• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Miss You Review: మిస్‌ ఫైర్‌ అయిన సిద్ధార్థ్‌ ఎమోషనల్‌ డ్రామా.. మరో ఫ్లాప్‌ ఖాతాలో పడినట్లే!

    నటీనటులు : సిద్ధార్థ్‌, ఆషికా రంగనాథ్‌, కరుణాకరన్‌, బాల శరవణన్‌ తదితరలు

    డైరెక్టర్‌ : ఎన్‌. రాజశేఖర్‌

    సంగీతం: జిబ్రాన్‌

    సినిమాటోగ్రఫీ: కె.జి. వెంకటేష్‌

    ఎడిటర్‌: దినేష్‌ పోనరాజ్‌

    నిర్మాత : శామ్యూల్‌ మాథ్యూ

    విడుదల తేదీ:  డిసెంబర్‌ 13, 2024

    ప్రముఖ నటుడు సిద్ధార్థ్ (siddharth), కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘మిస్‌ యు’ (Miss You Movie Review In Telugu). యు.ఎన్‌.రాజశేఖర్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని 7 మైల్స్‌ పర్‌ సెకండ్‌ సంస్థ నిర్మించింది. ఒక యునిక్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు తమ చిత్రం తప్పక నచ్చుతుందని ప్రమోషన్స్‌ సందర్భంగా ఊదరగొట్టింది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 13న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందిపడుతున్న సిద్ధార్థ్‌కు సక్సెస్ అందించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం. 

    కథేంటి

    వాసు (సిద్ధార్థ్‌) డైరెక్టర్‌ కావాలని కలలు కంటాడు. ఈ ప్రయత్నాల్లో ఉండగా అనుకోకుండా అతడికి యాక్సిడెంట్‌ జరుగుతుంది. దీంతో రెండు సంవత్సరాల గతాన్ని మర్చిపోతాడు. ఈ క్రమంలో ఓ రోజు బాబీ (కరుణాకరన్‌)తో అయి పరిచయం అతడి జీవితంలో అనుకోని పరిణామాలను తీసుకొస్తుంది. అతడితో కలిసి బెంగళూరుకు వెళ్లిన వాసుకి అక్కడ సుబ్బలక్ష్మీ (ఆషికా రంగనాథ్‌) పరిచయమవుతుంది. తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. వెంటనే ఈ విషయాన్ని ఆమెకు చెప్తాడు. అయితే సుబ్బలక్ష్మీ రిజెక్ట్‌ చేస్తుంది. అయితే సుబ్బలక్ష్మీ అలా ఎందుకు చేసింది? వాసుతో సుబ్బలక్ష్మీకి ముందే పరిచయం ఉందా? మంత్రితో ఆమెకున్న ఉన్న వైరం ఏంటి? వాసు మర్చిపోయిన రెండేళ్లలో ఏం జరిగింది? అన్నది స్టోరీ. 

    ఎవరెలా చేశారంటే

    వాసు పాత్రలో నటుడు సిద్ధార్థ్ (Miss You Review) మరోమారు సెటిల్డ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. బాగా కలిసొచ్చిన లవర్ బాయ్‌ పాత్రలో అలరించాడు. వాసు పాత్రకు అతడు పూర్తిగా న్యాయం చేశాడని చెపొచ్చు. ఇక హీరోయిన్‌ సుబ్బలక్ష్మీ పాత్రలో ఆషికా రంగనాథ్‌ (Miss You Movie Review In Telugu) అదరగొట్టింది. క్యారెక్టరైజేషన్‌ పరంగా చూస్తే సిద్ధార్థ్‌ కన్నా ఆమె రోల్‌ బాగా హైలెట్‌ అయ్యింది. కరుణాకర్ కామెడీ పంచ్‌లు బాగానే పేలాయి. మిగతా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఓ మోస్తరుగా అలరించారు. జయప్రకాశ్, శరత్ లోహితస్వ నటన బాగుంది. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    దర్శకుడు ఎన్.రాజశేఖర్ రాసుకున్న కథ బాగున్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో పూర్తిగా తడబడ్డాడు. వాసు పాత్రను డిజైన్ చేసిన తీరు సైతం ఏమాత్రం ఆకట్టుకోదు. సినిమాను ప్రారంభించిన విధానం బాగున్నప్పటికీ కథ సాగుతున్న కొద్ది క్యూరియాసిటీగా అనిపించదు. యాక్సిడెంట్‌ తర్వాత ఆడియన్స్‌లో ఆసక్తి పెంచినప్పటికీ ఆపై వచ్చే రెగ్యులర్‌ సీన్స్‌తో కథను సాదాసీదాగ మార్చేశారు. హీరో పరిచయం, యాక్సిడెంట్‌ తర్వాత వచ్చే సీన్స్, కరుణాకరణ్‌ కామెడీతో ఫస్టాఫ్‌ పర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్‌ మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు డైరెక్టర్‌. సినిమాకు ఎంతో కీలకమైన ఎమోషనల్ డ్రామాను సరిగ్గా పండించలేకపోయారు.  క్లైమాక్స్ మినహా మిగతా ఎమోషనల్‌ సీన్స్‌ అన్ని సాగదీసిన ఫీలింగ్‌ను కలిగిస్తాయి. 

    సాంకేతికంగా..

    టెక్నికల్‌ అంశాలకు వస్తే (Miss You Movie Review In Telugu) జిబ్రాన్‌ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. పాటలు మాత్రం పెద్దగా కనెక్ట్‌ కావు. వెంకటేష్ సినిమాటోగ్రఫీ వర్క్ డిసెంట్‌గా అనిపిస్తుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • ప్రధాన తారాగణం నటన
    • కామెడీ సీన్స్‌
    • నేపథ్య సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • ఆసక్తిలేని కథనం
    • కనెక్ట్‌ కానీ ఎమోషన్‌ డ్రామా
    • రొటీన్‌ సన్నివేశాలు
    Telugu.yousay.tv Rating : 2/5 
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv