టాలీవుడ్ నటులు నరేశ్, పవిత్ర వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులుగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని కొద్దిరోజుల తర్వాత స్వయంగా వెల్లడించారు నరేశ్.
ఆశీస్సులు కోరుకుంటూ..
“మా నూతన ప్రయాణానికి ఆశీస్సులు కోరుతున్నా. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడడుగులు మీ ఆశీస్సులు కోరుకుంటూ పవిత్రా నరేశ్ ” అని వీడియో పెట్టారు.
హనీమూన్ ఎక్కడంటే?
వివాహం జరిగిన వెంటనే దుబాయ్ వెళ్లిందీ ఈ కొత్త జంట. అక్కడ పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తూ హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. చెట్టాపట్టాలు వేసుకుని దుబాయి మొత్తం కలియతిరుగుతున్నారు.
శుభాకాంక్షలు
నరేశ్, పవిత్ర జంటకు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కలకాలం ఇలాగే కలిసి ఉండాలని ఫ్యాన్స్ ఆశీర్వదిస్తున్నారు. మరికొందరూ ఈసారైన విడాకులు ఇవ్వకుండా జీవితాంతం పవిత్రతో కలిసి ఉండాలని సూచిస్తున్నారు.
ఆయనకి 3 ఆమెకి 2
ఇప్పటికే నరేశ్‌కు మూడుసార్లు పెళ్లి అయ్యింది. పవిత్రతో ఆయనకు నాలుగో వివాహం. పవిత్రకి కూడా ఇది రెండో పెళ్లి. పవిత్ర మొదటి భర్త పేరు సుచేంద్ర. ఆయన కన్నడ సీరియళ్లలో నటించాడు.
కొద్దిరోజులుగా సహజీవనం
భార్యతో విడిపోయిన తర్వాత నుంచి నరేశ్, పవిత్ర మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి కొద్దిరోజులుగా కలిసే ఉంటున్నారు.
ముద్దుతో ప్రకటన
కొత్త సంవత్సరం రోజున పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు ఈ జంట. అదర చుంబనంతో వీడియో విడుదల చేసి అందరికి షాకిచ్చారు.
మా ఎన్నికలే సాక్ష్యం
మా అసోసియేషన్ ఎన్నికల వేళ నరేశ్‌కు మద్దతుగా ప్రచారం చేసింది పవిత్ర. విజయం తర్వాత ఆయన ఐ లవ్‌యూ పవిత్ర అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
కలిసి నటించిన సినిమాలు
వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. లక్ష్మి రావే మా ఇంటికి, మిడిల్ క్లాస్ అబ్బాయ్, సమ్మోహనం, హ్యపీ వెడ్డింగ్, ఎంత మంచివాడవురా, అంటే సుందరానికిలో నటనతో మెప్పించారు.
రమ్య రఘుపతి
నరేశ్, పవిత్రలు ఒకే హోటల్‌లో ఉన్నప్పుడు రమ్య అక్కడ రచ్చరచ్చ చేసింది. వారిద్దరికి పెళ్లి జరగనివ్వకుండా అడ్డుకుంటానని విమర్శలు చేసింది రమ్య.
ఫిర్యాదుల వెల్లువ
నరేశ్, రమ్యల వివాదం పోలీస్ స్టేష్‌కు చేరింది. తనని చంపేందుకు కుట్ర పన్నారంటూ ఆమెపై ఫిర్యాదు చేశాడు నరేశ్.