అదృష్టం కలిసిరాకపోతుందా అని ఎదురుచూసే వాళ్లు ఎంతో మంది ఉంటారు. ఒక్క క్షణం అది మన సొంతమైతే జీవితం మారిపోతుందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సరిగ్గా అలాంటి రోజే యూఏఈలో నివసిస్తున్న హైదరాబాదీకి వచ్చింది. అదృష్టం ఆమెను పడిశం పట్టినట్లే పట్టింది. ప్రతీ వారం తీసే లక్కీ డ్రాలో ఏకంగా రూ. 2 కోట్లకు పైగా గెలుచుకుంది ఆ మహిళ.
లక్కీ ఛాన్స్
హైదరాబాద్‌కు చెందిన హమీదా బేగం అబుదాబీలో మూడేళ్లుగా నివసిస్తోంది. మెడికల్ కోడర్‌గా పనిచేస్తోంది. అక్కడ ప్రతీ వారం మహ్‌జూజ్ లక్కీ డ్రా నిర్వహిస్తారు. ఇందులో ఆమె పాల్గొన్నారు. ఏప్రిల్ 1న తీసిన లక్కీ డ్రాలో ఆరు నంబర్లకు 5 సరిపోలాయి. దీంతో హమీదాకు 1 మిలియన్ దిర్హామ్స్‌ను అందించారు. భారత కరెన్సీలో దీని అక్షరాల రూ. 2,22,28,303.
ఆనందం పట్టలేక
రూ. 2 కోట్లకు పైగా గెలుచుకోవటంతో హమీదా సంతోషానికి అవధుల్లేకుండా పోాయాయి. వీటిని కుటుంబ సంరక్షణ కోసం వినియోగిస్తానని ఆమె తెలిపారు. ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నారు. డబ్బును వారి విద్యతో పాటు భవిష్యత్ కోసం ఉపయోగిస్తానన్నారు. ఈ ప్రైజ్‌మనీలో మార్పులు చేసిన తర్వాత గెలుచుకున్న మెుదటి మహిళ, నాలుగో వ్యక్తి హమీదా.
మహ్‌జూజ్ ఏంటీ
మహ్‌జూజ్ లక్రీ డ్రాను ప్రతి వారం తీస్తారు. దీంట్లో పాల్గొన్న వారికి నగదు, బంగారం గెలుచుకునే అవకాశం ఉంది. ఇలా ప్రతిసారి ఒక్కొక్కరూ మిలియనీర్ అవ్వొచ్చంటూ మహ్‌జూజ్ ప్రకటించింది. మహ్‌జూజ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మెుదట రిజిస్టర్ కావాలి. తర్వాత 1 నుంచి 49 నంబర్లలో ఐదింటిని ఎంచుకోవాలి. లక్కీ డ్రా తీసేటప్పుడు ఆ నంబర్లు మ్యాచ్ అయిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!