నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్‌టీఆర్ ఇప్పుడు తనకంటూ ఒక ఫ్యాన్ బేస్‌ను ఏర్పరుచుకున్నాడు. తన నటన, డ్యాన్స్‌లతో క్లాస్, మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇండస్ట్రీలో టాప్ హీరో స్థానానికి ఎదిగేందుకు కారణమైన ఎన్‌టీఆర్ బెస్ట్ టాప్5 సినిమాలేంటో చూద్దాం
1.ఆది(2002)
2002లో విడుదలైన ఆది సినిమా ఎన్‌టీఆర్‌లో మాస్ యాంగిల్‌ను బయటకు తీసింది. వి.వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్యాక్షన్ గొడవల నేపథ్యంలో తెరకెక్కింది. కాలేజ్ స్టూడెంట్‌గా..ఫ్యాక్షన్ ఫ్యామిలీలో పుట్టిన వారసుడిగా రెండు షేడ్స్‌లో ఎన్‌టీఆర్ నటనకు థియేటర్లలో ఈలలు గోలలు పడ్డాయి. ఒక్కసారి తొడగొట్టు చిన్న డైలాగ్ అప్పట్లో ఫేమస్‌గా మారింది. అప్పటివరకు సాఫ్ట్‌గా..లవర్‌బాయ్‌గా కనిపించిన ఎన్‌టీఆర్ ఈ సినిమాతో మాస్ ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నాడు.
2.సింహాద్రి(2003)
ఎన్‌టీఆర్‌తో దర్శకుడిగా తన మొదటిసినమా స్టూడెంట్ నెం.1 తెరకెక్కించిన రాజమౌళి..మరోసారి సింహాద్రి కోసం ఎన్‌టీఆర్‌ను ఎంచుకున్నాడు. ఈ సినిమాలో సెంటిమెంట్‌తో పాటు..రాజమౌళి సినిమాలో ఉండే యాక్షన్ సీన్లు, పాటలు దుమ్మురేపాయి. అప్పటల్లో ఈ చిత్రం ఘనవిజయం సాధించి ఎన్‌టీఆర్‌తో పాటు, దర్శకుడికి మంచి పేరు తెచ్చిపెట్టింది.
3.అదుర్స్ (2010)
వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం కామెడితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. బ్రహ్మానందంతో కలిసి ఎన్‌టీఆర్ చేసిన కామెడి ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమాతో ఎన్‌టీఆర్ కామెడీ టైమింగ్ అందరికీ నచ్చేసింది. ఇప్పటికీ ఆ సినిమా డైలాగ్స్..మీమ్స్ ట్రెండ్ అవుతుంటాయంటే ఆ సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్రాహ్మణుడి గెటప్‌లో ఎన్‌టీఆర్ యాక్టింగ్, ఆయన బాష, ఆ సినిమా కోసం తనను తాను మలుచుకున్న విధానంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఎన్‌టీఆర్.
4.టెంపర్(2015)
సెకండ్ ఇన్నింగ్స్ లాంటి సినిమా టెంపర్. ప్లాప్‌లతో అల్లాడుతున్న తారక్‌ను విజయాల బాట పట్టించిన సినిమా ఇది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం, వక్కతం వంశీ రాసిన కధ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పూరీజగన్నాథ్ సినిమాల్లో హీరోలకు ఉండే ప్రత్యేక డైలాగ్స్, యాక్టింగ్‌తో ఎన్‌టీర్ ప్రేక్షకులను మెప్పించాడు. అప్పటివరకు ఎప్పుడు చూడని విధంగా ఎన్‌టీఆర్ ఈ సినిమాలో సిక్స్‌ప్యాక్‌లో కనిపించాడు. ఒక అవినీతి పోలిస్ అధికారి పాత్రలో నటించి మెప్పించాడు. క్లైమాక్స్‌లో ఉండే కోర్టు సీన్‌లో ఎన్‌టీఆర్ నటన రక్తికట్టిస్తుంది. 2015లో సూపర్‌హిట్‌గా నిలిచింది ఈ సినిమా.
5. అరవింద సమేత(2018)
డైరెక్టర్ త్రివిక్రమ్-ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. రాయలసీమలో జరుగుతున్న ప్యాక్షన్ గొడవలను అపడానికి హీరో పడే ఆవేదనను చాలా చక్కగా మలిచారు. ఈ సినిమాలో చక్కటి సందేశంతో పాటు..ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించారు. త్రివిక్రమ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. 2018 లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బారీ విజయం సాధించింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్(RRR). ఎన్‌టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్‌టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్‌చరణ్ సీతారామరాజుగా నటించారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్‌టీఆర్ చేసిన నాలుగో సినిమా ఇది. విడుదలకు ముందే రికార్డులను క్రియేట్ చేసిన సినిమా మార్చి 25న రిలీజ్ తర్వాత ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!