• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Masthu Shades Unnai Ra Review: హీరోగానూ మేజిక్‌ చేసిన అభినవ్‌.. ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’ హిట్టా? ఫట్టా?

  నటీనటులు: అభినవ్‌ గోమటం, వైశాలి, రాజ్‌ మెుయిన్‌, అలీ రెజా

  దర్శకత్వం: తిరుపతి రావు

  సంగీతం: సంజీవ్‌ థామస్‌

  సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ స్వయంభూ

  నిర్మాత: ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్‌.వి, భవాని కాసుల

  విడుదల తేదీ: 23-02-2023

  హాస్యనటుడు అభినవ్‌ గోమఠం లీడ్‌ రోల్‌లో చేసిన చిత్రం ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’ (Masthu Shades Unnay Ra). తిరుపతి రావు ఇండ్ల దర్శకుడు. అలీ రెజా, వైశాలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని భవాని కాసుల, ఆరెమ్‌ రెడ్డి, ప్రశాంత్‌.వి సంయుక్తంగా నిర్మించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఇవాళ (ఫిబ్రవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథానాయకుడిగా అభినవ్‌ గోమటం మెప్పించాడా? లేదా? ఇప్పుడు చూద్దాం. 

  కథ

  మనోహర్ (అభినవ్‌ గోమఠం) (Masthu Shades Unnai Ra Review In Telugu) ఓ సాధారణ పెయింటర్. లైఫ్‌లో సెటిల్ కాలేదన్న కారణంతో అతడ్ని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి పీటలపై నుండి లేచిపోతుంది. దీంతో మనోహర్ ఫోటోషాప్ నేర్చుకుని ఫ్లెక్స్ డిజైనింగ్ యూనిట్ సొంతంగా పెట్టుకోవాలని అనుకుంటాడు. ఈ ప్రయాణంలో అతనికి ఉమాదేవి (వైశాలి రాజ్) పరిచయం అవుతుంది. చేతిలో రూపాయి లేని మనోహర్‌ ఈ ప్రయాణంలో ఎలా విజయం సాధించాడు? అతనికి రాహుల్ (అలీ రెజా) నుండి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని మనోహర్ ఎలా దాటగలిగాడు? అన్నది కథ.

  ఎవరెలా చేశారంటే

  ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో మంచి కమెడియన్‌గా గుర్తింపు పొందిన అభినవ్‌ గోమఠం.. ఈ సినిమాలో కథానాయకుడిగానూ తన మార్క్ ఏంటో చూపించాడు. న్యాచురల్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు. కామెడీ టైమింగ్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలను చక్కగా పలికించి సంపూర్ణ నటుడిగా నిరూపించుకున్నాడు. ఇక హీరోయిన్ వైశాలి రాజ్ పర్వాలేదు. ఆమెది నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర కాదు. ఇక బిగ్‌బాస్‌ ఫేమ్‌ అలీ రెజా తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు తమ పాత్ర పరిధిమేరకు నటించి మెప్పించారు. 

  డైరెక్షన్ ఎలా ఉందంటే

  దర్శకుడు తిరుపతి రావు మంచి కథను ఎంచుకున్నారని చెప్పవచ్చు. స్టోరీపై బాగా హోమ్‌వర్క్‌ చేయడం ప్లస్ అయ్యింది. అయితే స్క్రీన్‌ ప్లే విషయంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. కథకు సంబంధం లేని సీన్లతో తొలి భాగాన్ని చాలా వరకూ నడిపించాడు. స్టోరీలోని మెయిన్‌ పాయింట్‌లోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నారు. అయితే ఓ మంచి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్లాక్ రావడంతో నెక్స్ట్‌ ఏంటి అన్న ఆసక్తి ఆడియన్స్‌లో కలిగించాడు డైరెక్టర్‌. సెకండాఫ్‌ నుంచి అసలు కథ మెుదలవుతుంది. తొలి పార్ట్‌తో పోలిస్తే చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది. కథలోని మెయిన్ సీక్వెన్స్‌లను దర్శకుడు చాలా బాగా మేనేజ్‌ చేశారు. మంచి ఫన్‌ కూడా జనరేట్ అయ్యింది. సెకండ్‌ పార్ట్‌ ఇంట్రెస్టింగ్‌గా సాగడంతో సినిమా కొంతమేర గట్టెక్కగల్గింది. 

  టెక్నికల్‌గా..

  టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే (Masthu Shades Unnai Ra Review In Telugu)… ఈ విభాగం పనితీరు చాలా పూర్‌గా ఉంది. సంజీవ్‌ థామస్‌.. సంగీతం ఏమాత్రం ఆకట్టుకోదు. సిద్ధార్థ స్వయంభూ కెమెరా పనితనం కూడా నామ మాత్రంగానే అనిపిస్తుంది. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు ఇంకొంచెం బెటర్‌గా ఉంటే మంచి ఔట్‌పుట్‌ వచ్చేది. 

  ప్లస్ పాయింట్స్‌

  • అభినవ్‌ నటన
  • కామెడీ
  • ద్వితియార్థం

  మైనస్‌ పాయింట్స్

  • తొలి భాగం
  • అవసరం లేని సీన్లు
  • టెక్నికల్ విభాగం

  Telugu.yousay.tv Rating : 2.5/5

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv