• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Motorola Edge 40 Review: మోటోరోలా నుంచి నయా 5G ఫోన్‌.. ఆకర్షిస్తున్న టాప్‌ ఫీచర్లు!

    స్మార్ట్‌ ఫోన్‌ ప్రియులకు ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ ‘మోటోరోలా’ శుభవార్త చెప్పింది. మోటోరోలా ఎడ్జ్‌ 40 (Motorola Edge 40) 5G ఫోన్‌ను మే 23న భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్ యూరప్, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో లాంచ్ అయింది. అక్కడ ఫోన్‌కు మంచి ఆదరణ లభించడంతో భారత్‌లోనూ మోటో ఎడ్జ్ 40పై అంచనాలు పెరిగిపోయాయి. గతంలో తీసుకొచ్చిన మోటోరోలా Edge 30కి సక్సెసర్‌గా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నయా ఫోన్ ప్రత్యేకలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

    ఫోన్‌ డిస్‌ప్లే

    మోటోరోలా ఎడ్జ్‌ 40 ఫోన్‌ను 6.55 అంగుళాల ఫుల్‌ HD+ డిస్‌ప్లేతో తీసుకొస్తున్నారు. ఇది 144Hz 3D కర్వ్డ్ పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ను 144Hz రిఫ్రెష్‌ రేట్‌తో రూపొందించారు. ఇది  MediaTek డైమెన్సిటీ 8020 SoC ద్వారా పనిచేస్తుంది.

    కెమెరా

    మోటోరోలా ఎడ్జ్‌ 40 ఫోన్‌ ప్రైమరీ కెమెరా 50 MPతో వస్తోంది. ఇది f/1.4 ఎపర్చరును కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)ని అందిస్తుంది. ఇక ఫ్రంట్‌ వైపు 13MP అల్ట్రా వైడ్‌ కెమెరాను ఫిక్స్ చేశారు. ఇది మాక్రో విజన్‌ కలిగి ఉంది. 

    స్టోరేజ్

    మోటోరోలా ఎడ్జ్‌ 40 ఫోన్‌ 8GB RAMతో పనిచేస్తుంది. అలాగే 256GB UFS 3.1 స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఎక్కువ స్టోరేజ్ సామర్థ్యం ఉండటంతో హై రిజల్యూషన్ ఫొటోలు, వీడియోలను ఎలాంటి ఆందోళన లేకుండా స్టోర్ చేసుకోవచ్చు. 

    ఫాస్ట్‌ ఛార్జింగ్‌

    ఈ ఫోన్‌ 4,400mAh బ్యాటరీతో రూపొందింది. 68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా ఈ ఫోన్‌ సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ను 10 నిమిషాల్లోనే ఛార్జ్‌ చేసుకోవచ్చని మోటోరోలా తన స్పెసిఫికేషన్స్‌లో పేర్కొంది.  

    కలర్స్

    మోటోరోలా ఎడ్జ్‌ 40 ఫోన్‌ మెుత్తం మూడు రంగుల్లో రానుంది. ఎక్లిప్స్ బ్లాక్, లూనార్ బ్లూ, నెబ్యులా గ్రీన్ అనే కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. నచ్చిన రంగులో ఫోన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

    ధర ఎంతంటే?

    మోటోరోలా ఎడ్జ్‌ 40 ఫోన్‌ విక్రయాలు మే 23 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతాయి. ఈ ఫోన్‌ ధర రూ.54,190 గా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మే 23న ఫోన్‌ ధరపై స్పష్టత రానుంది.  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv