బ్రిటన్‌కు చెందిన ప్రముఖ యువనటి మిల్లీ బాబీ బ్రౌన్ 19 ఏళ్ల వయసులో తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. జాక్ బొంగియోవితో తనకు మంగళవారం నిశ్చితార్థం కూడా జరిగినట్లు మిల్లీనే స్వయంగా ప్రకటించింది. మూడేళ్లుగా తాము ప్రేమలో ఉన్నామని పెళ్లి ద్వారా ఒకటి కాబోతున్నామని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో రొమాంటిక్ పిక్చర్‌ను షేర్ చేసింది. అయితే జాక్, మిల్లీ మధ్య ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇప్పుడు అదే ఇన్స్టాగ్రామ్ ద్వారా తమ పెళ్లి ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది.
మిల్లీ బాబీ బ్రౌన్… నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీసెస్‌లో నటించి చాలా ఫేమస్ అయింది. స్టేంజర్ థింగ్స్ సిరీస్‌ల ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఆమె నటనకు గాను యాక్టర్స్ గిల్డ్ అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత గాడ్జిల్లా, ఎనోలా హోమ్స్, గాడ్జిల్లా Vs కాంగ్, ఎనోలా హోమ్స్-2 వంటి చిత్రాల ద్వారా సినీ ప్రేక్షకులకు దగ్గరైంది. సినిమాలు వెబ్‌సిరీస్‌లో నటిస్తూనే పాటల ఆల్బమ్స్ చేస్తూ మిల్లీ వరల్డ్ ఫేమస్‌గా మారిపోయింది. ఈ తరం యువకుల కలల రాకుమారిగా కీర్తింప బడుతోంది. అటువంటి మిల్లీ వివాహ బందంలోకి అడుగు పెడుతుండంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. 19 ఏళ్లకే పెళ్లి ఏంటంటూ వ్యంగ్యంగా మీమ్స్ పెడుతున్నారు. మిల్లీ వయసులో తాము ఏం చేసేవారమో చెబుతూ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
19 వయసుకే మిల్లీ బాబీ బ్రౌన్ పెళ్లి చేసుకోబోతోంది. కానీ, 24 ఏళ్లు ఉన్న నేను ఏమీ సాధించకుండా ఉండిపోయానని అర్థం వచ్చేలా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు అనన్య పాండేకు సంబంధించిన వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.
19 ఏళ్ల మిల్లీ పెళ్లికి సిద్ధమైతే.. 23 ఏళ్ల తాను “Ee Sala cup namde” #RCB అని ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నానని ఓ నెటిజన్ పెట్టిన పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
19 ఏళ్ల వయసులో సమోసాలు తింటూ.. చట్నీ కోసం పోరాడేవాడినని ఓ నెటిజన్ పెట్టిన పోస్టు నవ్వులు పూయిస్తోంది.
మిల్లీ బాబీ బ్రౌన్ కేవలం 19 ఏళ్లేనా అని ఆశ్యర్యపోతూ… సినిమా/వెబ్‌సిరీస్‌లో ఆమె చేసిన పాత్రలను ఓ నెటిజన్ పోస్టు చేశాడు.
19 ఏళ్లకే మిల్లీ పెళ్లి పీటలు ఎక్కబోతుంటే తాను మాత్రం సోల్‌మేట్ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నానని ఫీల్ అవుతూ నెటిజన్స్ పెట్టిన పోస్టులు తెగ ట్రెండింగ్ అవుతోంది.
మిల్లీ బాబీ బ్రౌన్కు 19 ఏళ్లు వచ్చేశాయా. చివరిసారిగా తనను ఓ చిన్నపిల్లగా చూసినట్లు గుర్తుందే అంటూ ఓ నెటిజన్ మిల్లీ చిన్నప్పటి ఫోటోను షేర్ చేశాడు.
19 ఏళ్ల మిల్లీ తెలివైనది, సక్సెస్ఫుల్, టాలెంటెడ్, ధనవంతురాలు, అందమైనది కూడా.. 20 ఏళ్ల నేను మాత్రం కాలేజీకి వెళ్లడానికి నిద్ర కూడా లేవలేకపోతున్నా అంటూ ఓ నెటిజన్ పెట్టిన వీడియో నవ్వులు పూయిస్తోంది.
19 ఏళ్లకే మిల్లీ ఎంగేజ్మెంట్ చేసుకుంటే.. 24 ఏళ్ల తాను బెడ్‌పై కూర్చొని బనాన చిప్స్ తింటూ మిల్ #She is 19 ట్రెండ్ చూస్తున్నట్లు రియా చోప్రా అనే యువతి పోస్టు పెట్టింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!