మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మల్లిడి వశిష్ట(Mallidi Vasishta) కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘విశ్వంభర’. ఇందులో చిరు సరసన ప్రముఖ నటి త్రిష నటిస్తోంది. 2025 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం మెగా అభిమానులతో పాటు చిరంజీవి కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గత చిత్రం ‘భోళా శంకర్’ డిజాస్టర్ నుంచి ఈ మూవీ సక్సెస్‌తో బయటపడాలని చిరు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. దీంతో ఆ రోజున ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని విశ్వంభర టీమ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సన్నాహాలు కూడా మెుదలు పెట్టినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
గ్రాండ్ ట్రీట్ లోడింగ్..!
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డేను మెగా అభిమానులు ఏ స్థాయిలో సెలబ్రేట్ చేసుకుంటారో అందరికీ తెలిసిందే. ప్లెక్సీలు కట్టించి కేక్ కటింగ్స్ చేయడంతో పాటు అన్నదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలతో హంగామా చేస్తారు. చిరు గొప్పతనం గురించి గుర్తుచేసుకుంటారు. ఆ రోజున ఫుల్ జోష్‌లో ఉండే మెగా అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ‘విశ్వంభర’ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఓ స్పెషల్ గ్లింప్స్‌ను చిరు బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వర్క్ కూడా మెుదలైపోయినట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్/టీజర్ తాలుకూ ఫైనల్ వర్క్ జరుగుతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ‘ఇంద్ర’ మూవీ 4K వెర్షన్ రీరిలీజ్ సందర్భంగా థియేటర్లలో ఈ గ్లింప్స్‌ను ప్రసారం చేయాలని విశ్వంభర టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే చిరు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.
‘ఇంద్ర’ రీ-రిలీజ్ రికార్డులు
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేను ఈసారి మరింత స్పెషల్ కాబోతోంది. చిరు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇంద్ర’ను ఆగస్టు 22న రీరిలీజ్ చేయబోతున్నారు. 4K వెర్షన్లో రానున్న ఈ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్‌ను శనివారం (ఆగస్టు 17) ప్రారంభించారు. అయితే రిలీజ్ చేసిన అన్ని టికెట్లు నిమిషాల వ్యవధిలో అమ్ముడుపోయినట్లు థియేటర్ వర్గాలు ప్రకటించాయి. అదనపు షోలను సైతం ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాయి. అయితే ఇంద్ర రిలీజై ఇప్పటికీ 22 ఏళ్లు గడిచిపోయాయి. ఇంతకాలం తర్వాత ఈ సూపర్ హిట్ చిత్రం మళ్లీ థియేటర్లలోకి వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది. అయితే ‘ఇంద్ర’తో పాటు మరో బ్లాక్బాస్టర్ చిత్రం ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ను సైతం రీరిలీజ్ చేయబోతున్నారు.
విశ్వంభరలో సిస్టర్ సెంటిమెంట్!
విశ్వంభర సినిమాలో అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ కూడా ఉంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై యువ నటి రమ్య పసుపులేటి క్లారిటీ ఇచ్చింది. ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్యూలో ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. ‘చిరంజీవి గారి పక్కన సిస్టర్‌గా విశ్వంభర సినిమాలో చేస్తున్నాను. ఆయనతో చాలా సేపు స్క్రీన్ లో కనిపిస్తాను. ఆయనతో ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు. నాకు చాలా సపోర్టింగ్ రోల్స్ వచ్చాయి. కానీ హీరోయిన్గా చేద్దామనే అవేవి చేయలేదు. ఇపుడు ఓన్లీ చిరంజీవి పక్కన ఛాన్స్ అని మాత్రమే చెల్లి పాత్రకు ఒప్పుకున్నాను. నాతో పాటు వేరే హీరోయిన్స్ కూడా చిరంజీవి పక్కన చెల్లెళ్లుగా చేస్తునారు’ అని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్‌గా మారాయి.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?