ఇండియన్ టెక్ బ్రాండ్ నాయిస్ (Noise) మరో బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. నాయిస్ కలర్‌ఫిట్ థ్రైవ్ (Noise Colorfit Thrive) పేరుతో కొత్త ప్రొడక్ట్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. యూత్ అంచనాలకు తగ్గట్లు ఈ స్మార్ట్‌వాచ్‌ను తయారు చేసినట్లు కంపెనీ చెబుతోంది. తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లను ఇందులో పొందుపరిచినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ‘నాయిస్ కలర్‌ఫిట్ థ్రైవ్’ వాచ్ ఫీచర్లు, ధర గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
వాచ్ స్క్రీన్
నాయిస్ కలర్‌ఫిట్ థ్రైవ్ స్మార్ట్‌వాచ్ 1.85 అంగుళాల స్క్వేర్ డిస్ప్లేతో వచ్చింది. ఇది 550 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఔట్ డోర్స్లోనూ ఈ వాచ్ స్ట్రెయిన్-ఫ్రీ, కంటిన్యూస్ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. వాయిస్ అసిస్టెంట్‌తో పాటు బ్లూటూత్ కాలింగ్ స్పెసిఫికేషన్లు దీంట్లో ఉంటాయి.
హెల్త్ మానిటరింగ్
ఈ స్మార్ట్‌వాచ్ అడ్వాన్స్డ్ ప్రొడక్టివిటీ, హెల్త్ మానిటరింగ్ ఫీచర్స్ ఆఫర్ చేస్తోంది. ఈ డివైజ్ హార్ట్ రేట్, SpO2, స్లీప్ ప్యాట్రన్, స్ట్రెస్ లెవల్స్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఫీమేల్ హెల్త్ సైకిల్ ట్రాకర్ వంటి హెల్త్ ఫీచర్లను మానిటర్ చేస్తుంది.
వెదర్ అప్డేట్స్
ఈ వాచ్ డైలీ రిమైండర్స్, వెదర్ అప్డేట్స్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌తో యూజర్లు రీసెంట్ కాల్ హిస్టరీని యాక్సెస్ చేయవచ్చు. గరిష్టంగా 8 కాంటాక్ట్స్‌ను వాచ్‌లో సేవ్ చేసుకోవచ్చు.
ఇన్‌బిల్ట్ గేమ్స్
నాయిస్ కలర్‌ఫిట్ థ్రైవ్ స్మార్ట్‌వాచ్‌లో 100 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లను డివైజ్ ఆఫర్ చేస్తోంది. ఇన్‌బిల్ట్ గేమ్స్‌తో ఈ స్మార్ట్‌వాచ్ రావడం విశేషం.
బ్యాటరీ లైఫ్
కలర్‌ఫిట్ థ్రైవ్ స్మార్ట్‌వాచ్‌కు స్ట్రాంగ్ బ్యాటరీ లైఫ్ అందించారు. ఒకసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల పాటు నిర్విరామంగా బ్యాటరీ వర్క్ చేయనుంది. IP67 రేట్‌తో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్కు ఇది సపోర్ట్ చేస్తుంది.
వాచ్ కలర్స్
ఈ వాచ్ ఆరు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. డీప్ వైన్, కామ్ బ్లూ, కోరల్ పింక్, జెట్ బ్లాక్, సిల్వర్ గ్రే, మిడ్నైట్ బ్లూ వంటి కలర్స్‌లో ఇది అందుబాటులోకి వచ్చింది.
ధర ఎంతంటే?
ప్రముఖ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, కంపెనీ వెబ్సైట్ gonoise.comలో Noise Colorfit Thrive వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ ప్రొడక్ట్ రూ.1299కు అందుబాటులో ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!