• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Music Shop Murthy Review: లక్ష్యం కోసం 52 ఏళ్ల వ్యక్తి చేసే పోరాటం.. ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ ఎలా ఉందంటే ?

    నటీనటులు: అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు

    రచన, దర్శకత్వం: శివ పాలడుగు 

    సంగీతం: పవన్ 

    సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్‌ బెజుగం

    ఎడిటర్‌: బొంతల నాగేశ్వరరెడ్డి

    నిర్మాతలు: హర్ష గారపాటి & రంగారావు గారపాటి

    విడుదల తేది: జూన్‌ 14, 2024

    టాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ ఘోష్ (Ajay Ghosh), క్యూట్ హీరోయిన్ చాందిని చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మ్యూజిక్ షాప్ మూర్తి‘ (Music Shop Murthy Review). శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి గ్రాండ్‌గా నిర్మించారు. ఇప్పటికే విడుదలై ట్రైలర్, ప్రమోషన్‌ చిత్రాలు ఆడియన్స్‌ను ఆకర్షిస్తున్నాయి. జూన్ 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? నటుడిగా అజయ్‌ ఘోష్‌ను మరో మెట్టు పైకి ఎక్కించిందా? ఇప్పుడు చూద్దాం. 

    కథేంటి

    మూర్తి (అజయ్‌ ఘోష్‌).. 52 ఏళ్ల వయసులో మ్యూజిక్‌ షాప్‌ నడుపుతుంటాడు. లాభాలు లేకున్నా అదే పని చేస్తుంటాడు. అయితే మూర్తికి డీజే అవ్వాలన్న కోరిక ఉంటుంది. మరోవైపు అమెరికా నుంచి వచ్చిన అంజన (చాందిని చౌదరి) కూడా డీజే కావాలని కలలు కంటుంది. అందులో శిక్షణ కూడా తీసుకుంటుంది. ఓ కారణం చేత మూర్తిని కలిసిన అంజన.. డీజే కావాలన్న అతడి ఆసక్తిని గమనించి నేర్పించేందుకు ఒప్పుకుంటుంది. అలా ఆమె వద్ద డీజే నేర్చుకొని హైదరాబాద్‌కు వచ్చిన మూర్తి.. ఎలాంటి కష్టాలు పడ్డాడు? అంజన తండ్రి.. మూర్తిపై ఎందుకు కేసు పెట్టాడు? ఫేమస్‌ డీజే డెవిల్‌ (అమిత్‌ శర్మ) మూర్తిని ఎలా అవమానించాడు? ఇంతకీ మూర్తి డీజేగా సక్సెస్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ.

    ఎవరెలా చేశారంటే

    క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అజయ్‌ ఘోష్‌.. మూర్తి పాత్రలో మరోమారు అదరగొట్టారు. మధ్యతరగతి వ్యక్తి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి నటించారు. ఓ పక్క తనదైన కామెడీతో నవ్విస్తూనే.. ఎమోషనల్‌ సీన్స్‌లో ఏడిపించారు. ఇక అంజన పాత్రకు హీరోయిన్‌ చాందిని పూర్తిగా న్యాయం చేసింది. మూర్తికి డీజే నేర్పించే క్రమంలో ఆమె చెప్పే డైలాగ్స్‌ ఆలోచింపజేస్తాయి. మూర్తి భార్యగా ఆమని చక్కటి నటన కనబరిచింది. అమిత్‌ శర్మ, భానుచందర్‌, దయానంద్‌ రెడ్డి, పటాస్‌ నాని తదితరులు తమ పాత్ర పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    దర్శకుడు శివ పాలడుగు.. మూర్తి పాత్రకు అజయ్‌ ఘోష్‌ను ఎంచుకోవడం ద్వారానే సగం విజయం సాధించేశారు. కథలో పెద్దగా మెరుపులు లేనప్పటికీ ఎమోషనల్‌గా సినిమాను నడిపి ఆకట్టుకున్నారు. ప్రారంభంలో కథ స్లోగా నడుస్తున్నట్లు అనిపించినా.. పది నిమిషాలకే అందరు కథలో లీనమవుతారు. ఫస్టాఫ్‌లో మూర్తి ఫ్యామిలీ కష్టాలతో పాటు డీజే సాధన వంటివి చూపించారు. ఇక సెకండాఫ్‌ను ఫన్‌ & ఎమోషనల్‌గా నడిపి దర్శకుడు ఆకట్టున్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. అయితే ప్రధానమైన క్లైమాక్స్‌ ఇంకాస్త బెటర్‌గా రాసుకొని ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా 52 ఏళ్ల మూర్తి.. తన లక్ష్యం కోసం చేసే పోరాటం అందర్నీ మెప్పిస్తుంది. 

    టెక్నికల్‌గా.. 

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా పవన్‌ అందించిన సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. అతడు అందించిన నేపథ్య సంగీతం.. భావోద్వేగ సన్నివేశాలను మరింత హత్తుకునేలా చేసింది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

    ప్లస్‌ పాయింట్స్‌

    • అజయ్‌ ఘోష్‌ నటన
    • భావోద్వేగ సన్నివేశాలు
    • ప్రీ క్లైమాక్స్‌

    మైనస్‌ పాయింట్స్‌

    • స్లో నారేషన్‌
    • క్లైమాక్స్‌

    Telugu.yousay.tv Rating : 3/5  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv