మెగాస్టార్ చిరంజీవి ఉదయం స్పెషల్ స్క్రీనింగ్‌లో RRR చూశారు. మూవీ చూసి బయటకొచ్చిన మెగాస్టార్ చాలా హ్యాపీగా కనిపించారు. సినిమాఎలా ఉందని మీడియా అడగ్గా.. అసలు మాటలు రావట్లేదు అని చెప్పాడు. ఇది ఒక ఎపిక్, క్లాసిక్ ఇలాంటి సినిమాలు మళ్లీ రావాలంటే కష్టం అన్నాడు. చరణ్, తారక్ మధ్య బాండింగ్ ఫెంటాస్టిక్ అని చెప్పాడు. మెగాస్టార్ కూతురు సుస్మిత కొణిదెల, సినిమా చూసి మా మనసు నిండిపోయింది… చరణ్, తారక్‌ను అలా చూస్తుంటే ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉందని పేర్కొంది.
ఆ తర్వాత ట్విట్టర్ ద్వారా మళ్లీ స్పందించిన మెగాస్టార్ ఆర్ఆర్ఆర్ ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ మాస్టర్ పీస్ అని ట్వీట్ చేశాడు. రాజమౌళి విజన్‌కు నిదర్శనం ఈ చిత్రం అని చెప్పాడు. మూవీ టీమ్‌కు హ్యాట్సాఫ్ అని పేర్కొన్నాడు. దీంతో మెగాస్టార్ ఈ సినిమా విషయంలో ఎంత సంతోషంగా ఉన్నారో అర్థమవుతుంది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్