• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘Like Share and Subscribe’ Movie Review: యూట్యూబర్ల చిత్రాన్ని ప్రేక్షకుడు లైక్ చేశాడా..?

    ఫరియా అబ్దుల్లా, సంతోష్ శోభన్ జంటగా నటించిన ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ట్రైలర్‌‌ ఆకట్టుకోవడంతో సినిమాపై కాస్త అంచనాలు పెరిగాయి. పైగా కామెడీ సినిమాల దర్శకుడిగా పేరున్న మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయడంతో కొంత హైప్ క్రియేట్ అయింది. మరి ఈ సినిమా థియేటర్ల వద్ద ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.

    కథేంటి?

    విప్లవ్(సంతోష్ శోభన్) ఓ యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్. కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడం, అన్వేషించడం విప్లవ్ అలవాటు. తన ఛానల్‌ని మెరుగు పరుచుకోవడంపైనే దృష్టి సారిస్తుంటాడు. ఇవే పోలికలతో సంపన్న కుటుంబం నుంచి వచ్చిన వసుధ(ఫరియా అబ్దుల్లా) విప్లవ్‌కి తారసపడుతుంది. ఇలా సాగుతుండగా కథలోకి నక్సలైట్లు ఎంట్రీ ఇస్తారు. విప్లవ్, వసుధలను అంతం చేసేందుకు వెంట పడతారు? అసలు వీరికి, నక్సల్స్‌కి మధ్య ఉన్న వైరమేంటి? ఎందుకు వీళ్ల వెంటపడుతున్నారు? చివరికి విప్లవ్, వసుధ ఏమయ్యారు? అనేదే మిగతా కథ. 

    ఎవరెలా చేశారు..?

    విప్లవ్‌గా సంతోష్ శోభన్ ప్రేక్షకులను అలరించాడు. సన్నివేశానికి తగ్గట్టు తన డైలాగుల్లో మాడ్యులేషన్‌ని మార్చి హాస్యం పండించడంలో సక్సెస్ అయ్యాడు. తన నటనా నైపుణ్యానికి మరింత పదును పెట్టాడు. కామెడీ టైమింగ్ బాగుంది. ఇక చిట్టిగా సుపరిచితమైన ఫరియా తన పరిధి మేరకు నటించింది. కథకు అనుగుణంగా చేసి సంతృప్తి పరిచింది. బ్రహ్మాజీ, సుదర్శన్ కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు. 

    సాంకేతికంగా..?

    ప్రవీణ్ లక్కరాజు అందించిన సంగీతం బాగుంది. పాటలు ఒకే. వసంత్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు పని చెప్పాల్సింది. అనవసర సీన్లు విసుగు తెప్పిస్తాయి.

    గాడి తప్పిన దర్శకుడు

    డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ సినిమా నడపడంలో  గాడి తప్పాడు. ట్రావెల్ వ్లాగింగ్, నక్సల్స్ అనే రెండు అంశాలను ప్రధానంగా దృష్టి పెట్టుకుని హాస్యాన్ని జోడించినట్లు అనిపించింది. కథనం నెమ్మదించింది. నక్సలైట్ల ఉద్యమం 1990దశకంలోనే కనుమరుగైనా 2010 దశకంలో జరిగినట్లు చూపించారు. ఇక్కడ డైరెక్టర్ తప్పటడుగు వేశాడేమో అనిపిస్తుంది. మొత్తానికి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయలేకపోయాడు.

    బలాలు

    నటీనటులు

    కామెడీ సన్నివేశాలు

    బలహీనతలు

    కథ

    బలహీన కథనం

    ఫైనల్‌గా.. ఈ య్యూటూబర్ల చిత్రానికి ప్రేక్షకులు లైక్ కొట్ట లేదు.

    రేటింగ్: 2/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv