• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Miss Perfect Web Series Review: ఓసీడీతో లావణ్యకి ఎన్ని సమస్యలో.. సిరీస్‌ ఎలా ఉందంటే?

    నటీనటులు: లావణ్య త్రిపాఠి, అభిజిత్‌, కేశవ్‌ దీపక్‌, ఝాన్సీ, హర్షవర్ధన్‌, అభిజ్ఞ, రోషన్‌, సతీష్‌ సరిపల్లి, మహేష్‌ విట్టా తదితరులు

    డైరెక్టర్‌: విశ్వక్ ఖండేరా

    సినిమాటోగ్రాఫర్‌ : అదిత్య జవ్వాది

    సంగీతం : ప్రశాంత్‌ ఆర్. విహారి

    స్ట్రీమింగ్‌ భాషలు : తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, బెంగాలి, కన్నడ, మరాఠీ

    ఓటీటీ వేదిక: డిస్నీ + హాట్‌స్టార్‌

    విడుదల తేదీ:  02 ఫిబ్రవరి, 2024

    లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’ (Miss Perfect Web Series Review in Telugu). ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్, ‘బిగ్ బాస్ 4’ విన్నర్ అభిజీత్ (Abhijith) ఆమెకు జంటగా నటించాడు. అభిజ్ఞ, హర్షవర్ధన్, ఝాన్సీ, మహేష్ విట్టా, సునైనా ఇతర ప్రధాన తారాగణంగా ఉన్నారు. ‘స్కై ల్యాబ్’ (Sky Lab) ఫేమ్ విశ్వక్ ఖండేరావు ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించగా నేటి నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney + Hotstar) వేదికగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సిరీస్‌ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఇప్పుడు చూద్దాం.

    కథ

    లావణ్య రావు (లావణ్య త్రిపాఠి) శుచి – శుభ్రతలకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి అమ్మాయి. ఓసీడీ ఉండటం వల్ల పరిసరాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని భావిస్తుంటుంది. ప్రమోషన్‌లో భాగంగా లావణ్య హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అవుతుంది. రోహిత్ (అభిజీత్) ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌లో అద్దెకు దిగుతుంది. వీరిద్దరి ఫ్లాట్‌లో జ్యోతి (అభిజ్ఞ) వంట చేస్తుంటుంది. ఓ కారణం చేత లావణ్య.. రోహిత్ ఫ్లాట్‌కు వెళ్తుంది. ఆమెను జ్యోతి పంపిన పనిమనిషి అని రోహిత్‌ భ్రమపడటంతో కథ మలుపు తిరుగుతుంది. మరి లావణ్య రోజూ రోహిత్‌ ఫ్లాటుకు ఎందుకు వెళ్లింది? రోహిత్‌ ఆమెను ఎందుకు ఇష్టపడ్డాడు? ఆ విషయాన్ని ఆమెకు చెప్పాడా లేదా? చివరికి ఏమైంది? అన్నది స్టోరీ.

    ఎవరెలా చేశారంటే

    మిస్‌ పర్ఫెక్ట్‌గా (Miss Perfect) లావణ్య త్రిపాఠి అద్భుతంగా నటించింది. అపరిశుభ్రతను భరించలేని పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. బిగ్‌బాస్‌ ఫేమ్‌ అభిజీత్‌ కూడా చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకులకు కనిపించాడు. ఫ్రెష్‌ లుక్‌లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అభిజిత్‌ – లావణ్య జోడీ చూడటానికి చాలా బాగుంది. ఇద్దరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక హర్షవర్ధన్‌, ఝూన్సీ క్యారెక్టర్లు పరిమితంగా ఉన్నాయి. మహేష్‌ విట్టాతో పాటు మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    తెలుగు ప్రేక్షకులకు ఓసీడీ కథ కొత్త కాదు. ‘మహానుభావుడు’ చిత్రం ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిందే. అయితే మహిళకు ఓసీడీ ఉంటే ఎలా ఉంటుందన్న లైన్‌ను దర్శకుడు విశ్వక్‌ ఖండేరావు తీసుకోవడం ఆసక్తికరం. అందుకు అనుగుణంగానే లావణ్య క్యారెక్టర్‌ను బాగా డిజైన్‌ చేశారు. అయితే ఆ పాత్రకు తగ్గ సన్నివేశాలను రాసుకోవడంలో ఆయన విఫలమయ్యారు. ఆమెకున్న ఓసీడీని క్యాష్‌ చేసుకొని కామెడీని పండించడంలో ఆయన విఫలమయ్యారు. కథ – కథనాల్లో, కామెడీలో, నెక్స్ట్ ఏంటి అన్న క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలోనూ డైరెక్టర్‌ తడబడ్డారు. రైటింగ్‌ ఫెయిల్యూర్‌ వల్ల భావోద్వేగాలు కూడా పెద్దగా పండలేదు. 

    సాంకేతికంగా

    టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. క్రెడిట్ అంతా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్. విహారికే దక్కుతుంది. సిరీస్ అని లైట్ తీసుకోకుండా మంచి మెలోడీ పాటలు కంపోజ్ చేశారు. నేపథ్య సంగీతం కూడా బావుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • లావణ్య, అభిజిత్ నటన
    • సంగీతం
    • సినిమాటోగ్రఫి

    మైనస్‌ పాయింట్స్‌

    • కథ, కథనం
    • సాగదీత సీన్లు
    • పండని భావోద్వేగాలు

    రేటింగ్‌: 2.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv