యంగ్ బ్యూటీ మిర్నా మీనన్.. మరోమారు తన గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, పలుచటి బ్లాక్ కలర్ శారీలో అందాలు ఆరబోసింది.
శారీలో ఈ బ్యూటీ పరువాలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఆమెదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా ఈ భామ నటించిన జైలర్ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో రజనీకాంత్ కోడలిగా మిర్నా మీనన్ కనిపించింది. తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.
అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ‘ఉగ్రం’లో ‘మిర్నా మీనన్’ హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
తమిళ చిత్రం ‘సంతానథెవన్’ చిత్రంతో మిర్నా మీనన్ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే చిన్న సినిమా కావడంతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.
తన తర్వాతి చిత్రంలో ఏకంగా మోహన్ లాల్ పక్కనే నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. బిగ్ బ్రదర్ చిత్రంలో ఆర్య శెట్టి పాత్రలో మిర్నా మెరిసింది
ఆది సాయికుమార్ హీరోగా గతేడాది వచ్చిన ‘క్రేజీ ఫెల్లో’ సినిమా ద్వారా మిర్నా మీనన్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. రెండో చిత్రం ఉగ్రం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
కింగ్ నాగార్జున అప్‌కమింగ్ మూవీ ‘నా సామీరంగ’లో మిర్నా మీనన్‌కు అవకాశం దక్కిందని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ ముద్దుగుమ్మకు ఇక్కడ వరుస ఆఫర్లు క్యూ కట్టడం ఖాయం కావచ్చు.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ భామ చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన గ్రామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ అలరిస్తోంది.
ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు అభిమానుల తాకిడి బాగా పెరిగింది. ప్రస్తుతం మిర్నా మీనన్‌ను 1.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు