ఈ ఏడాది ‘మిస్ యూనివర్స్ ఇండియా – 2024’ కిరీటాన్ని రియా సింఘా (Rhea Singha) సొంతం చేసుకుంది. జైపుర్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు.
ఈ పోటీల్లో 51 మంది ఫైనలిస్టులతో పోటీ పడి ఆమె ఈ కిరీటాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.
2015లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న ఊర్వశీ రౌతేలా ఈ ఈవెంట్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో విజేతగా నిలవడం ఆనందంగా ఉందని రియా అన్నారు. ‘ఈ రోజు నేను టైటిల్ గెలుచుకోవడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ పోటీలో పాల్గొనడం కోసం ఎంతో కష్టపడ్డా. గతంలో ఈ పోటీల్లో గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకున్నా’ అని అన్నారు.
ప్రస్తుతం రియా సింఘా పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఆమె గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు.
రియా సింఘా వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె వయసు ప్రస్తుతం 19 సంవత్సరాలు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు.
ఈస్టోర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ అండ్ వ్యవస్థాపకుడు బ్రిజేష్ సింఘా, రీటా సింఘా దంపతులకు రియా జన్మించారు.
ప్రస్తుతం ఆమె గుజరాత్ లా సొసైటీ యూనివర్సిటీ (GLS (Gujarat Law Society) University)లో చదువుతున్నారు. అక్కడ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసిస్తున్నారు.
రియా తన మోడలింగ్ కెరీర్‌ను 16 సంవత్సరాల వయస్సులో 2020లో ప్రారంభించారు. ఆ ఏడాది ‘దివాస్ మిస్ టీన్ గుజరాత్’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
2023 ఫిబ్రవరి 28న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగిన ‘మిస్ టీన్ యూనివర్స్ 2023’ (Miss Teen Universe 2023)లో రియా భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు.
మిస్ టీన్ యూనివర్స్ పోటీల్లో మెుత్తం 25 మంది అభ్యర్థులతో ఆమె తలపడి మంచి ప్రదర్శన చేశారు. తద్వారా ‘టాప్ 6’లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు.
2023 ఏప్రిల్ 19న ముంబైలో జరిగిన జాయ్ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ సీజన్ 14లో రియా సింఘా పాల్గొన్నారు.
ఆ పోటీల్లో మెుత్తం 19 మందితో అద్భుతంగా తలపడ్డారు. అయితే కొద్దిలో టైటిల్‌ను చేజార్చుకొని రియా రన్నరప్‌గా నిలిచింది.
తాజాగా 2024 సెప్టెంబర్ 22న మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుని యావత్ దేశం దృష్టిని రియా ఆకర్షించారు.
ఈ ఏడాది చివర్లో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ 2024 పోటీలో రియా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. అక్కడ టైటిల్ గెలిస్తే విశ్వ సుందరిగా రియా మారనుంది.
మోడల్‌గానే కాకుండా సోషల్ మీడియాలోనూ ఎంతో చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది.
హీరోయిన్ను తలపిస్తున్న రియా అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పక్కా హీరోయిన్ మెటిరియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మిస్ యూనివర్స్ ఇండియా – 2024 టైటిల్ గెలవడంతో ఆమెకు హీరోయిన్గా కావాల్సినంత పాపులారిటీ వచ్చేసిందని అంటున్నారు.
ఈ ఏడాది చివర్లో జరిగే మిస్ యూనివర్స్ టైటిల్ కూడా గెలిస్తే బాలీవుడ్లో ఆమెకు అవకాశాలు రావడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!