• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nowruz : ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా… దాని ప్రత్యేకత తెలుసా?

    ప్రత్యేకమైన సందర్భాల వేళ గూగుల్ తన డూడుల్‌ను మారుస్తుంది. పండుగలు, మహనీయులను గుర్తు చేసుకుంటూ పెడతారు. ప్రస్తుతం ఇవాళ్టి డూడుల్(doodle) గురించి చర్చ జరుగుతోంది. ఇరానీయన్‌ కొత్త సంవత్సరం నౌరోజ్‌ను సెలబ్రేట్‌ చేస్తూ డూడుల్‌ను మార్చారు. తులిప్స్‌, హైసింత్స్, డఫోడిల్స్‌, తేనేటీగల వంటి వాటితో దీన్ని రూపొందించింది. 

    పార్శీల పండుగ

    నౌరోజ్‌వేడుకను ప్రపంచవ్యాప్తంగా పార్శీయులు జరుపుకుంటారు. వసంత రుతువు ప్రారంభమే పార్శీయులకు కొత్త సంవత్సరం. అందుకే వసంత రుతువులో లభించే పువ్వులు, సువాసన కలిగిన చెట్లకు సంబంధించిన డూడుల్‌ను గూగుల్ తీర్చిదిద్దింది. దానిపై క్లిక్ చేయగానే ఈ వేడుకకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు. 

    శీతాకాలం ముగిసిపోతూ ఉత్తరార్ధ గోళం కరిగిపోతున్నప్పుడు నౌరోజ్‌ను నిర్వహిస్తారు. వసంత రుతువు ప్రారంభోత్సవాన్ని ఈ పండుగ గుర్తు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 మిలియన్ ప్రజలు ప్రతి సంవత్సరం వేడుకను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీనిని ఇంటర్నేషనల్ హాలీడేగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. 

    image credit wikimedia commons

    దక్షిణ, ఉత్తర ఆసియాతో పాటు నల్ల సముద్రం పరిసరాలు తూర్పు మధ్యస్థ భాగంలో నౌరోజ్ పండుగను నిర్వహిస్తుంటారు. కుటుంబాలు అన్ని కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అందువల్లే సెలవుదినంగా ప్రకటించారు. 

    ప్రత్యేకత

    నవ్‌ అంటే కొత్త రోజ్‌ అంటే రోజు అని అర్థం వస్తుందని చెబుతుంటారు. ఇది ఇరానీయన్ క్యాలెండర్ ప్రారంభానికి నాందిగా భావిస్తారు.  దాదాపు 3 వేల సంవత్సరాల నుంచి పార్శీయులు పండుగను జరుపుతున్నారు. 

    నౌరోజ్‌ సందర్భంగా పార్శీయులు ఇంటిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. వసంత రుతువుకు స్వాగతం పలుకుతూ కూరగాయలతో భోజనం చేస్తారు. ఈ పండుగ సరిగ్గా ఉగాదిని పోలీ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. 

    image credit wikimedia commons
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv