నటీనటులు: వరుణ్‌తేజ్, మానుషి చిల్లర్, నవదీప్, మిర్ సర్వర్, రుహానీ శర్మ తదితరులు
దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హడా
సంగీతం: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంతం
ఎడిటింగ్: నవీన్ నూలి
సంభాషణలు: సాయి మాధవ్ బుర్రా
నిర్మాత: సోనీ పిక్చర్స్, సందీప్ ముద్ద
విడుదల: 01-03-2024
వరుణ్‌తేజ్ (Varun Tej) హీరోగా దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine). మానుషి చిల్లర్ (Manushi Chhillar) కథానాయిక. మన వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సినిమాలో చూపించనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. తెలుగులో రూపొందిన తొలి ఏరియల్ యాక్షన్ చిత్రం ఇదే కావడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఏకకాలంలో నిర్మాణం జరుపుకొని ఇవాళ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఫైటర్ పైలట్ పాత్రలో ఎలా చేశాడు? వరుణ్ ఖాతాలో హిట్ పడిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథ
అర్జున్ రుద్రదేవ్ అలియాస్ రుద్ర (వరుణ్‌తేజ్) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో స్వ్కాడ్రన్ లీడర్. ‘ఏం జరిగినా చూసుకుందాం’ అంటూ దూకుడు ముందుకు వెళ్లిపోతుంటాడు. వైమానిక దళంలోనే పనిచేసే రాడార్ ఆఫీసర్ అహనా గిల్ (మానుషి చిల్లర్)తో రుద్ర ప్రేమలో ఉంటాడు. ప్రాజెక్ట్ వజ్ర కోసం నడుం కట్టిన సమయంలోనే రుద్రకు ఓ చేదు అనుభవం ఎదురవుతుంది. దాన్నుంచి బయటపడుతున్న క్రమంలోనే అతడు ఆపరేషన్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. ఆ ఆపరేషన్ వెనక ఉన్న కథేమిటి? ప్రాజెక్ట్ వజ్ర లక్ష్యమేమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
వరుణ్ తేజ్ (Operation Valentine Review in telugu) కెరీర్ బెస్ట్ నటనతో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. నిజమైన ఫైటర్ పైలెట్‌లా తన పాత్రలో ఒదిగిపోయాడు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ మంచి పరిణితి కనబరిచి ప్రతిభ చూపించాడు. హీరోయిన్‌గా మానుషి చిల్లర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించింది. దాదాపుగా సినిమా అంతా హీరో హీరోయిన్లే తెరపై కనిపిస్తారు. వీళ్ల జంట చూడటానికి చాలా బాగుంది. మిగిలిన పాత్రలన్నీ పరిమితంగానే కనిపిస్తాయి. వారు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించాడు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన నిజమైన సంఘటనల స్ఫూర్తితో డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ చిత్రాన్ని రూపొందించారు. 2019లో ఉగ్రవాదులు జరిపిన పుల్వామా దాడులు మొదలుకొని, దానికి ప్రతిగా భారత వైమానిక దళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ వరకూ పలు సంఘటనలు ఇందులో ప్రతిబింబిస్తాయి. శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం, దేశ భక్తి ప్రధానంగా సాగే సీన్స్, పతాక సన్నివేశాలను డైరెక్టర్ చాలా బాగా తెరకెక్కించారు. అయితే నాయకా నాయికల మధ్య సాగే ప్రేమకథలోనే గాఢత చూపలేకపోయారు. కథ దాదాపుగా అందరికే తెలిసిందే కావడం.. రచన పరంగా మరిన్ని కసరత్తులు చేయకపోవడం మైనస్ అని చెప్పవచ్చు. ఇక కథనంలో కూడా ఎక్కడ బలం ఉన్నట్లు అనిపించదు. ఈ మధ్యే వచ్చిన ‘ఫైటర్’ కథకి ఆపరేషన్ వాలెంటైన్ స్టోరీకి దగ్గరి పోలికలు కనిపిస్తాయి.
టెక్నికల్‌గా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా విజువల్స్ ఆకట్టుకుంటాయి. (Operation Valentine Review in telugu) మిక్కీ జె.మేయర్ సంగీతం మెప్పిస్తుంది. యాక్షన్ సన్నివేశాలను నేపథ్య సంగీతం చాలా బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్ పరంగా పరిమితులున్నా నాణ్యమైన విజువల్స్‌తో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ప్లస్ పాయింట్స్
- వరుణ్‌తేజ్ నటన
- విజువల్స్
- యుద్ధ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
- కథనం
- హీరో, హీరోయిన్ కెమెస్ట్రీ
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ