అమ్మ గొప్పతనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బిడ్డ కోసం తల్లి తన జీవితాన్నే త్యజిస్తుంది. ఆదివారం (మే 14) మాతృదినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అమ్మ ప్రేమకు గుర్తుగా ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలని చాలా మంది భావిస్తుంటారు. కొన్ని ప్రత్యేక బహుమతుల కోసం తెగ వెతికేస్తుంటారు. చివరికీ ఏం ఇవ్వాలో అర్థంకాక కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అటువంటి వారి కోసమే YouSay ఈ బహుమతుల చిట్టాను తీసుకొచ్చింది. మదర్స్ డే రోజున ఎలాంటి గిప్ట్స్ ఇస్తే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం.
1. సెల్‌ఫోన్స్
ప్రస్తుత రోజుల్లో అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది. ఇంట్లో అవసరాలు తీర్చే అమ్మకు కూడా ఫోన్ అవసరం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం ద్వారా పిల్లలు దూరంగా ఉన్నారన్న ఫీలింగ్‌ను తల్లి మనసు నుంచి తీసేయచ్చు. ఒక్క ఫోన్ కాలం దూరంలోనే తాము ఉన్నామని భరోసా కల్పించొచ్చు. కాబట్టి ఈ మదర్స్ డే రోజున స్మార్ట్‌ఫోన్ మంచి గిఫ్ట్ అవుతోంది. మీ బడ్జెట్ రూ. 10వేల లోపు అయితే శామ్‌సంగ్ గ్యాలక్సీ M13 ఫోన్ మంచి చాయిస్.
2. స్మార్ట్ వాచ్
మీరు మదర్స్ డే రోజున అమ్మకోసం.. స్మార్ట్ వాచ్ లేదా ఫిట్‌నెస్ బ్యాండ్‌ని కూడా కొనుగోలు చేయవచ్చు. వీటిని ధరించడం ద్వారా రోజువారీ పనులు, నిద్ర విధానాలు, హృదయ స్పందన రేటు వంటివి ట్రాక్ చేసి సాయపడతాయి. ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తుంటాయి. మీ బడ్జెట్ రూ. 1500 అనుకుంటే boAt Xtend Smartwatch మంచి ఆప్షన్.
3. స్మార్ట్ టీవీ
ఇంట్లో ఉండే అమ్మకు టీవీనే కాలక్షేపం. వంట పనులతో అలిసిపోయే తల్లికి స్మార్ట్ టీవీ గిఫ్ట్‌గా ఇస్తే ఆమె ఎప్పటికీ మర్చిపోదు. టీవీని చూస్తున్న ప్రతీసారి మీరే గుర్తుకువస్తారు. మీ బడ్జెట్ రూ. 9,000 లోపు ఉంటే కింద లింక్‌లోని శామ్‌సంగ్ టీవీని ట్రై చేయోచ్చు.
4. ఏసీ / కూలర్
ఈ వేసవిలో ఎండలు మరింత మండిపోతున్నాయి. వేడి సెగల నుంచి మీ తల్లికి రక్షణ కల్పించాలని భావిస్తే ఏసీ / కూలర్ గిఫ్ట్‌గా ఇచ్చి వారిని సర్‌ప్రైజ్ చేయోచ్చు. ఏసీ / కూలర్ గిఫ్ట్ ఇవ్వడం ద్వారా వాటి నుంచి చల్లటి గాలి తగిలిన ప్రతీసారి మీ తల్లికి మీరే గుర్తుకు వస్తారు. మీ ఛాయిస్ ఏసీ అయ్యి, రూ. 25 వేల లోపు బడ్జెట్ అనుకుంటే టాటాకు చెందిన వోల్టాస్ ఏసీ ట్రై మంచి ఆప్షన్. అలా కాకుండా రూ. 6,000 లోపు కూలర్ మీ ఛాయిస్ అయితే బజాజ్ PX 97 మంచి ఎంపిక కావొచ్చు.
5. వాషింగ్ మిషన్
మీ తల్లికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వాలని భావిస్తే వాషింగ్ మిషన్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. వాషింగ్ మిషన్.. విడిచిన బట్టల నుంచి మీ తల్లికి విముక్తి కలిగిస్తాయి. ఈ వయసులో వారికి కాస్తంత విశ్రాంతిని ఇస్తాయి. మీ బడ్జెట్ రూ.15,000 లోపు అనుకుంటే కింద లింక్‌లో ఇవ్వబడిన ప్యానాసోనిక్‌కు స్మార్ట్ వాషింగ్ మిషన్ బెస్ట్ ఛాయిస్.
6. ఫోర్ బర్నార్ గ్యాస్ స్టౌవ్
సహజంగా తల్లులు వంటగదిలోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. కుటుంబ సభ్యులకు కావాల్సిన రుచికరమైన వంటకాలను తయారు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వారికి ఫోర్ బర్నార్ గ్యాస్ స్టౌవ్‌ను గిఫ్ట్‌గా ఇస్తే వారు సంతోషంగా ఫీలయ్యే ఛాన్స్ ఉంది. వంట గదికి వెళ్లిన ప్రతీసారి మీరిచ్చిన బహుమతి వారికి కనిపిస్తుంది. మీ బడ్జెట్ రూ. 3,500 అనుకుంటే మిల్టన్ కంపెనీకి చెందిన ఈ ఫోర్ బర్నార్ స్టౌవ్‌ను ట్రై చేయండి.
7. వైర్‌లెస్ ఇయర్ బడ్స్
వంట గదిలో ఎప్పుడు బిజీగా ఉండే తల్లులకు వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను కూడా గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఇయర్ బడ్స్ సహాయంతో ఆమె పని చేస్తున్నప్పుడు తనకు ఇష్టమైన పాటలను వినవచ్చు. అలాగే మనసుకు దగ్గరైన వ్యక్తులతో వంట చేసుకుంటూనే మాట్లాడేందుకు వీలు పడుతుంది. మీ బడ్జెట్ రూ. 1500 లోపు అయితే బోట్ కంపెనీకి చెందిన boAt Airdopes 141 ట్రై చేయోచ్చు.
8. ఇన్సులేటెడ్ లంచ్ బ్యాగ్
దూరం ప్రాంతాలకు వెళ్లే సమయంలో బయట ఫుడ్ తినాల్సి వస్తుంది. అలా కాకుండా ఇంటి నుంచి తీసుకెళ్తే ఆహారం త్వరగా చల్లగా అయిపోతాయి. ఈ నేపథ్యంలో మీ తల్లికి ఇన్సులేటెడ్ లంచ్ బ్యాగ్ గిఫ్ట్‌గా ఇవ్వండి. అది స్నాక్స్ / ఆహారాన్ని ఉష్ణోగ్రతలో ఉంచడంలో సహాయపడుతుంది.
9. పర్సనలైజ్డ్ వాటర్ బాటిల్
ఈ సమ్మర్‌లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మను హైడ్రేటెడ్‌గా ఉండేలా ప్రోత్సహించేందుకు పర్సనలైజ్డ్ వాటర్ బాటిల్ బహుమతిగా ఇవ్వొచ్చు. అది ఆమె సమయానుకూలంగా నీరు తాగేలా ప్రోత్సహిస్తుంది.
10. చర్మ సంరక్షణ ఉత్పత్తులు
వయసు పెరిగే కొద్ది తల్లులు చర్మ సమస్యల బారిన పడుతుంటారు. అటువంటి వారికి చర్మ సంరక్షణ బ్రాండ్‌లు బహుమతిగా ఇవ్వవచ్చు. ఆమెకు ఉపయోగపడే, సులభంగా వాడగలిగే సహజ సౌందర్య ఉత్పత్తులను ఓ అందమైన హాంపర్‌లో ప్యాక్ చేసి కానుకగా ఇవ్వండి. మదర్స్ డే నాడు మీ చర్మ సంరక్షణ హాంపర్‌తో ఆమె జీవితానికి అదనపు మెరుపును తీసుకురండి.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్