• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Love Temples: మీ లవర్‌తో ఈ టెంపుల్స్‌కు వెళ్లండి.. పెళ్లి కచ్చితంగా అవుతుంది!

  రెండు జీవితాలను, రెండు కుటుంబాలను ఏకం చేసే కార్యం పెళ్లి. వివాహంతో శరీరాలు మాత్రమే కాదు మనసులు కూడా ఏకం అవుతాయి. ముఖ్యంగా ప్రేమ పక్షులు త్వరగా వారి పెళ్లి జరగాలని బలంగా కోరుకుంటారు. ఎలాంటి ఆటంకాలు రాకుండా ఈ శుభకార్యం జరగాలని, భవిష్యత్తు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తారు. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలను దర్శించుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటే ప్రేమించిన వారితోనే పెళ్లి అవుతుందని విశ్వసిస్తున్నారు. ఇంతకీ ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? వాటి ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడు చూద్దాం

  భారత్‌లోని ప్రసిద్ధ ప్రేమ దేవాలయాలు (Love Temples In India)

  తిరుమంజేరి టెంపుల్‌, తమిళనాడు

  మీ ప్రేమను గెలిపించుకోవాలని అనుకుంటున్నారా? ఈ ఆలయానికి (Thirumananjeri Temple) వెళ్లండి. ఇందులో కొలువుదీరిన పార్వతీ సమేత పరమేశ్వరుడిని దర్శించుకుంటే ప్రేమించిన వారితోనే పెళ్లి అవుతుందని ప్రాశస్త్యంలో ఉంది. తమిళనాడు కుంభకోణం సమీపంలో ఉన్న ఈ దేవాలయాన్ని ప్రేమికుల ఆలయం అని కూడా అంటుంటారు. తన కఠోర తపస్సుతో పార్వతీదేవీ శివుడిని ఈ స్థలంలోనే ప్రసన్నం చేసుకుందని పురాణం చెబుతోంది. అందుకే ఇక్కడ లింగాకారంలో కాకుండా.. పార్వతీ సమేతంగా దర్శనమిస్తుంటాడు శివుడు.

  ఖజురహో ఆలయం, మధ్యప్రదేశ్‌

  ఖజురహో (Khajuraho Temple) అనగానే ముందుగా శృంగార భంగమల్లోని శిల్పాలు గుర్తుకు వస్తాయి. అయితే ఈ ఆలయం అందుకు మాత్రమే ఫేమస్‌ కాదట. ప్రేమ జంటల కోరికలు తీర్చే పెన్నిదిగా ఈ ఆలయాన్ని చెబుతుంటారు. ఇక్కడికి వచ్చి మెుక్కుకుంటే ఇష్టపడ్డ వారితో పెళ్లి జరుగుతుందని చాలా మంది నమ్ముతుంటారు. మరోవైపు కొత్తగా పెళ్లైన జంటలు కూడా ఖజురహో ఆలయానికి ఎక్కువగా వస్తుంటారు. వాత్సాయునుడి కామసూత్ర గ్రంథంపై అవగాహన లేనివారు.. ఒక్కసారి ఇక్కడికి వస్తే చాలు, చక్కని అనుభూతితో తిరిగి వెళ్తారు. మధ్యప్రదేశ్‌లోని చత్తర్‌పూర్ జిల్లాలో ఖజురహో ఉంది.

  శ్రీ మంగళీశ్వరార్ ఆలయం, తమిళనాడు 

  తిరుచ్చి బస్టాండ్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాల్గుడి గ్రామంలో ఈ ఆలయం (Sri Mangalyeswarar Temple) ఉంది. మాంగల్య మహర్షి ఈ ఆలయంలో కొలువు దీరి ఉన్నారు. ఆయన దేవతలందికీ గురువు అని విశ్వసిస్తారు. వివాహ సమయాన్ని నిర్ణయించేది కూడా ఆయనేనని నమ్ముతారు. తనకు ఇష్టమైన వ్యక్తితో పెళ్లి జరగాలని కోరుకునే యువతులు ఇక్కడ నెయ్యితో దీపం వెలిగిస్తే వారి కోరిక వెంటనే నేరవేరుతుందని స్థానికుల విశ్వాసం.

  శ్రీ వేదపురీశ్వర ఆలయం, తమిళనాడు

  తంజావూరు జిల్లాలోని తిరువయ్యారు ప్రాంతంలో ఈ గుడి (Vedapuriswarar Temple) ఉంది. చోళ రాజు తన కుమార్తె వివాహం గురించి చాలా ఆందోళన చెందుతూ ఈ గుడికి వెళ్లాడట. ఇక్కడ ఉన్న మంగైర్కరసి దేవిని పూజించడంతో తన కుమార్తె వివాహం జరిగిందని ఇక్కడ స్థల పురాణం. ఇక్కడ చేసే ప్రార్థనలు, అభిషేకం సరైన జీవిత భాగస్వామిని చేరుకోవడానికి ఒక మార్గాన్ని సృష్టిస్తుందని ఇక్కడి వారి నమ్మకం. ప్రేమికులు ఈ ఆలయానికి తప్పగా భార్య, భర్తలుగా మారతాని పండితులు చెబుతున్నారు. 

  హనుమాన్ దేవాలయం, గుజరాత్‌

  గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని మేఘని నగర్ ప్రాంతంలో ఈ పురాతన హనుమాన్ ఆలయం (Lagania Hanuman Mandir) ఉంది. లగానియా (వివాహం చేసే) హనుమంతుడిగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయంలో వివాహం చేసుకున్న ప్రేమ జంట సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కలిగి ఉంటారని నమ్ముతారు. అంతేకాదు ఆ దంపతుల జీవితంలో ఎలాంటి కష్టం రాదని భావిస్తుంటారు. ఇక్కడ ప్రేమ జంటల ప్రత్యేకంగా వివాహం చేసుకోడానికి సుదూర ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి వస్తుంటారు. 

  శ్రీ సదనందాలయం, తెలంగాణ

  మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నేపల్లి సమీపంలోని శ్రీ సదనందాలయం వందలాది ప్రేమ వివాహాలకు వేదికగా నిలిచి ప్రేమాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏడడుగులు నడిచి దంపతులుగా మారిన జంటలు కలకాలం సుఖశాంతులతో వర్దిల్లుతాయనే సెంటిమెంట్ ఉంది. తెలంగాణాలోని పలు ప్రాంతాల నుండి ప్రేమికులు తరలివచ్చి ఈ ఆలయంలోనే మనువాడుతారు. గతంలో ఇక్కడే పెళ్లిచేసుకొని దంపతులుగా మారిన అలనాటి ప్రేమికులు కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజునాడు ఇక్కడికి వచ్చి ఉల్లాసంగా గడుపుతారు.

  ప్రపంచంలోని ప్రముఖ ప్రేమ ఆలయాలు (Love Temples In World)

  The Temple Of Love, Paris

  పారీస్‌లోని ఒక చిన్న ద్వీప ప్రాంతంలోని ఈ స్మారకం ప్రేమికులకు ఎంతో ప్రసిద్ధి చెందింది. దీనిని 1778లో నిర్మించారు. ఫ్రాన్స్‌ చివరి రాణి మ్యారీ ఆంటోయినిట్టే (Marie-Antoinette) ఆదేశాలతో ఈ స్టాట్యూ నిర్మితమైంది. తన భర్త లూయిస్‌ ఆగస్టే (Louis Auguste)పై ఉన్న ప్రేమకు గుర్తుగా దీన్ని నిర్మించింది.

  Trimurti Shrine, Bangkok

  బ్యాంకాక్‌లోని సెంట్రల్‌ వరల్డ్‌ షాపింగ్ మాల్ సమీపంలో ఇది టెంపుల్‌ ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కలయికతో ఉన్న విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. వాలైంటన్‌ డే రాత్రి పూట ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రేమ జంటలు ప్రార్థనలు చేస్తాయి.

  Kawagoe Hikawa Shrine, Tokyo

  జపాన్‌ రాజధాని టోక్యోకి వాయువ్య ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం.. 1500 ఏళ్ల నాటి పురాతనమైంది. వివాహిత జంటగా పరిగణింపబడే ఇద్దరు దేవతలను ఇక్కడ పూజిస్తారు. పెద్ద ఎత్తున ప్రేమ జంటలు ఈ ఆలయంలో ప్రార్థనలు నిర్వహిస్తారు. పెళ్లైన వారు సంతానోత్పత్తి కోసం ఇక్కడ పూజలు చేస్తారు. 

  Longshan Temple, Taipei

  తైవాన్‌లోని చారిత్రక ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయం బౌద్దం, తావోయిస్టు, కన్ఫ్యూషియనిస్ట్ మతాలకు చెందిన వారి విశ్వాసాలను ప్రతిబింబిస్తుంది. 1738లో దీన్ని నిర్మించారు. ఇక్కడ ఆ మూడు మతాలకు చెందిన 100 కంటే ఎక్కువ దేవత విగ్రహాలు ఉన్నాయి. పెళ్లి కాని జంటలు ఇక్కడకు వస్తే వెంటనే వారి వివాహం జరుగుతుందని ఇక్కడి వారి నమ్మకం.

  Xiahai City God Temple, Taipei

  తైపీ నగరంలోనే ఈ లవ్‌ టెంపుల్‌ కూడా ఉంది. దీన్ని 1859లో నిర్మించారు. ఇక్కడ ఏటా 6000 పైగా ప్రేమ పెళ్లిళ్లు జరుగుతాయి. వాలెంటైన్స్‌ డే, చైనీస్‌ వాలెంటైన్స్‌ డే వేడుకలను ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో వేలాది సంఖ్యలో జంటలు పాల్గొని ప్రార్థనలు చేస్తాయని నిర్వాహకులు తెలిపారు. 

  Yueh Hai Ching Temple, Singapore

  సింగపూర్‌ పురాతన ఆలయాల్లో ఇది ఒకటి. చైనా నుంచి వచ్చిన వలసదారులు 1826లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని విగ్రహం చుట్టూ ఎర్రటి తీగను కడితే వారికి వెంటనే వివాహం జరుగుతుందని చాలా మంది నమ్మకం. అందుకే ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో ప్రేమికులు వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv