్ సెప్టెంబర్ 18న తెల్లవారుజామున 12:00 గంటలకు (IST) ప్రారంభం కానుందని లావా ధృవీకరించింది.

    Lava Blaze 3 5G స్పెసిఫికేషన్లు

    Lava Blaze 3 5Gలో MediaTek Dimensity 6300 SoC ప్రాసెసర్ చిప్‌తో రన్ కానుంది. ఇది 410K కంటే ఎక్కువ AnTuTu స్కోర్‌ను పొందింది. ఈ గ్యాడ్జెట్  6GB వరకు RAM,  128GB UFS 2.2 స్టోరేజ్ సామర్థ్యంతో ఈ ప్రైస్‌ సెగ్మెంట్లో ప్రత్యేకంగా నిలవనుంది. దీనికి అదనంగా, 6GB వర్చువల్ RAM‌గా ఉపయోగించుకునే వీలును కల్పించారు

    డిస్‌ప్లే

    ఈ ఫోన్‌లో 6.56-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. Lava Blaze 3 5Gలో డ్యుయల్ స్టీరియో స్పీకర్లు ఉంటాయి. 18W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్న 5,000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది. Lava Blaze 3 5G గ్యాడ్జెట్  Android 14 క్లీన్ వెర్షన్‌పై నడుస్తుంది.

    కెమెరా ఫీచర్లు

    ఇక ఆప్టిక్స్ విషయానికొస్తే, Lava Blaze 3 5Gలో ప్రధాన కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ సెన్సార్,  2MP AI లెన్స్‌తో కూడిన డ్యూయల్-కెమెరా ఉంది. LED ఫ్లాష్ మాడ్యూల్ కింద Vibe Light ఉంటుంది, ఇది లోలైట్‌లో మంచి  ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీని అందిస్తుంది. ముందు వైపున, హోల్-పంచ్ కటౌట్‌లో 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది నాణ్యమైన ఫొటోలు తీయనుంది.

    కనెక్టివిటీ & కలర్స్

    Lava Blaze 3 5G  అన్ని సబ్ 6nm వేవ్ 5G బ్యాండ్‌లకు సపోర్ట్ చేస్తుంది. అదనంగా, Lava Blaze 3 5G సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ రీడర్, ఫేస్ అన్‌లాక్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గ్లాస్ బ్యాక్ డిజైన్‌లో వస్తుంది. గ్లాస్ బ్లూ,  గ్లాస్ గోల్డ్ రంగులలో అందుబాటులో ఉంటుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv