ఒకప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ అట్రాక్టింగ్ కపుల్ అనగానే ముందుగా నాగచైతన్య – సమంతల జంట గుర్తుకు వచ్చేది. ‘ఏం మాయ చేశావే’ సినిమా షూటింగ్ సమయంలో చైతు, సమంత మధ్య పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ముందు స్నేహంగా తర్వాత ప్రేమగా మారిపోయింది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకున్నారు. ఏమైందో ఏమో కొంత కాలానికే విడాకులు తీసుకొని ఫ్యాన్స్‌ను షాకిచ్చారు. అప్పటి నుంచి వీరిద్దరు ఎదురుపడిన సందర్భాలు ఎక్కడ కనిపించలేదు. బహిరంగంగా ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోనూలేదు. అయితే విడాకుల తర్వాత తొలిసారి వీరు ఒకే వేదికపై మెరిశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఒకే వేదికపై ఎందుకు వచ్చారంటే?
మంగళవారం సాయంత్రం ముంబయిలో అమెజాన్ ప్రైమ్ కంపెనీ తమ ఓటీటీలో రాబోయే సినిమాలు, సిరీస్‌ల గురించి స్పెషల్ ఈవెంట్ నిర్వహించింది. దీనికి సినీ పరిశ్రమల నుంచి ఆయా సినిమాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు, దర్శకులు హాజరయ్యారు. సమంత (Samantha) లీడ్ రోల్‌లో చేసిన ‘సిటాడెల్ హనీ బన్నీ’ (Citadel Honey Bunny) సిరీస్ కూాడా త్వరలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో సమంతతో పాటు సిరీస్ యూనిట్ అంతా ఈవెంట్‌లో పాల్గొని తమ సిరీస్‌ను ప్రమోట్ చేసుకున్నారు. అటు నాగ చైతన్య ‘దూత 2’ సిరీస్ కూడా త్వరలో రిలీజ్ కానుండటంతో అతడు కూడా ఈవెంట్‌కు హజరయ్యాడు. విడిపోయిన ఈ జంట తొలిసారి ఒకే కార్యక్రమంలో పాల్గొనడంతో అందరి దృష్టి వీరిపై పడింది.
చైతు – సమంత మాట్లాడుకున్నారా?
అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌లో సమంత, నాగ చైతన్య ఒకేసారి ప్రత్యక్షం కావడం టాలీవుడ్‌తో పాటు సోషల్‌మీడియాలోను పలు చర్చలకు దారితీసింది. ఒకే వేదికపై ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారా? కలుసుకున్నారా? ఏమైనా మాట్లాడుకున్నారా? అని నెటిజన్లు ఆసక్తికరంగా సందేహాలు వ్యక్తం చేశారు. ఒకే ఈవెంట్లో చైతన్య, సమంత అంటూ వీడియోలు, ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఇద్దరి అభిమానులు కూడా చైతు, సామ్ సిరీస్‌లని ప్రమోట్ చేస్తుండటంతో ‘దూత 2 వర్సెస్ సిటాడెల్’ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
అతి త్వరలో స్ట్రీమింగ్‌లోకి..
మొత్తానికి ఈ జంట ఒకేటైంలో ఒక వేదికపై కనిపిస్తే బాగుండు అని ఆశపడ్డ ఫ్యాన్స్ ఇది కనువిందు లాంటి దృశ్యం అని చెప్పాలి. కాగా, సమంత నటించిన ‘సిటాడెల్ ఇండియా వెర్షన్’ త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించాడు. ఇటీవల ఈ సిరీస్ పేరును మేకర్స్ ‘సిటాడెల్: హనీ బన్నీ’గా మార్చిన సంగతి తెలిసిందే. అటు గతేడాది నాగచైతన్య (Naga Chaitanya) నటించిన ‘ధూత’ వెబ్ సిరీస్ సీజన్ 1 ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘ధూత 2’ త్వరలోనే ప్రైమ్‌లోకి రాబోతోంది.
Celebrities Featured Articles
Revanth Reddy: సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హీరోయిన్.. సినీ పెద్దల భేటిపై మరో నటి ఫైర్!